Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Janasena: అత్యాధునిక సౌకర్యాలతో అంబులెన్స్ సేవలను ఏర్పాటు చేసిన జనసేన నేత.. పవన్ చేతులమీదుగా ప్రారంభం..

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గ జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ మూడు ఉచిత అంబుల్పైన్ సర్వీసులను ఏర్పాటు చేశారు. ఈ అంబులెన్స్ సర్వీసులను మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో పవన్ కళ్యణ్ పచ్చ జెండా ఊపి ప్రారంభించారు.

Janasena: అత్యాధునిక సౌకర్యాలతో అంబులెన్స్ సేవలను ఏర్పాటు చేసిన జనసేన నేత.. పవన్ చేతులమీదుగా ప్రారంభం..
pawan-kalyan-launches-free-ambulance
Follow us
Surya Kala

|

Updated on: Oct 31, 2022 | 2:05 PM

ఎవరైనా ప్రాణాపాయంలో ఉన్న సమయంలో ఆ వ్యక్తి ప్రాణం నిలబెట్టడానికి ఒక్క సెకను కూడా ఎంతో విలువైంది. ముఖ్యంగా అత్యవసర పరిస్థితి ఏర్పడినప్పుడు.. ఆ వ్యక్తి ప్రాణాలు నిలబెట్టడానికి అంబులెన్స్ సేవలు ఎంతగానో ఉపయోగపడతాయి. ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలు ఈ అంబులెన్స్ సేవలను ఉచితంగా కూడా అందిస్తున్నారు కూడా.. తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉచిత అంబులెన్స్ సర్వీసులను ప్రారంభించారు.

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గ జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ మూడు ఉచిత అంబుల్పైన్ సర్వీసులను ఏర్పాటు చేశారు. ఈ అంబులెన్స్ సర్వీసులను మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో పవన్ కళ్యణ్ పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్.. మనిషికి అత్యవసర పరిస్థితి ఏర్పడినప్పుడు.. ఈ అంబులెన్స్ సేవలు ఎంతగానో ఉపయోగపడతాయని పేర్కొన్నారు.

ఈ మూడు అంబులెన్స్ లను సుమారు రూ.30 లక్షల సొంత ఖర్చుతో బత్తుల బలరామకృష్ణ ఏర్పాటు చేశారు. ఈ అంబులెన్సుల్లో అత్యాధునిక వెంటిలేటర్లు, అధునాతన లైఫ్ సపోర్టు యంత్రాలతో పాటు 40 రకాల వైద్య పరికరాలు పేషెంట్స్‌కి అందుబాటులో ఉంటాయి. ఈ మూడు అంబులెన్సులు మనిషికి ప్రాధమిక చికిత్సను అందించడంతో పాటు.. వెంతనే బాధిత వ్యక్తులను సమీప ఆస్పత్రికి చేర్చనున్నాయి.

ఈ ఉచిత సర్వీసులు.. రాజానగరం నియోజకవర్గం పరిధిలోని ప్రజలకు ఉచితంగా సేవలను అందించనున్నాయి. ఎవరైనా బాధితులు అత్యవసర సేవల కోసం ఫోన్ చేస్తే.. వెంటనే బాధితులకు అందుబాటులో ఉంటాయని బలరామకృష్ణ పేర్కొన్నారు. ఈ సేవలను వినియోగించుకునేవారి కోసం ప్రత్యేక ఫోన్ నెంబర్లను కూడా ఏర్పాటు చేశారు. ఈ సర్వీసులు నేటి నుంచి రాజానగరం నియోజక వర్గ ప్రజలకు అందుబాటులోకి రానున్ననున్నాయి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..