విద్యార్ధిని చాక్లెట్లు దొంగతనం చేసిన వీడియో వైరల్.. అవమానంతో ఆత్మహత్య..
చాక్లెట్లు దొంగతనం చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఓ కాలేజ్ విద్యార్ధిని ఆదివారం (అక్టోబర్ 30) ఆత్మహత్యకు పాల్పడింది. వివరాల్లోకెళ్తే..
చాక్లెట్లు దొంగతనం చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఓ కాలేజ్ విద్యార్ధిని ఆదివారం (అక్టోబర్ 30) ఆత్మహత్యకు పాల్పడింది. వివరాల్లోకెళ్తే.. పశ్చిమ బెంగాల్‌లోని అలీపుర్‌దువార్ జిల్లా జైగావ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సుభాస్ పల్లికి చెందిన ఓ యువతి డిగ్రీ తృతీయ సంవత్సరం చదువుతోంది. తాజాగా సదరు యువతి తన సోదరితో కలిసి సెప్టెంబరు 29న దగ్గరిలోని ఓ షాపింగ్ మాల్‌కు వెళ్లింది. ఐతే షాపింగ్ మాల్‌లో యువతి చాక్లెట్లు దొంగిలించి మాల్ సిబ్బందికి పట్టుపడింది. దీంతో దొంగిలించిన చాక్లెట్ ధర చెల్లించి, క్షమాపణలు చెప్పి అక్కడి ఉంచి వెళ్లిపోయినట్లు మృతురాలి తండ్రి తెలిపారు.
ఐతే మాల్‌కు చెందిన కొందరు వ్యక్తులు ఈ మొత్తం సంఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో.. అదికాస్తా వైరల్ అయ్యింది. దీంతో మనస్తాపం చెందిన తన కూతురు ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ఆమె తండ్రి తెలిపారు. మృతురాలి బంధువులు, స్థానికులు షాపింగ్ మాల్ వెలుపల నిరసనకు దిగారు. వీడియో తీసి ఆన్‌లైన్‌లో పోస్ట్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లు ఓ పోలీసధికారి తెలిపారు.
మరిన్ని క్రైం వార్తల కోసం క్లిక్ చేయండి.