ట్రిపుల్‌ ఐటీలో మరో మారు ఫుడ్‌ పాయిజన్‌.. విద్యార్థులకు తీవ్ర అస్వస్థత

ట్రిపుల్ ఐటీ డిస్పెన్సరీలో విద్యార్థులకు అరకొర వైద్యంపై అధికారులు సీరియస్ అయ్యారు. విద్యార్థులకు చికిత్స కోసం బయట నుంచి వైద్య బృందాన్ని రప్పించి చికిత్స అందిస్తున్నారు. పలువురు విద్యార్థులకు మెరుగైన చికిత్స అవసరం కావడంతో..

ట్రిపుల్‌ ఐటీలో మరో మారు ఫుడ్‌ పాయిజన్‌.. విద్యార్థులకు తీవ్ర అస్వస్థత
Food Poisoning
Follow us
Jyothi Gadda

|

Updated on: Nov 05, 2022 | 1:58 PM

తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ కాలేజీ హాస్టళ్ల పరిస్థితి అధ్వాన్నంగా మారింది. హాస్టళ్లలో ఉంటున్న విద్యార్థులు.. ఆహారం తినాలంటే భయపడుతున్నారు.. నీళ్లు తాగాలంటే టెన్షన్ పడుతున్నారు.. ఏ క్షణం అనారోగ్యానికి గురవుతారో అని ఆందోళనపడుతున్నారు.. ఎప్పుడు ఎవరు సడెన్‌గా పడిపోతారో వాళ్లకే తెలియని పరిస్థితి నెలకొంది. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలో 336 మంది.. సంగారెడ్డి జిల్లా నారాయణ ఖేడ్‌లో 25 మంది విద్యార్ధులు అస్వస్థతకు గురి కావడం తెలుగు రాష్ట్రాల్లో ఆందోళన కలిగిస్తోంది.

శ్రీకాకుళం ట్రిపుల్‌ ఐటీలో శుక్రవారం ఉదయం నుంచి కొందరు విద్యార్థులు కడుపునొప్పి అంటూ వాంతులు చేసుకున్నారు. అప్రమత్తమైన అధికారులు క్యాంపస్‌లోనే ప్రాథమిక వైద్యసేవలు అందించారు. ఎచ్చెర్ల IIITలోనిన్నటి నుంచి విద్యార్థులు కడుపు నొప్పి, వాంతులతో బాధపడుతున్నారు. 24 గంటల్లో మొత్తం 336 మంది విద్యార్థులు ట్రీట్‌మెంట్‌ పొందినట్లు డిస్పెన్సరీ రికార్డులు చెబుతున్నాయి.

శుక్రవారం సాయంత్రం వ౦ద మందికి పైగా విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఇద్దరి కండీషన్‌ సీరియస్‌గా ఉండడంతో అర్ధరాత్రి శ్రీకాకుళం రిమ్స్ హాస్పిటల్ కి తరలించి చికిత్స అందించి వెంటనే తిరిగి క్యా౦పస్ కి తీసుకువచ్చారు. తాగునీరు కలుషితం కావడంతో ఈ పరిస్థితి నెలకొందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయాన్ని బయటకు పొక్కనీయకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మీడియాను లోపలకు అనుమతించటంలేదు. అసలేం జరిగిందనే విషయం చెప్పేందుకు నిరాకరించారు. ఇదిలా ఉంటే, ఎట్టకేలకు స్పందించిన అధికార యంత్రాంగం ట్రిపుల్ ఐటీ డిస్పెన్సరీలో విద్యార్థులకు అరకొర వైద్యంపై అధికారులు సీరియస్ అయ్యారు. విద్యార్థులకు చికిత్స కోసం బయట నుంచి వైద్య బృందాన్ని రప్పించి చికిత్స అందిస్తున్నారు. పలువురు విద్యార్థులకు మెరుగైన చికిత్స అవసరం కావడంతో.. శ్రీకాకుళం రిమ్స్‌కి తరలించారు.

ఇవి కూడా చదవండి

ఇటు, సంగారెడ్డి నారాయణఖేడ్‌ కస్తూర్బా గాంధీ వసతి గృహంలో ఫుడ్‌ పాయిజన్‌ జరిగింది, 25 మంది బాలికలు వాంతులు, విరోచనాలతో అస్వస్ధతలకు గురయ్యారు. అయితే వాళ్లు ఏం తిన్నారు..వాళ్లు తిన్న ఫుడ్‌ పాయిజన్‌ అయిందా? లేక వాటర్‌ పొల్యూట్‌ అయిందా? అసలేం జరిగింది అన్నది దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!