AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chanakya Niti: సంతోషకరమైన జీవితానికి ప్రతి వ్యక్తికి ఈ మూడు విషయాలు అత్యంత ముఖ్యమంటున్న ఆచార్య చాణక్య

చాణక్య నీతి ద్వారా జీవితంలో ఒడిదుడుకులను సులభంగా అధిగమించవచ్చు. సంతోషకరమైన జీవితానికి, విజయానికి కీలకంగా భావించే చాణక్యుని కొన్ని శ్లోకాల గురించి ఈ రోజు తెలుసుకుందాం. ఈ శ్లోకాలు జీవితాన్ని బాగా అర్థం చేసుకోవడానికి కూడా సహాయపడతాయి.  

Chanakya Niti: సంతోషకరమైన జీవితానికి ప్రతి వ్యక్తికి ఈ మూడు విషయాలు అత్యంత ముఖ్యమంటున్న ఆచార్య చాణక్య
Chanakya Niti
Surya Kala
|

Updated on: Nov 05, 2022 | 5:53 PM

Share

ఆచార్య చాణక్యుడి విధానాలు చాలా ప్రభావవంతంగా ఉంటాయని.. నేటికీ అనుసరణీయమని పెద్దలు చెబుతారు. చాణక్య విధానాల ఆధారంగా, అతను సాధారణ బాల చంద్రగుప్తుడిని భారతదేశం మొత్తానికి చక్రవర్తిగా చేసాడు. ఆచార్య  రాజకీయ నాయకుడే కాదు మంచి సామాజిక శాస్త్రవేత్త కూడా. ఎందుకంటే అతను తన జీవితాంతం ప్రజలకు సహాయం చేస్తూనే ఉన్నాడు. అంతే కాదు, తన జీవితాంతం ప్రజలకు జీవన మార్గాన్ని కూడా చూపించాడు. నీతి శాస్త్రంలో అనేక విషయాలను పేర్కొన్నాడు. అందులో మనిషి జీవితం సంతోషంగా ఉండటానికి చాలా ముఖ్యమైన విషయాలు ప్రస్తావించబడ్డాయి. చాణక్య నీతి ద్వారా జీవితంలో ఒడిదుడుకులను సులభంగా అధిగమించవచ్చు. సంతోషకరమైన జీవితానికి, విజయానికి కీలకంగా భావించే చాణక్యుని కొన్ని శ్లోకాల గురించి ఈ రోజు తెలుసుకుందాం. ఈ శ్లోకాలు జీవితాన్ని బాగా అర్థం చేసుకోవడానికి కూడా సహాయపడతాయి.

आपदर्थे धनं रक्षेद्दारान् रक्षेध्दनैरपि ।

नआत्मानं सततं रक्षेद्दारैरपि धनैरपि ।।

ఇవి కూడా చదవండి

చాణక్యుడి ఈ శ్లోకంలో పొదుపు గురించి ప్రస్తావించారు. మనిషి ఇబ్బందులను ఎదుర్కోవడంలో డబ్బు పాత్ర ముఖ్యమైనది. అటువంటి పరిస్థితిలో డబ్బుని  ఆదా చేయడం చాలా ముఖ్యం. ఎక్కడో కోల్పోయిన అదృష్టాన్ని మేల్కొల్పడానికి పని చేసే సాధనం పొదుపు అని చాణక్య నీతి చెబుతుంది. మాట్లాడటం వల్ల ఇబ్బందులు రావు. ఇబ్బంది కరమైన పరిస్థితులను ఎదుర్కోవడానికి మనిషికి డబ్బు అవసరం చాలా ఉందని చెబుతున్నాడు చాణక్య.

अधीत्येदं यथाशास्त्रं नरो जानाति सत्तमः ।

धर्मोपदेशं विख्यातं कार्याऽकार्य शुभाऽशुभम् ।।

ఈ చాణక్యుడి శ్లోకంలో విద్య ప్రాముఖ్యత గురించి చెప్పారు. అంటే వేదాల నియమాలను నిరంతరం ఆచరించే వ్యక్తి, .. తన జీవితంలో చోటు చేసుకునే  ఒప్పు , తప్పులను అర్థం చేసుకోవడం ప్రారంభిస్తాడు. నిజానికి వ్యక్తికీ జ్ఞానం సంపద వంటిది. విద్య అనేది జీవితంలో ఒక సాధనం.. ఇది ఇంట్లో విజయం నుండి ఆనందం వరకు ప్రతిదీ విద్యతో సాధ్యమవుతుంది.

जानीयात् प्रेषणे भृत्यान् बान्धवान् व्यसनागमे ।

मित्रं चापत्तिकाले तु भार्यां च विभवक्षये ।।

చాణక్యుడి ఈ శ్లోకంలో, ఒక వ్యక్తి చెడు సమయాల్లో ఎలా నడుచుకోవాలో పేర్కొన్నాడు. చెడు సమయాల్లో మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోవడం కూడా విజయానికి కీలకం. కుటుంబంలో యజమానికి ఇబ్బందులు ఎదురైనా.. చెడుకాలం వచ్చినప్పుడు సేవకుడు పరీక్షించబడతాడు అని పద్యం అర్థం. అంతేకాదు.. స్నేహితులు, భార్య కూడా చెడు సమయాల్లో పరీక్షించబడతారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)