Twitter – Elon Musk: అంతా తూచ్.. ఆఫీస్‌కు వచ్చేయండి.. ఉద్యోగులకు మెసేజ్‌లు పంపుతున్న ట్విట్టర్

ట్విటర్‌ను అక్టోబరు చివరిలో 44 బిలియన్‌ డాలర్లతో కొనుగోలు చేసిన ఎలన్‌ మస్క్‌.. కంపెనీని ఆర్థికంగా బలోపేతం చేసేందుకంటూ, ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగ కోతలు మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. దాదాపు 3,700 మంది వ్యక్తులను ఉద్యోగం నుంచి తొలగించింది

Twitter - Elon Musk: అంతా తూచ్.. ఆఫీస్‌కు వచ్చేయండి.. ఉద్యోగులకు మెసేజ్‌లు పంపుతున్న ట్విట్టర్
Elon Musk
Follow us
Surya Kala

|

Updated on: Nov 07, 2022 | 5:20 PM

ట్విటర్‌లో ఇటీవల ఎలన్‌ మస్క్‌  ఉద్యోగుల తొలగింపు విషయంలో యూ టర్న్ తీసుకున్నారు. ఇటీవల ట్విట్టర్ లో ప్రక్షాళన పొదుపు మంత్రం అంటూ చాలా మంది ఉద్యోగులను హఠాత్తుగా తొలగించిన విషయం తెలిసిందే. అయితే, వీరిలో కొంతమందిని పొరపాటున తొలగించినట్లు తర్వాత గుర్తించారట. ఎలన్‌ మస్క్‌ కు కావాల్సిన విధంగా కొత్త ఫీచర్లను రూపొందించడానికి తొలగించిన ఉద్యోగుల్లో పని, అనుభవం అవసరమని మేనేజ్‌మెంట్ ఇప్పుడు గ్రహించిందట. దీంతో తొలగించిన ఉద్యోగులు వెంటనే ఆఫీసుకు తిరిగి రమ్మని తాజాగా సందేశం పంపారు. ట్విటర్‌లో మస్క్‌ లక్ష్యాలకు అనుగుణంగా తొలగించిన ఉద్యోగుల్లో కొంతమంది సేవలు తప్పనిసరని సంస్థ భావించి వారిని తిరిగి ఆఫీసుకు రావాలని కోరిందట.

ట్విటర్‌ను అక్టోబరు చివరిలో 44 బిలియన్‌ డాలర్లతో కొనుగోలు చేసిన ఎలన్‌ మస్క్‌.. కంపెనీని ఆర్థికంగా బలోపేతం చేసేందుకంటూ, ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగ కోతలు మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. దాదాపు 3,700 మంది వ్యక్తులను ఉద్యోగం నుంచి తొలగించింది. సగానికి పైగా ఉద్యోగుల్ని తొలగిస్తూ ఇటీవల నిర్ణయం తీసుకున్నారు. కంపెనీకి ఒక రోజులో ఏకంగా 4 మిలియన్‌ డాలర్ల నష్టాలు వస్తున్నప్పుడు.. ఉద్యోగులను తొలగించడం మినహా తమకు వేరే దారి లేదని మస్క్‌ తన నిర్ణయాన్ని సమర్థించుకున్నారు. ఇంటికి పంపించేసిన ఉద్యోగులందరికీ మూడు నెలల వేతనాన్ని పరిహారాన్ని ఇస్తున్నామన్నామని చెప్పి తాను చేసిన పనిని ఎలెన్ సమర్ధించుకున్నాడు.

అయితే ఇలా కంపెనీ తొలగించిన ఉద్యోగస్థుల్లో ఎక్కువమంది భారత్ లో పనిచేసే ఉద్యోగస్తులు ఉన్నారనే వార్తలు వినిపించాయి. ఇదే విషయంపై భారత ఐటీ శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్ స్పందించారు. ఇలా హఠాత్తుగా ఉద్యోగం నుంచి తొలగించడం ఉద్యోగస్తుల భవిష్యత్తుపై ప్రభావం చూపిస్తుందని.. వారిని కనీసం కొంచెం సమయం ఇచ్చి ఉండాల్సిందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. భారతీయుల తొలగింపు చర్యలను ఖండించిన సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..