Tirumala: సీనియర్ సిటిజన్లకు టీటీడీ తీపి కబురు.. శ్రీవారి దర్శనం కోసం స్పెషల్ స్లాట్లు.. పూర్తి వివరాలివే
ఉదయం 10 గంటలకు, మధ్యాహ్నం 3 గంటలకు సీనియర్ సిటజన్లకు శ్రీవారి దర్శనం కల్పించనుంది. ఇందుకోసం వారు ఫొటో ఐడీతో సహా వయసు ధ్రువీకరణను తెలియజేస్తూ తిరుమలలోని ఎస్1 కౌంటర్‌లో దరఖాస్తు సమర్పించాలి.
శ్రీవారిని దర్శించుకోవాలంటోన్న సీనియర్ సిటిజన్లకు తిరుమల తిరుపతి దేవస్థానం శుభవార్త తెలిపింది. ఏడుకొండల వాడిని ఉచితంగా దర్శించుకునేందుకు వీలుగా రెండు ప్రత్యేక స్లాట్లు ఏర్పాటుచేసింది. ఇందులో భాగంగా ఉదయం 10 గంటలకు, మధ్యాహ్నం 3 గంటలకు సీనియర్ సిటజన్లకు శ్రీవారి దర్శనం కల్పించనుంది. ఇందుకోసం వారు ఫొటో ఐడీతో సహా వయసు ధ్రువీకరణను తెలియజేస్తూ తిరుమలలోని ఎస్1 కౌంటర్‌లో దరఖాస్తు సమర్పించాలి. ఈ స్లాట్లలో దర్శనానికి వచ్చే సీనియర్ సిటిజన్లకు ప్రత్యేక సదుపాయాలు కల్పించనున్నట్లు టీటీడీ తెలిపింది. ఏ మెట్లు ఎక్కాల్సిన అవసరం లేకుండా మంచి సీటింగ్ తో కంపార్టుమెంట్‌తో పాటు ఆహారం అవసరమైన సీనియర్ సిటిజన్స్‌కు లోపల వేడి సాంబార్ అన్నం, పెరుగు అన్నం , వేడి పాలు ఉచితంగా అందిస్తామని టీటీడీ వెల్లడించింది. అలాగే రూ.20 చెల్లించి రెండు లడ్డూలను పొందవచ్చని, అదనపు లడ్డూలు అవసరమైన వారు ఒక్కో లడ్డూకు రూ.25 చెల్లిస్తే సరిపోతుందని టీటీడీ పేర్కొంది.
కాగా ఎగ్జిట్ గేట్ వద్ద ఉన్న కార్ పార్కింగ్ ప్రాంతం నుంచి కౌంటర్ వద్ద డ్రాప్ చేయడానికి ప్రత్యేకంగా బ్యాటరీ కారును కూడా అందుబాటులో ఉంచామని టీటీడీ తెలిపింది. ఇక సీనియర్ సిటిజన్లకు దర్శనం కల్పి్స్తున్న సమయంలో అన్ని ఇతర క్యూలైన్లను నిలిపివేయనున్నట్లు ప్రకటించింది. ఈ స్పెషల్ సాట్ల విధానం వల్ల భక్తులు కేవలం 30 నిమిషాల్లో శ్రీవారి దర్శనం చేసుకుని బయటకు రావొచ్చు. మరిన్ని వివరాలకు తిరుమల హెల్ప్ డెస్క్ నంబర్ 08772277777 ను సంప్రదించాలని టీటీడీ సూచించింది.
టికెట్ ఎలా బుక్ చేసుకోవాలంటే?
☛ టీటీడీ అధికారిక వెబ్ సైట్ లో టికెట్ బుక్ చేసుకోవాలి
☛ వయో పరిమితి 65 సంవత్సరాలకుపైగా ఉండాలి
☛ ఐడీ ఫ్రూప్‌గా ఆధార్ కార్డు ఉండాలి
☛ సమయాలు: ఉదయం 10 గంటలకు, మధ్యాహ్నం 3 గంటలకు
☛ సీనియర్ సిటిజన్ వెంట ఒక వ్యక్తికి అనుమతి (ఎవరి సహాయం లేకుండా ఉండకపోతే, నిలబడకపోతే)
☛ 90 రోజులకు ఒకసారి మాత్రమే పరిమితులు
☛ 80 ఏళ్లు దాటిన వారి సహాయకులకు కూడా అనుమతి
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం చూడండి..