AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: హైదరాబాద్‌ శివారులో విషాదం.. ఈతకు వెళ్లి ఆరుగురి మృతి

హైదరాబాద్ శివారులోని మల్కారం చెరువులో ఈతకు వెళ్లి ఆరుగురు మృత్యువాత పడ్డారు. ఇందులో ఐదుగురు విద్యార్థులు ఉన్నట్లు తెలుస్తోంది. మృతులంతా అంబర్‌పేట వాసులేనని గుర్తించారు.

Hyderabad: హైదరాబాద్‌ శివారులో విషాదం.. ఈతకు వెళ్లి ఆరుగురి మృతి
Lake
Basha Shek
|

Updated on: Nov 05, 2022 | 4:30 PM

Share

హైదరాబాద్‌లో శివారులో విషాదం చోటు చేసుకుంది. జవహార్‌నగర్‌ పరిధిలో ఉన్న మల్కారంలోని ఎర్రగుంట చెరువులో ఈతకు దిగి ఆరుగురు మృతి చెందారు. ఇందులో ఐదుగురు విద్యార్థులు ఉన్నట్లు తెలుస్తోంది. మృతులంతా అంబర్‌పేట వాసులేనని గుర్తించారు.  వివరాల్లోకి వెళితే.. స్థానిక మదర్సా పాఠశాలలో చదివే విద్యార్థులను టూర్‌లాగా ఉపాధ్యాయుడు బయటికి తీసుకెళ్లారు.  అక్కడ  ఈత కొడదామని సరదాగా ఎర్రగుంట చెరువులోకి విద్యార్థులు దిగారు.  అయితే చెరువు లోతును సరిగా అంచనా వేయలేకపోయారు.  పిల్లలంతా మునిగిపోయారు. ఇది చూసి ఉపాధ్యాయుడు కూడా పిల్లలను కాపాడేందుకు చెరువలోకి దిగారు. పిల్లలంతా ఉపాధ్యాయుడ్ని పట్టుకోవడంతో బయటికిరాలేక అందరూ నీటిలో మునిగిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టి  మృతదేహాలను వెలికితీశారు. కాగా మృతులందరూ  హైదరాబాద్  కాచిగూడలోని నెహ్రూనగర్‌ ప్రాంతానికి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు.

మల్కారంలోని మదర్సాలో ప్రత్యేక శిక్షణా తరగతుల కోసం వీరంతా వచ్చారని వారు  తెలిపారు. చనిపోయిన వారిలో ఇస్మాయిల్, జాఫర్‌, సోహేల్‌, అయాన్‌, రియాన్‌.. వీరిని కాపాడేందుకు చెరువులో దూకిన వ్యక్తి యోహాన్‌గా గుర్తించారు. మృతి చెందిన విద్యార్థులంతా 12 నుంచి 14 ఏళ్ల వయసు ఉంటారని తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
మే 21 రాశిఫలాలు: గురు బలంతో ఆ రాశుల వారికి అదృష్టం..
మే 21 రాశిఫలాలు: గురు బలంతో ఆ రాశుల వారికి అదృష్టం..
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై