Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bhimavaram: గూండాల్లా మారిన స్టూడెంట్స్.. కర్రలతో తోటి విద్యార్థిపై దాడి.. . ఐరన్‌ బాక్స్‌తో ఛాతిపై వాతలు

వారంతా ఒకే కాలేజ్.. ఒకే హాస్టల్ లో ఉంటున్నారు. రోజూ కాలేజీకి వెళ్లి చదువుకోవడమే వారి పని. కానీ వారి మధ్య ప్రేమ చిచ్చు పెట్టింది. అనుమానంతో తోటి విద్యార్థి అని కూడా చూడకుండా తీవ్రంగా కొట్టారు. కర్రలతో దాడి చేసి తీవ్రంగా..

Bhimavaram: గూండాల్లా మారిన స్టూడెంట్స్.. కర్రలతో తోటి విద్యార్థిపై దాడి.. . ఐరన్‌ బాక్స్‌తో ఛాతిపై వాతలు
Attack
Follow us
Ganesh Mudavath

|

Updated on: Nov 05, 2022 | 1:15 PM

వారంతా ఒకే కాలేజ్.. ఒకే హాస్టల్ లో ఉంటున్నారు. రోజూ కాలేజీకి వెళ్లి చదువుకోవడమే వారి పని. కానీ వారి మధ్య ప్రేమ చిచ్చు పెట్టింది. అనుమానంతో తోటి విద్యార్థి అని కూడా చూడకుండా తీవ్రంగా కొట్టారు. కర్రలతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. తనను వదిలేయాలని వేడుకున్నా కనికరం చూపకుండా కొడుతూనే ఉన్నారు ఈ శాడిస్ట్ స్టూడెంట్స్. అంతటితో ఆగకుండా ఏదో ఘనకార్యం చేస్తు్న్నట్లు ఫీలయ్యి.. వీడియో తీశారు. దీనిని సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. ఇంకేం ఉంది. సీన్ రివర్స్ అయింది. విషయం బయటకు పాకింది. వీడియో వైరల్ గా మారడంతో స్థానికులు పెద్దఎత్తున కాలేజీ వద్దకు చేరుకున్నారు. బాధితుడి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పశ్చిమ గోదావరి జిల్లాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది.

చక్కగా చదువుకుని జీవితానికి ఉన్నత బాటలు వేసుకోవాల్సిన ఆ స్టూడెంట్స్.. తోటి విద్యార్థి పట్ల అమానుషంగా ప్రవర్తించారు. ఎస్ఆర్‌కేఆర్ కాలేజ్ హాస్టల్ లో జరిగిన ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. హాస్టల్‌లో ఇంజినీరింగ్‌ విద్యార్థుల మధ్య చెలరేగిన ఘర్షణ తీవ్ర పరిణామాలకు దారి తీసింది. ఓ విద్యార్థిపై నలుగురు విద్యార్థులు దాడి చేశారు. దారుణంగా చితకబాదారు. అంతటితో ఆగకుండా ఐరన్ బాక్స్‌తో ఛాతిపై వాతలు పెట్టారు. ఈ ఘటనలో విద్యార్థికి తీవ్ర గాయాలయ్యారు. ప్రేమ విషయంలో ఈ గొడవ జరిగినట్లు తెలుస్తోంది. రెండు రోజుల క్రితం ఈ ఘటన జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

దాడికి పాల్పడిన నలుగురు విద్యార్థులతో పాటు బాధిత విద్యార్థి కూడా ఒకే కాలేజీలో చదువుతున్నారు. ఈ విషయాన్ని బాధితుడు తల్లిదండ్రులకు చెప్పడంతో విషయం అందుబాటులోకి వచ్చింది. దీంతో వెంటనే బాధిత తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతే కాకుండా ఐదుగురు స్టూడెంట్స్ పై కాలేజీ ప్రిన్సిపాల్ సస్పెన్షన్‌ వేటు వేశారు. నలుగురు కలిసి తమ కుమారుడిపై దాడి చేయడం దారుణమని బాధిత విద్యార్థి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి..