- Telugu News Photo Gallery Hair Care Tips: These 5 Flowers That Possess Incredible Benefits for Hair Growth
Hair Care Tips: ఈ ఐదు రకాల పువ్వులతో ఇలా చేశారంటే మీ జుట్టు వేగంగా..
వయసు పెరిగే కొద్దీ రకరకాల జుట్టు సమస్యలు వేధిస్తుంటాయి. జుట్టు రాలడం, అకాలంగా జుట్టు నెరసిపోవడం, పొడిబారడం, చివర్లు చిట్లిపోవడం వంటి సమస్యలు ప్రతి ఒక్కరు ఎదుర్కొంటారు. ప్రస్తుత బిజీ లైఫ్‌లో కాస్త సమయాన్ని వెచ్చిస్తే.. ఈ ఐదు రకాల పూలతో మీ కురులకు మళ్లీ జీవం పోయవచ్చు..
Updated on: Oct 31, 2022 | 6:30 PM

వయసు పెరిగే కొద్దీ రకరకాల జుట్టు సమస్యలు వేధిస్తుంటాయి. జుట్టు రాలడం, అకాలంగా జుట్టు నెరసిపోవడం, పొడిబారడం, చివర్లు చిట్లిపోవడం వంటి సమస్యలు ప్రతి ఒక్కరు ఎదుర్కొంటారు. ప్రస్తుత బిజీ లైఫ్‌లో కాస్త సమయాన్ని వెచ్చిస్తే.. ఈ ఐదు రకాల పూలతో మీ కురులకు మళ్లీ జీవం పోయవచ్చు. పువ్వుల్లోని పోషకాలు జుట్టుకు బలం, ఆరోగ్యం చేకూరుస్తాయి. అవేంటంటే..

రోజ్ వాటర్ అందానికి మాత్రమేకాదు.. జుట్టుకు కూడా ఉపయోగించవచ్చు. తలపై అదనపు నూనె ఉత్పత్తి తగ్గించడంతోపాటు, చుండ్రు నివారణకు, పొడిబారిన జుట్టును మెత్తగా మార్చడానికి సహాయపడుతుంది. ముందుగా గులాబీ రేకుల్ని ఎండబెట్టి మొత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత అందులో కొన్ని చుక్కల కొబ్బరినూనె, రోజ్ వాటర్, తేనె కలిపి హెయిర్ ప్యాక్‌లా వేసుకోవచ్చు.

మందార పువ్వులో విటమిన్ సి తగినంత మొత్తంలో ఉంటుంది. ఇది జుట్టుకు సహజ పోషణనిస్తుంది. పువ్వు మాత్రమేకాకుండా, మందరా ఆకులు కూడా జుట్టు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. జుట్టు రాలడాన్ని నివారించాలంటే.. 5-6 మందార పువ్వులను గ్రైండ్ చేసుకుని తలకు పట్టించాలి. దీనిలో కొంచెం కొబ్బరి నూనె కూడా మిక్స్ చేసి తలకు పెట్టుకోవచ్చు.

మల్లెపూలకు స్కాల్ప్‌ను తేమగా, శుభ్రంగా ఉంచే లక్షణాలు ఉంటాయి.

రోజ్మేరీ ఆయిల్ వేగంగా జుట్టు వేగంగా పెరుగడానికి ఉపయోగపడుతుంది. రోజ్మేరీ పువ్వు నుంచి తీసిన రసం తలకు పట్టిస్తే రక్త ప్రసరణను మెరుగుపరచడంతోపాటు, సహజంగా జుట్టు పెరుగుదల ప్రోత్సహిస్తుంది. ఇది జుట్టు రాలడం, బట్టతల, చుండ్రు సమస్యలను నివారిస్తుంది.

విటమిన్-సి సమృద్ధిగా ఉండే బెర్గమోట్ పువ్వులు తలకు పోషణనిచ్చి, శుభ్రపరుస్తాయి. జుట్టుకు సహజసిద్ద కండిషనర్‌గా పనిచేయడమేకాకుండా, కురులను బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. దీనిలో యాంటీ మైక్రోబియల్, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది వేగంగా జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.





























