Sania and Shoaib: విడాకుల బాటలో మరో ప్రముఖ జంట?..12 ఏళ్ల వివాహ బంధాన్ని గుడ్ బై చెప్పనున్నారని క్రీడాప్రపంచంలో టాక్

భారతీయ క్రీడాకారిణి సానియా మీర్జా పాకిస్తానీ క్రికెటర్‌ పై మనసుపడి పెళ్ళి చేసుకోవడం అప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. మళ్ళీ ఇప్పుడు ఈ ఇద్దరి పేర్లూ మరోసారి క్రీడాప్రపంచంలో హాట్‌ టాపిక్‌గా మారాయి. విడిపోతోన్న సెలబ్రిటీల లిస్ట్‌లో ఇప్పుడు సానియా, మాలిక్‌లు చేరిపోయారంటూ ప్రచారం జరుగుతోంది.

Sania and Shoaib: విడాకుల బాటలో మరో ప్రముఖ జంట?..12 ఏళ్ల వివాహ బంధాన్ని గుడ్ బై చెప్పనున్నారని క్రీడాప్రపంచంలో టాక్
Sania Mirza And Shoaib Mali
Follow us
Surya Kala

|

Updated on: Nov 07, 2022 | 4:17 PM

టెన్నిస్‌ స్టార్‌ సానియా మిర్జా, స్టార్‌ బ్యాట్స్‌మన్‌ షోయబ్ మాలిక్ సెలబ్రిటీ స్టార్ కపుల్. వీరి ప్రేమ దేశ సరిహద్దులు దాటి గెలిచింది. 2010లో వీరి వివాహం ఘనంగా జరిగింది. 2018లో ఈ జంటకు ఓ మగబిడ్డ కూడా పుట్టాడు. అయితే ఇప్పుడు వీరి వైవాహిక జీవితం ప్రమాదంలో పడిందా? గతకొన్నాళ్లుగా సానియా, షోయబ్ వేర్వేరుగా ఉంటున్నారా ? 12 ఏళ్ల వైవాహిక బంధానికి త్వరలోనే డైవోర్స్‌ తో గుడ్ బై చెప్పనున్నారా ? ఇవే అంశాలు ఇప్పుడు క్రీడా ప్రపంచంలో హాట్‌ టాపిక్‌గా మారాయి. ఇండియన్‌ టెన్నిస్ స్టార్‌ సానియా మీర్జా, పాకిస్తాన్‌ క్రికెట్‌ టీం మాజీ కెప్టెన్‌ షోయబ్‌ మాలిక్‌ ఈ రెండు పేర్లు 2010లో క్రీడాలోకంలో సంచలనం సృష్టించాయి. భారతీయ క్రీడాకారిణి సానియా మీర్జా పాకిస్తానీ క్రికెటర్‌ పై మనసుపడి పెళ్ళి చేసుకోవడం అప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. మళ్ళీ ఇప్పుడు ఈ ఇద్దరి పేర్లూ మరోసారి క్రీడాప్రపంచంలో హాట్‌ టాపిక్‌గా మారాయి. విడిపోతోన్న సెలబ్రిటీల లిస్ట్‌లో ఇప్పుడు సానియా, మాలిక్‌లు చేరిపోయారంటూ ప్రచారం జరుగుతోంది. అదే ఇప్పుడు అటు పాకిస్తాన్‌ క్రీడా ప్రపంచంలోనూ, ఇటు భారతీయ క్రీడాకారుల్లోనూ హాట్‌ టాపిక్‌గా మారింది. ఈ ఇద్దరి మధ్య గ్యాప్‌ ఒచ్చిందా? ఈ ఇద్దరి మధ్యా మనస్పర్థలు విడాకుల వరకూ వెళ్ళాయా? ఒకనాటి యువతరం కలల రాణి సానియా లైఫ్‌లో అసలేం జరుగుతోందో సర్వత్రా ఆసక్తి నెలకొంది.

సానియా మీర్జా భారతదేశంలోనే కాకుండా ప్రపంచ స్టార్ మహిళా టెన్నిస్ క్రీడాకారిణులలో కూడా ఒకటి. డబుల్స్‌లో ప్రపంచ ర్యాంకింగ్స్‌లో నంబర్‌-1గా నిలిచింది. ఆమె ఖాతాలో 6 డబుల్స్ గ్రాండ్ స్లామ్ టైటిల్స్ ఉన్నాయ్. మహిళల టెన్నిస్ సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో టాప్-100కి చేరుకున్న ఏకైక భారతీయురాలు. 2007లో సానియా 27వ ర్యాంకుకు చేరుకుంది. భారత టెన్నిస్ స్టార్ అయిన సానియా… పాకిస్తాన్‌కు కోడలు అయ్యింది. ప్రముఖ పాక్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఈ పెళ్లి సమయంలో కూడా సానియా.. అనేకమంది విమర్శలను ఎదుర్కొంది. పలువురు రాజకీయ నేతలు ఆమె పెళ్లిపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by Sania Mirza (@mirzasaniar)

తాజాగా “వేర్‌ డూ బ్రోకెన్‌ హార్ట్స్‌ గో” అంటూ సానియా రెండు రోజుల క్రితం పెట్టిన పోస్ట్‌ ఇప్పుడు కలకలం రేపుతోంది. దీనిపై వచ్చిన ప్రశ్నలకు సానియా, షోయబ్‌ మౌనం అనుమానాలను బలపరుస్తోంది. దీంతో వీరిద్దరి మధ్యా ఏం జరుగుతోందన్న చర్చ పాకిస్తాన్‌ మీడియాలో కథలు కథలుగా ప్రచారం జరుగుతోంది. సరిహద్దులు చెరిపేస్తూ హైదరాబాదీ టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా, పాకిస్తాన్‌ క్రికెటర్‌ షోయబ్‌ మాలిక్‌లకు 2010 లో ఒక్కటయ్యారు. హైదరాబాద్‌ వేదికగా వీరిప్రేమ వివాహం ఓ సంచలనమే అయ్యింది. 2018లో ఇజాన్‌ మీర్జా మాలిక్‌కి జన్మనిచ్చారు. అంతవరకూ బాగానే ఉంది. అయితే ఈ మధ్య వీరిద్దరి మధ్యా వివాదాలపై పాకిస్తాన్‌ మీడియా కోడై కూస్తోండడం సర్వత్రా హాట్‌ టాపిక్‌ గా మారింది.

ఇటీవల సానియా, మాలిక్‌ల కొడుకు ఇజాన్‌ మీర్జా మాలిక్ నాలుగో బర్త్‌డే దుబైలో జరిగింది. సానియా తన కొడుకుతో ఉన్న ఓ ఫొటో ఇన్‌స్టాగ్రాంలో షేర్‌ చేస్తూ … ఈ అద్భుతమైన క్షణాలే తనని కష్టతరమైన రోజుల నుంచి బయటపడేట్టు చేస్తాయంటూ… కామెంట్‌ పెట్టడంతో సానియా మ్యారిటల్‌ లైఫ్‌లో ఏదో జరుగుతోందన్న చర్చ రచ్చరేపుతోంది. ఇక కొడుకు బర్త్ డే ఫోటోలు షేర్ చేసిన షోయబ్.. దానికి ఇచ్చిన క్యాప్షన్ చూసి నెటిజన్లంతా షాక్ అయ్యారు. నువ్వుపుట్టినప్పడు మేం చాలా గర్వంగా ఫీల్ అయ్యాం. ప్రతీ రోజు మేం నిన్ను చూడలేకపోవచ్చు, కలవలేకపోవచ్చు.. కానీ నాన్న నీ గురించి ప్రతీ క్షణం ఆలోచిస్తాడు… నీ నవ్వును అనుక్షణం గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటాడు. అని పేర్కొన్నాడు.

పన్నెండేళ్ల పాటు ఎంతో అన్యోన్యంగా సాగిన వీరి జీవితంలో ఇప్పుడు ఏదో వెలితి కనిపిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మధ్యకాలంలో సానియా, షోయబ్‌ చేసిన పోస్టులు నెట్టింట కొత్త చర్చకు తెరలేపాయి. దీంతో సానియా, షోయబ్ విడిపోతున్నారని వార్తలు వైరల్ అవుతున్నాయి.

మరిన్ని క్రీడావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..