Medak District Court Jobs 2022: మెదక్‌ జిల్లా డిస్ట్రిక్ట్‌ అండ్‌ సెషన్స్‌ కోర్టులో ఉద్యోగాలు.. టెన్త్‌/డిగ్రీ పాసైన వాళ్లు అర్హులు..

తెలంగాణ రాష్ట్రంలోని మెదక్‌లోనున్న ప్రిన్సిపల్‌ డిస్ట్రిక్ట్‌ అండ్‌ సెషన్స్‌ కోర్టు.. ఒప్పంద ప్రాతిపదికన 12 సీనియర్‌ సూపరింటెండెంట్‌, సీనియర్‌ అసిస్టెంట్‌, స్టెనోగ్రాఫర్‌ గ్రేడ్‌-3 తదితర పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ..

Medak District Court Jobs 2022: మెదక్‌ జిల్లా డిస్ట్రిక్ట్‌ అండ్‌ సెషన్స్‌ కోర్టులో ఉద్యోగాలు.. టెన్త్‌/డిగ్రీ పాసైన వాళ్లు అర్హులు..
Medak District Court Recruitment 2022
Follow us
Srilakshmi C

|

Updated on: Oct 31, 2022 | 6:54 PM

తెలంగాణ రాష్ట్రంలోని మెదక్‌లోనున్న ప్రిన్సిపల్‌ డిస్ట్రిక్ట్‌ అండ్‌ సెషన్స్‌ కోర్టు.. ఒప్పంద ప్రాతిపదికన 12 సీనియర్‌ సూపరింటెండెంట్‌, సీనియర్‌ అసిస్టెంట్‌, స్టెనోగ్రాఫర్‌ గ్రేడ్‌-3, జూనియర్ అసిస్టెంట్‌, డ్రైవర్‌, టైపిస్ట్‌, ఆఫీస్‌ సబార్డినేట్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పోస్టును బట్టి పదో తరగతి, డిగ్రీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే ఇంగ్లిష్‌ టైప్‌ రైటింగ్‌, డ్రైవింగ్‌ వచ్చి ఉండాలి. కంప్యూటర్‌ బేసిక్స్‌ తెలిసి ఉండాలి. అభ్యర్ధుల వయసు 18 నుంచి 34 ఏళ్ల మధ్య ఉండాలి. ఈ అర్హతలున్న అభ్యర్ధులు ఆఫ్‌లైన్‌ విధానంలో నవంబర్‌ 26, 2022వ తేదీలోపు కింది అడ్రస్‌కు పోస్టు ద్వారా దరఖాస్తులు పంపించవల్సి ఉంటుంది. నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. ఇతర సమాచారం అధికారిక వెబ్‌సైట్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

పోస్టుల వివరాలు..

  • సీనియర్‌ సూపరింటెండెంట్‌ పోస్టులు: 1
  • సీనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులు: 1
  • స్టెనోగ్రాఫర్‌ గ్రేడ్‌-3 పోస్టులు: 1
  • జూనియర్ అసిస్టెంట్‌ పోస్టులు: 2
  • డ్రైవర్‌ పోస్టులు: 1
  • టైపిస్ట్‌ పోస్టులు: 2
  • ఆఫీస్‌ సబార్డినేట్‌ పోస్టులు: 4

అడ్రస్‌: The Principal District and Sessions Judge, District Court Complex, Medak-502110.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని కెరీర్‌ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.