Virat Kohli: కోహ్లి ఫ్యాన్స్‌తో అట్లుంటది మరి.. బర్త్‌డే స్పెషల్‌గా ఆకాశాన్ని తాకేలా హైదరాబాద్‌లో భారీ కటౌట్..
భారత దిగ్గజ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులు హైదరాబాద్‌లో 50 అడుగుల పొడవైన కటౌట్‌ను ఉంచారు. ఈ ఫోటో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
భారత జట్టు మాజీ కెప్టెన్, వెటరన్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ నేడు తన 34వ పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకుంటున్నాడు. ఈ సందర్భంగా ఫ్యాన్స్ దేశవ్యాప్తంగా సంబరాలు చేసుకోవడంతో.. సోషల్ మీడియాలో విరాట్ పేరు మార్మోగిపోతోంది. కింగ్ కోహ్లి పుట్టినరోజు సందర్భంగా హైదరాబాద్‌లో వేడుకలకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇక్కడ విరాట్ కోహ్లీ పుట్టినరోజు సందర్భంగా 50 అడుగుల పొడవైన కటౌట్‌ను అభిమానులు ఏర్పాటు చేశారు.
కోహ్లీకి ‘ భారీ ‘ గిఫ్ట్
విరాట్ కోహ్లీ పుట్టినరోజు సందర్భంగా హైదరాబాద్ అభిమానులు అతనికి చాలా స్పెషల్ గిఫ్ట్ ఇచ్చారు. ఈ సందర్భంగా అభిమానులు విరాట్ కోహ్లీ 50 అడుగుల పొడవైన కటౌట్‌ను ఆర్టీసీ క్రాస్ రోడ్‌లో ఉన్న సుదర్శన్ థియేటర్ వద్ద ఈ కటౌట్ ఉంచారు. విరాట్ కటౌట్ ఫోటో సోషల్ మీడియాలో షేర్ చేయడంతో.. బాగా వైరల్ అవుతోంది. అలాగే ఆయన పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేకంగా వేడుకలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు.
ఆర్టీసీ క్రాస్ రోడ్‌లో భారీ కటౌట్ ఇక్కడ చూడండి..
Virat Kohli 50 Feet Cutout at Sudarshan Theatre?Rtc X Roads#KingKohliBirthday #ViratKohli? #HappyBirthdayViratKohli pic.twitter.com/07Sqqm4DK1
— MB-VK❤️ (@VIRATIAN18_DHFM) November 4, 2022
టీ 20 ప్రపంచకప్‌లో సత్తా చూపిస్తోన్న విరాట్ కోహ్లీ..
ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 ప్రపంచకప్ 2022లో విరాట్ కోహ్లీ అద్భుత ఫామ్‌లో కొనసాగుతున్నాడు. ప్రపంచకప్‌లో ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్‌ల్లో మూడు హాఫ్ సెంచరీలు సాధించాడు. ప్రపంచకప్‌లో విరాట్ ఇప్పటివరకు 220 పరుగులు చేశాడు. అదే సమయంలో ఈ కాలంలో అతని స్ట్రైక్ రేట్ 144.73గా ఉంది.
తన 34వ పుట్టినరోజు సందర్భంగా టీ20 ప్రపంచకప్‌ను భారత్‌కు అదించడం ద్వారా విరాట్ కోహ్లీ తనకు, దేశానికి పెద్ద బహుమతిని అందించాలనుకుంటున్నాడు. ముఖ్యంగా విరాట్ ప్రస్తుత ఫామ్ చూస్తుంటే టీ20 ప్రపంచకప్‌ను భారత్ గెలుచుకునే అవకాశాలు బాగా పెరిగాయి. టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా తన తదుపరి మ్యాచ్‌ను జింబాబ్వేతో ఆడాల్సి ఉంది. ప్రపంచకప్‌లో సెమీఫైనల్‌కు అర్హత సాధించాలంటే జింబాబ్వేతో జరిగే ఈ మ్యాచ్‌లో విజయం తప్పనిసరి. ప్రస్తుతం సూపర్-12 గ్రూప్-బిలో భారత జట్టు 6 పాయింట్లతో మొదటి స్థానంలో ఉంది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయిండి..