Pawan Kalyan: కంచెలు దాటుకుంటూ కాలినడకన ఇప్పటం చేరుకున్న పవన్ కళ్యాణ్.. బాధితులను పరామర్శిస్తున్న జనసేనాని

ఇప్పట గ్రామంలో రోడ్ల విస్తరణ కార్యక్రమం కోసం చేప్పట్టిన ఇళ్ల కూల్చివేత కార్యక్రమం వివాదాస్పదం అయింది. బాధితులను స్వయంగా పవన్ కళ్యాణ్ పరామర్శిస్తున్నారు.  రోడ్డు విస్తరణలో కూల్చివేసిన ఇళ్లను పరిశీలించారు పవన్..

Pawan Kalyan: కంచెలు దాటుకుంటూ కాలినడకన ఇప్పటం చేరుకున్న పవన్ కళ్యాణ్.. బాధితులను పరామర్శిస్తున్న జనసేనాని
Pawan Kalyan Ippatam Tour
Follow us

|

Updated on: Nov 05, 2022 | 10:39 AM

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వానికి జనసేన పార్టీకి నిత్యం మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. తాజాగా జనసేనాని మరోసారి ప్రభుత్వం తీరుపై నిరసన తెలియజేస్తూ.. మంగళగిరి నియోజకవర్గ పరిధిలోని ఇప్పటం గ్రామంలో పర్యటిస్తున్నారు. ఇప్పట గ్రామంలో రోడ్ల విస్తరణ కార్యక్రమం కోసం చేప్పట్టిన ఇళ్ల కూల్చివేత కార్యక్రమం వివాదాస్పదం అయింది. బాధితులను స్వయంగా పవన్ కళ్యాణ్ పరామర్శిస్తున్నారు.  రోడ్డు విస్తరణలో కూల్చివేసిన ఇళ్లను పరిశీలించిన పవన్.. జనసేన సభకు స్థలం ఇచ్చినందుకే ప్రభుత్వం ఇళ్లను కూలగొట్టిందన్నారు.  వైసీపీ ఇలాగే చేస్తే మేం ఇడుపులపాయలో హైవే వేస్తాంమని చెప్పారు.

ఇప్పటం వెళ్లకుండా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్  ని మంగళగిరిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయం ముందే పోలీసులు నిలువరించే ప్రయత్నం చేశారు. దీంతో పవన్ వాహనం దిగి నడుచుకుంటూ ఇప్పటం చేరుకున్నారు. అంతేకాదు ఈ సందర్భంగా తనను పోలీసులు అరెస్ట్ చేసినా తాను తగ్గేదే లేదన్నారు.

ఇవి కూడా చదవండి

ఇప్పటం గ్రామంలో 120 అడుగుల రోడ్డు విస్తరణ కోసం గతంలోనే నోటీసులు ఇచ్చామని అధికారులు చెబుతున్నారు. ఇదే గ్రామంలో గతంలో జనసేన ప్లీనరీకి స్థానికులు భూములు ఇచ్చారు. ఆ తరువాత ఆ గ్రామానికి పవన్ కళ్యాణ్ 50 లక్షలు విరాళం ప్రకటించారు. ఆ మొత్తంతో అక్కడ ఒక కమ్యూనిటీ హాల్ ను నిర్మించుకున్నారు.

మరోవైపు వైసీపీ నేతలు ఇదే విషయంపై స్పందిస్తూ..ఇళ్లు కూల్చివేతపై జనసేన, టీడీపీ రాజకీయ రచ్చ చేస్తున్నాయని వైసీపీ విమర్శించింది. రోడ్డు విస్తరణ, డ్రైనేజీ నిర్మాణాల కోసమే ప్రహరీలు తొలగించినట్లు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారంటోంది. నెల రోజుల నుంచే ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయని..వైఎస్‌ విగ్రహం దిమ్మె కూడా తొలగించామని.. ఇప్పటికే ప్రహరీలు తొలగించిన ఇళ్లను కూడా బాగు చేసుకున్నారని వైసీపీ నేతలు ఫోటోలతో స్పష్టం చేస్తున్నారు..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..