Optical Illusion: నీటి అడుగున దాగున్న నిధి.. 10 సెకన్లలో కనిపెడితే మీవి డేగ కళ్లే.. ట్రై చేయండి మరి..
నెట్టింట్లో రోజురోజుకు కొత్త కొత్త ఫొటో పజిల్స్, ఆప్టికల్ ఇల్యూషన్ ఫొటోలు తెగ వైరలవుతున్నాయి. ఈ ఫోటోల్లో దాగున్న వాటిని కనిపెట్టడంలో ఒక రకమైన మజా వస్తుంది.
సోషల్ మీడియాలో ఆప్టికల్ ఇల్యూషన్ ఫొటోల హవా కొనసాగుతోంది. కళ్లతో పాటు మెదడుకు పదునుపెట్టే ఈ ఫొటో పజిల్స్‌ను సాల్వ్ చేసేందుకు చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు. అలాగే పని ఒత్తిడి నుంచి కాస్త ఉపశమనం పొందేందుకు మరికొంత మంది ఆప్టికల్ ఇల్యూషన్ ల వెంట పడుతున్నారు. ఈనేపథ్యంలో నెట్టింట్లో రోజురోజుకు కొత్త కొత్త ఫొటో పజిల్స్, ఆప్టికల్ ఇల్యూషన్ ఫొటోలు తెగ వైరలవుతున్నాయి. ఈ ఫోటోల్లో దాగున్న వాటిని కనిపెట్టడంలో ఒక రకమైన మజా వస్తుంది. వినోదంతో పాటు, ఆలోచన శక్తి, సామర్థ్యం, సహనం పెంపొందించుకోవడంలో సహాయపడుతుంది. మెదడు పనితీరును మరింత చురుగ్గా మారుస్తుంది. అనేక అధ్యయనాలు సైతం ఈ విషయాన్ని నిర్ధారించాయి. అందుకే.. చాలా మంది ఆప్టికల్ ఇల్యూజన్ ఛాలెంజ్‌ను స్వీకరించి, వాటిని చేజ్ చేస్తుంటారు.
ఇప్పుడు అలాంటి ఫొటో ఒకటి ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతోంది. ఇందులో మీరు సముద్రం.. అందులో ఉన్న అనేక జీవులను చూడవచ్చు. అలాగే పగడపు దిబ్బలు, ఆక్టోపస్, జెల్లీ ఫిష్, పీత, చేపలను కూడా చూడవచ్చు. వీటి మధ్యలో ఎక్కడో ఒక నిధి కూడా దాగి ఉంది. అయితే చాలామంది ఆ నిధిని కనుగొనలేకపోయారు. ఇప్పుడు కండిషన్ ఏంటంటే.. 10 సెకన్లలో ఈ నిధిని కనిపెడితే మీ కళ్లు డేగలా షార్ప్ గా ఉన్నట్లే. కొంచెం గందరగోళం, తికమకతో కూడుకున్న ఈ ఫొటో పజిల్‌ను సాల్వ్ చేయడం కొంచెం కష్టమే. అయితే కాస్తా ఓపిక తెచ్చుకుంటే అసాధ్యమేమీకాదు. కాస్త కళ్లను పెద్దవిగా చేసుకుని చూస్తే ఈజీగా ఈ ఫొటో పజిల్‌ను సాల్వ్ చేయవచ్చు. అన్నట్లు నిధిని కనుగొనడంలో ఒక క్లూ కూడా ఇస్తున్నామండోయ్.. అదేంటంటే ఈ ఫొటోను రూపొందించిన డిజైనర్ చాలా వస్తువులను మూలల్లో లేదా ఎడమ, కుడి చివరల్లో దాచిపెట్టాడు. నిధిని కూడా అలాగే దాచి పెట్టాడు. ఇప్పటికీ మీరూ ఈ పజిల్‌ను సాల్వ్ చేయలేకపోతే సమాధానం కోసం కింది ఫొటో చూడండి.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..