AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs ZIM: జింబాబ్వేపై ఘనవిజయం.. ఇంగ్లాండ్‌తో సెమీస్‌ ఆడనున్న టీమిండియా.. ఎప్పుడంటే?

టీ20 ప్రపంచకప్‌లో భాగంగా నేడు జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. జింబాబ్వేపై 71 పరుగుల తేడాతో విజయంతో గ్రూప్ 2లో అగ్రస్థానంలో నిలిచింది.

IND vs ZIM: జింబాబ్వేపై ఘనవిజయం.. ఇంగ్లాండ్‌తో సెమీస్‌ ఆడనున్న టీమిండియా.. ఎప్పుడంటే?
Team India
Venkata Chari
|

Updated on: Nov 06, 2022 | 5:05 PM

Share

టీ20 ప్రపంచకప్‌లో భాగంగా నేడు జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. జింబాబ్వేపై 71 పరుగుల తేడాతో విజయంతో గ్రూప్ 2లో అగ్రస్థానంలో నిలిచింది. దీంతో సెమీస్ చేరిన జట్ల వివరాలు వెల్లడికావడంతోపాటు, ఏ టీం ఎవరితో పోటీ పడనుందో కూడా తేలిపోయింది. నవంబర్ 9న జరిగే తొలి సెమీస్‌లో న్యూజిలాండ్ టీంతో పాకిస్తాన్ తలపడనుంది. అలాగే 10వ తేదీన జరిగే రెండో సెమీస్‌లో ఇంగ్లండ్‌తో టీమిండియా పోటీ పడనుంది. ఇక మ్యాచ్ గురించి మాట్లాడితే, టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్ 25 బంతుల్లో 61 పరుగులు చేశాడు. అతని స్ట్రైక్ రేట్ 244గా నిలిచింది. ఈ సమయంలో అతను 6 ఫోర్లు, 4 సిక్సర్లు బాదాడు.

అలాగే కేఎల్ రాహుల్ కూడా 35 బంతుల్లో 51 పరుగులు చేశాడు. జింబాబ్వే తరపున సీన్ విలియమ్స్ అత్యధికంగా 2 వికెట్లు పడగొట్టాడు.

నేటి మ్యాచ్‌లోనూ టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఫ్లాప్ షో కొనసాగింది. రోహిత్ 13 బంతులు ఎదుర్కొని 15 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరుకున్నాడు. అదే సమయంలో అద్భుతమైన ఫామ్‌లో ఉన్న విరాట్ కోహ్లీ కూడా 26 పరుగులు మాత్రమే చేయగలిగాడు. రిషబ్ పంత్ కూడా తనకు ప్లేయింగ్ ఎలెవన్‌లో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. 5 బంతుల్లో 3 పరుగులు చేసి ఔటయ్యాడు.

ఇవి కూడా చదవండి

దీనికి సమాధానంగా టీమ్ ఇండియా తొలి బంతికే తొలి వికెట్ పడగొట్టి, జింబాబ్వేను కోలుకోనివ్వకుండా అడ్డుకుంది. భువనేశ్వర్ కుమార్ తొలి బంతికే వెస్లీ మాధేవేర్‌ను అవుట్ చేశాడు. షార్ట్ కవర్ వద్ద విరాట్ కోహ్లీ అద్భుత క్యాచ్ పట్టాడు. 6 బంతుల్లో 0 పరుగులు చేసిన తర్వాత రెగిస్ చకబ్వా అర్ష్‌దీప్ సింగ్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. అలా వెంటవెంటనే జింబాబ్వే జట్టు వికెట్లను కోల్పోతూ పరాజయం పాలైంది. జింబాబ్వే కేవలం 17.2 ఓవర్లలో 115 పరుగులకే ఆలౌట్ అయింది.

భారత బౌలర్లలో హార్దిక్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, అర్ష్దీప్ సింగ్ తలో వికెట్ పడగొట్టాడా ఆర్. అశ్విన్ 3, మహ్మద్ షమీ 2 వికెట్లు తీశాడు.

ఇరుజట్లు..

జింబాబ్వే ప్లేయింగ్ XI: వెస్లీ మాధేవెరే, క్రెయిగ్ ఎర్విన్ (కెప్టెన్), రెగిస్ చకబ్వా (కీపర్), సీన్ విలియమ్స్, సికందర్ రజా, టోనీ మునియోంగా, ర్యాన్ బర్ల్, టెండై చటారా, రిచర్డ్ నగరవ, వెల్లింగ్టన్ మసకద్జా, బ్లెస్సింగ్ ముజరబానీ

భారత్ ప్లేయింగ్ XI: కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ(కీపర్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రిషబ్ పంత్(కెప్టెన్), అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, భువనేశ్వర్ కుమార్, మహమ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్

Follow Us
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..