AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20 World Cup: మ్యాచ్‌ ఆడేది శ్రీలంక, ఇంగ్లండ్ జట్లు.. టెన్షన్ మాత్రం ఆతిథ్య జట్టులో.. సెమీస్ చేరేది ఎవరో?

ENG vs SL: టీ20 ప్రపంచకప్‌లో నేడు ఇంగ్లండ్, శ్రీలంక జట్లు తలపడేందుకు సిద్ధమయ్యాయి. పోరు లంక, ఇంగ్లండ్ టీంల మధ్యనే అయినా.. ఇది ఆస్ట్రేలియాకు మాత్రం చాలా కీలకంగా మారింది.

T20 World Cup: మ్యాచ్‌ ఆడేది శ్రీలంక, ఇంగ్లండ్ జట్లు.. టెన్షన్ మాత్రం ఆతిథ్య జట్టులో.. సెమీస్ చేరేది ఎవరో?
Eng Vd Sl Live Score
Venkata Chari
|

Updated on: Nov 05, 2022 | 1:20 PM

Share

టీ20 ప్రపంచ కప్ 2022 ఇంగ్లాండ్ వర్సెస్ శ్రీలంక మధ్య నేడు కీలక పోరు జరగనుంది. ఇంగ్లండ్‌కు ఇది చాలా ముఖ్యమైన మ్యాచ్. ఈ మ్యాచ్‌లో విజయం సాధించడం ద్వారా సెమీ ఫైనల్స్‌కు చేరుకోవచ్చు. ఒకవేళ ఈ మ్యాచ్‌లో ఓడినా లేదా మ్యాచ్ ఫలితం రాకుంటే మాత్రం ఇంగ్లండ్ సెమీస్ లెక్కల్లో మార్పులు చోటు చేసుకుంటాయి. మరోవైపు టీ20 ప్రపంచకప్‌ నుంచి శ్రీలంక జట్టు ఇప్పటికే నిష్క్రమించింది. ఇలాంటి పరిస్థితుల్లో విజయంతో ప్రపంచకప్‌కు వీడ్కోలు పలకాలనే లక్ష్యంతో ఈ మ్యాచ్‌ ఆడనుంది. ఆస్ట్రేలియా చూపు కూడా ఈ మ్యాచ్‌పైనే ఉంటుంది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఓడిపోతే ఆస్ట్రేలియాకు సెమీ-ఫైనల్ టిక్కెట్ లభిస్తుంది.

ఇంగ్లండ్‌దే పైచేయి..

ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌దే పైచేయిగా నిలవనుంది. నిజానికి ఇంగ్లండ్-శ్రీలంక మధ్య ఇప్పటి వరకు జరిగిన 13 టీ20 మ్యాచ్‌ల్లో ఇంగ్లండ్ 9 సార్లు విజయం సాధించింది. గత మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ టీంను ఓడించింది. ప్రపంచకప్‌నకు ముందు కూడా ఈ జట్టు ఆస్ట్రేలియా, పాకిస్థాన్‌లను టీ20 సిరీస్‌లలో ఓడించింది. మరోవైపు ఈ ప్రపంచకప్‌లో ఇప్పటి వరకు శ్రీలంకకు ప్రత్యేకంగా ఏమీ లేదు. ప్రపంచకప్‌లో తొలి మ్యాచ్‌లోనే నమీబియా వంటి చిన్న జట్టు చేతిలో ఓడిపోయింది. సూపర్-12 రౌండ్‌లోనూ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ చేతిలో ఘోరంగా ఓడిపోయింది. దీంతో ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ టీందే పైచేయిగా నిలవనుంది.

ఫలితంపైనే ఆస్ట్రేలియా భవితవ్యం..

గ్రూప్ 1 నుంచి సెమీస్ చేరే రెండో జట్టుపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం ఈ స్థానం కోసం ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్లు కన్నేశాయి. అయితే, ఆస్ట్రేలియా 5 మ్యాచ్‌ల్లో 3 విజయాలు, ఒక ఓటమి, ఒక మ్యాచ్ రద్దుతో మొత్తం 7 పాయింట్లు ఖాతాలో వేసుకుంది. అయితే, నెట్ రన్ రేట్ విషయంలో మాత్రం నెగిటివ్‌లోనే ఉంచుకుంది. ఇక ఇంగ్లండ్ జట్టు విషయానికి వస్తే.. 4 మ్యాచ్‌ల్లో 2 విజయాలు, ఒక ఓటమి, ఒక మ్యాచ్ రద్దుతో మొత్తం 5 పాయింట్లు సాధించింది. శ్రీలంకపై విజయం సాధిస్తే మాత్రం సెమీస్ లిస్టులో చేరిపోతుంది. దీంతో ఆస్ట్రేలియా టోర్నీ నుంచి తప్పుకుంటుంది. ఎందుకంటే ఇరు జట్లు 7 పాయింట్లతో సమంగా ఉంటాయి. అయితే, ఇంగ్లండ్ జట్టు నెట్ రన్ రేట్ ప్లస్‌లో ఉంది. అలా కాకుండా ఓడిపోయినా లేదా ఫలితం తేలకపోయినా ఇంగ్లండ్ జట్లు ఇంటికేపోనుంది.

ఇవి కూడా చదవండి

ఇరుజట్లు..

ఇంగ్లండ్ ప్లేయింగ్ XI: జోస్ బట్లర్(w/c), అలెక్స్ హేల్స్, మొయిన్ అలీ, లియామ్ లివింగ్‌స్టోన్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్, సామ్ కర్రాన్, డేవిడ్ మలన్, క్రిస్ వోక్స్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్

శ్రీలంక ప్లేయింగ్ XI: పాతుమ్ నిస్సాంక, కుసల్ మెండిస్(w), ధనంజయ డి సిల్వా, చరిత్ అసలంక, భానుక రాజపక్స, దసున్ షనక(సి), వనిందు హసరంగా, చమిక కరుణరత్నే, మహేశ్ తీక్షణ, లహిరు కుమార, కసున్ రజిత

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయిండి..

Follow Us