- Telugu News Photo Gallery Cricket photos Virat kohli birthday net worth and social media income full details check here
Virat Kohli Net Worth: బ్యాట్‌పై స్టిక్కర్ నుంచి సోషల్ మీడియా వరకు.. కింగ్ కోహ్లీ సంపాదన చూస్తే అవాక్కవ్వాల్సిందే..
టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ బ్యాట్‌తో పాటు సంపాదన పరంగానూ రికార్డులు సృష్టించాడు. సోషల్ మీడియా ద్వారానే దాదాపు రూ.300 కోట్లకు పైగా సంపాదిస్తున్నట్లు నివేదికలు వెల్లడించాయి.
Updated on: Nov 05, 2022 | 12:26 PM

విరాట్ కోహ్లీకి 34 ఏళ్లు. నవంబర్ 5, 1988లో జన్మించిన కోహ్లి నేటి భారత క్రికెట్‌కు కీలకంగా మారాడు. మూడు ఫార్మాట్లలోనూ జట్టుకు సారథ్యం వహించిన కోహ్లి.. బ్యాట్‌తో ఎన్నో రికార్డులను తన పేరిట లిఖించుకోవడమే కాకుండా.. సంపాదనలోనూ రారాజుగా నిలిచాడు.

2022లో ప్రపంచంలోనే అత్యధిక పారితోషికం అందుకున్న క్రికెటర్‌గా కోహ్లీ నిలవడమే కాదు.. ప్రపంచంలో అత్యధికంగా సంపాదించే 100 మంది ఆటగాళ్లలో కూడా చేరాడు. ఫుట్‌బాల్ ఆటగాళ్ళు, ఎన్‌బీఏ ఆటగాళ్లు ఆధిపత్యం చెలాయించే చోట కోహ్లీ ఆ జాబితాలో 61వ స్థానంలో ఉన్నాడు.

భారత మాజీ కెప్టెన్ నెలలో దాదాపు రూ.5న్నర కోట్లు సంపాదిస్తున్నాడు. కాగా, అతని నికర విలువ దాదాపు రూ.12 బిలియన్లుగా నిలిచింది.

భారత్ తరపున 102 టెస్టులు, 262 వన్డేలు, 113 టీ20 మ్యాచ్‌లు ఆడిన కోహ్లి.. పలు పెద్ద బ్రాండ్‌లకు బ్రాండ్ అంబాసిడర్‌గా పనిచేస్తున్నాడు. తన బ్యాట్‌పై స్టిక్కర్ ఉన్న కంపెనీ నుంచి కోహ్లీ ప్రతి సంవత్సరం దాదాపు రూ.12 కోట్లు సంపాదిస్తున్నాడు.

సోషల్ మీడియాలో కూడా కోహ్లీకి చాలా మంది ఫాలోవర్లు ఉన్నారు. సోషల్ మీడియా ద్వారా కోహ్లి నికర విలువ రూ.328 కోట్లు పెరిగిందని ఓ నివేదిక పేర్కొంది.




