- Telugu News Photo Gallery Political photos Morbi bridge collapse: PM Modi meets people involved in rescue, extended help for victims family members
PM Modi: మోర్బీ వంతెన బాధితులను పరామర్శ, సహాయక చర్యలను వేగవంతం చేయండి: ప్రధాని మోడీ(ఫోటోలు)
గుజరాత్ మోర్బి కేబుల్ బ్రిడ్జి ప్రమాదంపై ప్రధాని మోదీ అత్యున్నత సమీక్ష నిర్వహించారు. మోర్బిలో వంతెన కూలిన ప్రదేశాన్ని మోదీ పరిశీలించారు
Prudvi Battula | Edited By: Ravi Kiran
Updated on: Nov 01, 2022 | 8:08 PM

గుజరాత్ మోర్బి కేబుల్ బ్రిడ్జి ప్రమాదంపై ప్రధాని మోదీ అత్యున్నత సమీక్ష నిర్వహించారు. మోర్బిలో వంతెన కూలిన ప్రదేశాన్ని మోదీ పరిశీలించారు.

అసలు ప్రమాదం ఎలా జరిగిందన్న విషయంపై ఆరా తీశారు. సహాయక చర్యల తీరును మోదీ పరిశీలించారు. ప్రమాదంలో గాయపడ్డ వాళ్లను అన్నివిధాలా ఆదుకోవాలని సూచించారు.

మోర్బి ప్రభుత్వాసుపత్రికి వెళ్లారు మోదీ. కేబుల్ వంతెన కూలిన ఘటనలో గాయపడ్డ వాళ్లను పరామర్శించారు. ప్రమాదానికి కారకులైన వాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

ప్రమాదంలో ఆప్తులను కోల్పోయిన వాళ్లను కూడా ప్రధాని మోదీ పరామర్శించారు. ఒరెవా కంపెనీపై కేసు నమోదు చేసిన పోలీసులు ఈ కేసులో 9 మందిని అరెస్ట్ చేశారు.

అక్టోబరు 30న ప్రమాదం జరిగిన తర్వాత.. ప్రమాదంలో మరణించిన వారికి ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి (PMNRF) నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. మోర్బిలో జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ప్రతి ఒక్కరికి పిఎమ్‌ఎన్‌ఆర్‌ఎఫ్ నుంచి రూ. 2 లక్షల ఎక్స్‌గ్రేషియాను ప్రధాని మోడీ ప్రకటించారని ప్రధాని కార్యాలయం ట్వీట్ చేసింది.

గాయపడిన వారికి 50,000 అందజేయనున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, ఇతర అధికారులతో ప్రధాని మోడీ మాట్లాడి.. సహాయక చర్యలను వేగవంతం చేయాలని కోరారు.

కేబుల్ వంతెన కూలిన ఘటనలో 135 మంది చనిపోయారు. నదిలో చిక్కుకున్న 100 మృతదేహాలను వెలికితీయడానికి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఆర్మీ ,ఎయిర్‌ఫోర్స్‌తో పాటు ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

ఈ ప్రమాదంపై గుజరాత్ ప్రభుత్వం నియమించిన సిట్ బృందం దర్యాప్తు చేస్తోంది. కెపాసిటీకి మించి జనం వంతెనపై చేరడం తోనే ప్రమాదం జరిగినట్టు ప్రాథమిక దర్యాప్తులో తేలింది.





























