Telangana: తెలంగాణ పదో తరగతి విద్యార్ధులకు గుడ్‌న్యూస్! పబ్లిక్ పరీక్షలు ఆరు పేపర్లకే.. విద్యా శాఖ ఉత్తర్వులు జారీ
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించి పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్ధులకు విద్యాశాఖ తీపికబురు చెప్పింది. గత ఏడాది మాదిరిగానే ఈ సంవత్సరం కూడా పదో తరగతి పబ్లిక్ పరీక్షలు కేవలం 6 పేపర్లకు మాత్రమే నిర్వహించనున్నట్లు అన్ని స్కూళ్లకు..
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించి పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్ధులకు విద్యాశాఖ తీపికబురు చెప్పింది. గత ఏడాది మాదిరిగానే ఈ సంవత్సరం కూడా పదో తరగతి పబ్లిక్ పరీక్షలు కేవలం 6 పేపర్లకు మాత్రమే నిర్వహించనున్నట్లు అన్ని స్కూళ్లకు తెలంగాణ విద్యాశాఖ బుధవారం (నవంబర్ 2) వెల్లడించింది. ఈ మేరకు మోడల్ స్కూళ్లు, గురుకుల విద్యాలయాలు, కేజీబీవీలతో పాటు అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలకు అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకుండా సమ్మెటివ్ అసెస్‌మెంట్-II పరీక్షలను కూడా తొమ్మిదో తరగతి, పదో తరగతి విద్యార్ధులకు 6 పేపర్లకే నిర్వహించాలని తన ఉత్తర్వుల్లో పేర్కొంది. అంటే ప్రతి సబ్జెక్టుకు ఒక్కో పేపర్ చొప్పున ఒక్కో పరీక్ష మాత్రమే నిర్వహిస్తారన్నమాట.
కాగా 2021లో కరోనా మహమ్మారి కారణంగా 11 పేపర్లకు బదులు 6 పేపర్లతో పదో తరగతి పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఐతే ఆ ఏడాది కోవిడ్ మహమ్మారి కారణంగా పరీక్షల నిర్వహణ సాధ్యం కాలేదు. విద్యార్ధులందరినీ ఆల్‌పాస్ చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇక ఈ విద్యాసంవత్సరం కూడా పదో తరగతి పరీక్ష 2023లను ఆరు పేపర్లకే నిర్వహించనున్నట్లు విద్యాశాఖ స్పష్టం చేసింది.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.