Watch Video: గ్రాండ్‌గా కోహ్లీ బర్త్‌డే సెలబ్రేషన్స్.. నవ్వులు పూయించిన పంత్.. వీడియోలో కనిపించని రోహిత్ శర్మ..

Virat Kohli Birthday Celebrations: భారత జట్టు మాజీ కెప్టెన్, బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ ఈరోజు అంటే నవంబర్ 5న తన పుట్టినరోజును గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నాడు.

Watch Video: గ్రాండ్‌గా కోహ్లీ బర్త్‌డే సెలబ్రేషన్స్.. నవ్వులు పూయించిన పంత్.. వీడియోలో కనిపించని రోహిత్ శర్మ..
Virat kohli birthday celebrations video
Follow us
Venkata Chari

|

Updated on: Nov 05, 2022 | 1:44 PM

ఈరోజు అంటే నవంబర్ 5న భారత స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ పుట్టినరోజు. ప్రపంచ బ్యాట్స్‌మెన్‌లలో ఒకడిగా పేరుగాంచిన విరాట్ కోహ్లీ.. పుట్టినరోజు వేడుకలను ఫ్యాన్స్ ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో శుక్రవారం అర్థరాత్రి నుంచి సోషల్ మీడియాలో విరాట్ కోహ్లీ ట్రెండింగ్‌లో ఉన్నాడు. చాలా మంది స్టార్ ప్లేయర్లు విరాట్ కోహ్లీ కోసం ప్రత్యేక పోస్ట్‌లు కూడా పెట్టి, విషెస్ తెలియజేశారు. ఇదిలా ఉంటే, ఈ స్టార్ ప్లేయర్ దేశానికి దూరంగా ఆస్ట్రేలియాలో టీమిండియా జట్టుతో కలిసి పుట్టినరోజు వేడుకలు చేసుకున్నాడు. టీ20 ప్రపంచకప్‌ ఆడుతున్న టీమిండియాతో పాటు ఆస్ట్రేలియాలో విరాట్ కోహ్లీ ఉన్నాడు. ఈ టోర్నీలో కోహ్లీ బ్యాట్ పరుగుల వర్షం కురిపిస్తోంది. మ్యాచ్‌ల ఒత్తిడి మధ్య, టీమిండియా కోహ్లీ పుట్టినరోజును గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసింది.

టీమిండియాతో కోహ్లీ సంబరాలు..

విరాట్ కోహ్లీతోపాటు జట్టు మెంటల్ కండిషనింగ్ కోచ్ ప్యాడీ ఆప్టన్ పుట్టిన రోజు కూడా నేడే. దీంతో వీరద్దరూ కేక్ కేక్ కట్ చేస్తున్న వీడియోను బీసీసీఐ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇద్దరూ ముందుగా కేక్‌లు కట్‌ చేసిన తర్వాత ఒకరికొకరు తినిపించగా, ఆ తర్వాత మిగతా టీమ్‌ సభ్యులు కేక్‌లు తినిపించారు. అయితే, రిషబ్ పంత్ మాత్రం కేక్ తీసుకుని కోహ్లీ ముఖంపై కేక్ పూయడం కనిపించింది. హార్దిక్, మిగిలిన జట్టు కేక్ ప్లేయర్లు కేక్ కోసం ఎగబడ్డారు.

ఇవి కూడా చదవండి

సెలబ్రేషన్స్‌లో కనిపించని రోహిత్ శర్మ..

బీసీసీఐ ఏర్పాటు చేసిన ఈ సెలబ్రేషన్స్‌లో టీమిండియా సభ్యులు మొత్తం కనిపించారు. అయితే, టీమిండియా సారథి రోహిత్ శర్మ మాత్రం కనిపించలేదు. దీంతో ఫ్యాన్స్ దీనిపై తలో విధంగా కామెంట్లు చేస్తున్నారు. కోహ్లీ పుట్టినరోజు వేడుకల్లో టీమిండియా సారథి ఏడంటూ కొందరు, రోహిత్ లేకుండా కోహ్లీ సెలబ్రేషన్స్ చేసుకున్నాడంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.

భాగమైన భారత జర్నలిస్టులు..

ఆ తర్వాత ప్రపంచకప్‌ను కవర్ చేయడానికి వచ్చిన మీడియా మిత్రులతో కూడా కోహ్లీ పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకున్నాడు. జర్నలిస్టులు తీసుకొచ్చిన కేక్ తనకు నచ్చిందని విరాట్ చెప్పుకొచ్చాడు. అనంతరం జర్నలిస్టులతో కలిసి ఫోటోలు దిగాడు. ఆదివారం జింబాబ్వేతో టీమ్ ఇండియా తన చివరి లీగ్ మ్యాచ్ ఆడాల్సి ఉంది. దీని కోసం టీమిండియా ప్రాక్టీస్ ముమ్మరం చేసింది. ప్రస్తుతం టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కోహ్లీ నిలిచాడు. అతను నాలుగు మ్యాచ్‌ల్లో 220 సగటుతో 220 పరుగులు చేశాడు. ఈ సమయంలో కోహ్లీ స్ట్రైక్ రేట్ 144.74గా ఉంది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయిండి..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!