Vizianagaram District: అక్కడ గర్భిణీ ప్రసవించాలంటే ప్రాణాలు పణంగా పెట్టాల్సిందే.. గర్భణీని డోలీలో తరలింపు.. మార్గమధ్యలో ప్రసవం
మన్యం ప్రాంతంలోని గిరిజనులు మాత్రం తమ సొంత ప్రాంతం నుంచి బయటకు వెళ్లాలంటే.. జీవితాన్ని ఫణంగా పెట్టాల్సిందే. రోగులు, గర్భిణీ స్త్రీలు.. ఎవరైనా సరే ఆస్పత్రికి వెళ్లేందుకు కనీసం రోడ్డు మార్గం లేక నానా అవస్థలు పడుతున్నారు.

స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు దాటించి.. ప్రజలుకు ఎన్నో చేశామని ప్రభుత్వాలు, అధికారులు గొప్పలు చెప్పుకుంటూనే ఉన్నారు. ఆధునిక యుగంలో టెక్నాలజీ యుగం పరుగులు పెడుతోంది. రకరకాల సంక్షేమ పథకాలతో ప్రజలకు ప్రభుత్వాలు చెరువుతున్నాయి. ప్రజల కోసం అంటూ రకరకాల సంక్షేమ పథకాలు ప్రవేశ పెడుతున్నారు. అయినా నేటికీ అనేక ప్రాంతాలకు రవాణా సదుపాయాలు లేవు.. ముఖ్యంగా మన్యం ప్రజల కష్టాలు తీర్చడం లేదు. రామేశ్వరం వెళ్లొచ్చినంత ఈజీగా రాకెట్లలో అంతరిక్షానికి వెళ్లొచ్చేస్తున్నారు. కానీ మన్యం ప్రాంతంలోని గిరిజనులు మాత్రం తమ సొంత ప్రాంతం నుంచి బయటకు వెళ్లాలంటే.. జీవితాన్ని ఫణంగా పెట్టాల్సిందే. రోగులు, గర్భిణీ స్త్రీలు.. ఎవరైనా సరే ఆస్పత్రికి వెళ్లేందుకు కనీసం రోడ్డు మార్గం లేక నానా అవస్థలు పడుతున్నారు. గర్భిణిలు, వృద్ధులు చిన్నారులు ఇలా ఎవరికి ఏ అవసరం ఏర్పడినా ఆస్పత్రికి వెళ్లాలంటే డోలీలనే ఆశ్రయించాల్సి వస్తోంది. ప్రాణాపాయ స్థితిలోనూ బాధితులను డోలీల్లో మోసుకుంటూ ఆ గిరిజనులు చెట్లు చేమలు, గుట్టలు దాటుకుంటూ వెళ్తున్నారు.
విజయనగరం జిల్లా పార్వతీపురం కొమరాడ మండలం ఊటకోసుకు చెందిన గిరిజన మహిళను ప్రసవం కోసం డోలీలో ఆస్పత్రికి తరలిస్తున్నారు. ఈ క్రమంలో పురుటి నొప్పులు ఎక్కువై మహిళ మధ్యలోనే ఒనకబడి వద్ద కాలిబాట పక్కన ప్రసవించింది. అనంతరం జిల్లా ఆస్పత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. అదృష్ట వశాత్తు తల్లీ బిడ్డ క్షేమంగా ఉన్నారు. మా బ్రతుకులు మారేదెప్పుడో అంటూ ఆవేదన వ్యక్తం చేశారు గిరిజనులు.




మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..