Tirumala: గత మూడేళ్లలో భారీగా పెరిగిన శ్రీవారి నగదు, బంగారం నిల్వలు.. శ్రీవారి ఖజానాకు కుప్పలు తెప్పలుగా కానుకలు

వెంకన్న దర్శనానికి వచ్చిన భక్తులు కానుకలను 'హుండీ'లో వేస్తూ ఉంటారు. శ్రీమంతుల నుంచి సామాన్యుడి వరకూ ఆ కోనేటి రాయుడికి తమ శక్తి కొలది.. నగదు, బంగారం, వెండి వస్తువుల రూపాల్లో రకరకాల కానుకలు సమర్పిస్తుంటారు. పూర్వకాలంలో ఆలయ కైంకర్యాలు, నిర్వహణ కోసం హుండీ ఏర్పాటు చేశారు. 

Tirumala: గత మూడేళ్లలో భారీగా పెరిగిన శ్రీవారి నగదు, బంగారం నిల్వలు.. శ్రీవారి ఖజానాకు కుప్పలు తెప్పలుగా కానుకలు
Tirumala Tirupati
Follow us
Surya Kala

|

Updated on: Nov 05, 2022 | 4:56 PM

శనివారం డయల్‌ యువర్‌ ఈవో కార్యక్రమంలో శ్రీవారి ఆస్తులపై ఓ భక్తుడు అడిగిన ప్రశ్నకు ఈవో ధర్మారెడ్డి బదులిచ్చారు. ఈ సందర్భంగా తిరుమల తిరుపతి క్షేత్రంలో కొలువైన మలయప్ప స్వామి ఆస్తుల వివరాలను వెల్లడించారు. మెచ్యూరిటీ పూర్తైన రూ. 5 వేల కోట్లను రాష్ట్ర ప్రభుత్వం బాండ్స్ రూపంలో డిపాజిట్ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవమని చెప్పారు. అంతేకాదు టీటీడీ ఫిక్సిడ్ డిపాజిట్లు విషయంలో ఎలాంటి వదంతలు నమ్మవద్దన్నారు. రూ.15,900 కోట్ల మేరకు టీటీడీ ఫిక్సిడ్ డిపాజిట్లు  వివిధ జాతీయ బ్యాంకుల్లో ఉన్నాయని పేర్కొన్నారు. అత్యధిక వడ్డీనిచ్చే జాతీయ బ్యాంకుల్లో మాత్రం టీటీడీ ఫిక్సిడ్ డిపాజిట్లు చేస్తుందని ఈవో స్పష్టం చేశారు. హిందూ మత ద్వేషులు టీటీడీపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు ధర్మారెడ్డి.

గత మూడేళ్లలో శ్రీవారి నగదు డిపాజిట్లు భారీగా పెరిగాయని.. 2019 జూన్‌ లో నగదు డిపాజిట్ రూ.  13,025 కోట్లు ఉండగా ప్రస్తుతం రూ. 15,938 కోట్లకి డిపాజిట్లు చేరుకున్నాయని తెలిపారు. అంతేకాదు మరోవైపు బంగారం 2019లో 7,339.74 కేజీలు ఉండగా ప్రస్తుతం 10.258.37 కేజీల బంగారం నిల్వలున్నాయని తెలిపారు ఈవో ధర్మారెడ్డి.

వెంకన్న దర్శనానికి వచ్చిన భక్తులు కానుకలను ‘హుండీ’లో వేస్తూ ఉంటారు. శ్రీమంతుల నుంచి సామాన్యుడి వరకూ ఆ కోనేటి రాయుడికి తమ శక్తి కొలది.. నగదు, బంగారం, వెండి వస్తువుల రూపాల్లో రకరకాల కానుకలు సమర్పిస్తుంటారు. పూర్వకాలంలో ఆలయ కైంకర్యాలు, నిర్వహణ కోసం హుండీ ఏర్పాటు చేశారు.

ఇవి కూడా చదవండి

అక్టోబర్ నెలలో 22.72 లక్షల మంది శ్రీవారిని దర్శించుకున్నారు. హుండీ కానుకల ద్వారా రూ. 122.23 కోట్లు ఆదాయం లభించిందని తెలిపారు. రూ. 1.08 కోట్ల మంది శ్రీవారి లడ్డూలు విక్రయం జరిగినట్లు చెప్పారు. స్వామివారికి మొత్తం 10.25 లక్షల మంది భక్తులు తలనీలాలు సమర్పించినట్లు ధర్మారెడ్డి తెలిపారు. ఇక డిసెంబర్ నుండి ప్రయోగత్మకంగా విఐపీ బ్రేక్ దర్శనం ఉదయం 8 గంటల నుండి మొదలు పెట్టనున్నామని చెప్పారు. ఈ బ్రేక్ సమయంలో  మార్పు వల్ల అన్ లైన్ లో డిసెంబర్ నెల రూ.300 దర్శనం కోటా జాప్యం జరగనుందని పేర్కొన్నారు. త్వరలో ఆన్ లైన్ లో దర్శన టిక్కెట్లు విడుదల చేస్తామన్నారు టీటీడీ ఈఓ ధర్మారెడ్డి

నవంబర్ 30వ తేదీ బోర్డు మీటింగ్ లో ఆనంద నిలయం ఆనంత స్వర్ణమయంపై నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. నూతన పరకామణి భవనంలో .. త్వరలో శ్రీవారి హుండీ కానుకలు లెక్కింపు ప్రారంభిస్తామని మరోమారు తెలిపారు ఈవో.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..