AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Drug Case: డ్రగ్స్ కేసులో కీలక సూత్రధారి ఎడ్విన్‌ అరెస్ట్‌.. ఇవాళ సాయంత్రం హైదరాబాద్‌కు..!

డ్రగ్స్ కేసులో కీలక సూత్రధారిని నార్కోటిక్‌ పోలీసులు అరెస్టు చేశారు. డ్రగ్స్‌ సరఫరాలో కీలకంగా వ్యవహరిస్తోన్న ఎడ్విన్‌ను నార్కోటిక్‌ విభాగం పోలీసులు గోవాలో,,

Drug Case: డ్రగ్స్ కేసులో కీలక సూత్రధారి ఎడ్విన్‌ అరెస్ట్‌.. ఇవాళ సాయంత్రం హైదరాబాద్‌కు..!
Drug Case
Subhash Goud
|

Updated on: Nov 05, 2022 | 1:31 PM

Share

డ్రగ్స్ కేసులో కీలక సూత్రధారిని నార్కోటిక్‌ పోలీసులు అరెస్టు చేశారు. డ్రగ్స్‌ సరఫరాలో కీలకంగా వ్యవహరిస్తోన్న ఎడ్విన్‌ను నార్కోటిక్‌ విభాగం పోలీసులు గోవాలో అదుపులోకి తీసుకున్నారు. గోవా నుంచి హైదరాబాద్‌కు డ్రగ్స్‌ సరఫరాలో ఎడ్విన్ కీలక పాత్ర పోషించాడు. డ్రగ్స్‌ కేసులో నారాయణ బోర్కర్ అనే వ్యక్తిని 3 నెలల క్రితం నార్కోటిక్ విభాగం పోలీసులు అరెస్టు చేశారు. గోవా నుంచి డ్రగ్స్ తీసుకొస్తూ హైదరాబాద్‌లో సరఫరా చేయడంలో నారాయణ బోర్కర్‌ది కీలక పాత్ర. అతను ఇచ్చిన సమాచారంతో నార్కోటిక్‌ విభాగం పోలీసులు గోవాలో పలువురిపై నిఘా పెట్టారు.

డ్రగ్‌ కింగ్‌పిన్‌ ఎడ్విన్‌ గత 3 నెలలుగా గోవాలోనే ఉంటూ తప్పించుకుంటూ తిరుగుతున్నారు. ఈ క్రమంలో 15 రోజులు ఎడ్విన్ కదలికలపై నిఘా పెట్టిన పోలీసులు గోవాలో అతన్ని అరెస్ట్ చేశారు. ఎడ్విన్‌ గోవా నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి హైద్రాబాద్‌లో సరఫరా చేస్తున్నాడు. పోలీసుల కళ్లుగప్పి కొన్నేళ్లుగా ఎడ్విన్‌ దేశవ్యాప్తంగా డ్రగ్స్ సరఫరా చేస్తున్నాడు. ప్రధానంగా ముంబై, ఢిల్లీ, కర్నాటక, గోవా, హైదరాబాద్‌, తమిళనాడు రాష్ట్రాలకు ఎడ్విన్‌ డ్రగ్స్‌ సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

డ్రగ్‌ కింగ్‌పిన్‌ ఎడ్విన్‌ను పోలీసులు ఇవాళ సాయంత్రం హైదరాబాద్‌ తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. అతడిని కస్టడీలోకి తీసుకొని లోతుగా విచారించే అవకాశం ఉంది. ఎడ్విన్‌ నోరువిప్పితే.. మరిన్ని నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్  చేయండి

పళ్లు తోముకోవడానికి బ్రష్‌ నిండా టూత్‌ పేస్ట్‌ వేసుకుంటున్నారా?
పళ్లు తోముకోవడానికి బ్రష్‌ నిండా టూత్‌ పేస్ట్‌ వేసుకుంటున్నారా?
ఫుడ్‌ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో షాకింగ్‌ విషయాలు...!
ఫుడ్‌ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో షాకింగ్‌ విషయాలు...!
జియోలో కేవలం రూ.1748 రీఛార్జ్‌తో 336 రోజుల వ్యాలిడిటీ..
జియోలో కేవలం రూ.1748 రీఛార్జ్‌తో 336 రోజుల వ్యాలిడిటీ..
ఘాటైన చూపుతో చంపేస్తున్న రాశి ఖన్నా.. బ్యూటిఫుల్ ఫొటోస్
ఘాటైన చూపుతో చంపేస్తున్న రాశి ఖన్నా.. బ్యూటిఫుల్ ఫొటోస్
కుప్పకూలిన "సునామీ స్వింగ్", ఒకరు మృతి, 13మందికి సీరియస్!
కుప్పకూలిన
శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఇక వాట్సాప్‌లో దర్శనం టిక్కెట్లు!
శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఇక వాట్సాప్‌లో దర్శనం టిక్కెట్లు!
మీ కాలేయంలోని కొవ్వును వెన్నలా కరిగించే పానియం ఇది.. తయారీ ఇలా..
మీ కాలేయంలోని కొవ్వును వెన్నలా కరిగించే పానియం ఇది.. తయారీ ఇలా..
ప్రేమలో ఉన్న ప్రతి కుర్రాడు పాడుకునే ఏకైక సాంగ్..
ప్రేమలో ఉన్న ప్రతి కుర్రాడు పాడుకునే ఏకైక సాంగ్..
చిరంజీవి రిజెక్ట్ చేసిన కథతో పవన్ కల్యాణ్ సినిమా.. కట్ చేస్తే..
చిరంజీవి రిజెక్ట్ చేసిన కథతో పవన్ కల్యాణ్ సినిమా.. కట్ చేస్తే..
కష్టాల్లో ఉన్న భారత్‌ను ఆదుకున్న సూర్య..అమెరికా టార్గెట్ 162
కష్టాల్లో ఉన్న భారత్‌ను ఆదుకున్న సూర్య..అమెరికా టార్గెట్ 162