AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2023: చెన్నై సూపర్ కింగ్స్‌తోనే టీమిండియా స్టార్ ప్లేయర్.. ఎట్టి పరిస్థితుల్లో వదులుకోం అంటోన్న సీఎస్కే మేనేజ్‌మెంట్..

ఐపీఎల్ జట్లు 2023కి సంబంధించిన ఆటగాళ్ల జాబితాను నవంబర్ 15లోగా సమర్పించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో అన్ని జట్లు తమ ఆటగాళ్ల జాబితాను సిద్ధంచేసుకునేందుకు ప్లాన్ చేస్తున్నాయి.

IPL 2023: చెన్నై సూపర్ కింగ్స్‌తోనే టీమిండియా స్టార్ ప్లేయర్.. ఎట్టి పరిస్థితుల్లో వదులుకోం అంటోన్న సీఎస్కే మేనేజ్‌మెంట్..
Csk Team
Venkata Chari
|

Updated on: Nov 05, 2022 | 7:04 PM

Share

గతేడాది ఐపీఎల్ మధ్యలో జట్టు సారథ్యం నుంచి తప్పుకున్న రవీంద్ర జడేజా.. చెన్నై సూపర్ కింగ్స్‌లోనే కొనసాగనున్నాడు. టీమ్ మేనేజ్‌మెంట్ జడేజాను విడుదల చేయడం లేదు. జడేజాను జట్టులోకి తీసుకోవాలని కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ టీమ్ మేనేజ్‌మెంట్‌కు తెలిపాడు. అదే సమయంలో ఐపీఎల్ జట్లు 2023కి సంబంధించిన ఆటగాళ్ల జాబితాను నవంబర్ 15లోగా సమర్పించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో అన్ని జట్లు తమ ఆటగాళ్ల జాబితాను సిద్ధంచేసుకునేందుకు ప్లాన్ చేస్తున్నాయి. ఎవరిని ఉంచాలి, ఎవరిని విడుదల చేయాలో ప్రిపేర్ చేసుకుంటున్నాయి.

నిజానికి జడేజా టీమ్ మేనేజ్‌మెంట్‌కు దూరం కావడం ప్రస్తావనకు వచ్చింది. గత ఐపీఎల్ సీజన్ ప్రారంభంలో జడేజాకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. టీమ్ మేనేజ్‌మెంట్, ధోనీతో వివాదం తర్వాత అతను జట్టును మధ్యలోనే వదిలేశాడు. తర్వాత ఆ గాయాన్ని ఉదహరించాడు. అదే సమయంలో అతను సోషల్ మీడియా నుంచి CSK కి సంబంధించిన అన్ని పోస్ట్‌లను తొలగించాడు. ఆ తర్వాత CSK మేనేజ్‌మెంట్‌పై జడేజా కోపంగా ఉన్నాడని, అతను వచ్చే సీజన్‌లో CSK నుంచి బయటకు రావొచ్చని మీడియాలో వార్తలు వినిపించాయి. తాజాగా CSK CEO కాశీ విశ్వనాథన్ మాట్లాడుతూ, జడేజా జట్టులో ముఖ్యమైన సభ్యుడు, అతను ఫ్రాంచైజీతో ఉంటాడని తెలిపాడు.

జడేజాకే అత్యధికంగా..

గత సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ మహేంద్ర సింగ్ ధోని కంటే ఎక్కువ డబ్బు చెల్లించి రవీంద్ర జడేజాను అట్టిపెట్టుకుంది. జడేజాకు రూ.16 కోట్లు, ధోనీని రూ.12 కోట్లకు అట్టిపెట్టుకున్నారు. జడేజా 2012 నుంచి చెన్నై సూపర్ కింగ్స్‌తో అనుబంధం కలిగి ఉన్నాడు. ఆ జట్టుతో రెండు టైటిల్స్ గెలుచుకున్నాడు.

ఇవి కూడా చదవండి

8 మ్యాచ్‌ల్లో CSKకి కెప్టెన్‌గా..

గత సీజన్‌లో CSKని మధ్యలో వదిలివేసే ముందు జడేజా 8 మ్యాచ్‌లలో జట్టుకు కెప్టెన్‌గా ఉన్నాడు. ఇందులో జట్టు 6 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. జట్టు కేవలం రెండు మ్యాచ్‌ల్లో మాత్రమే విజయం సాధించింది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయిండి..

టీ20 ప్రపంచ కప్ నుంచి బంగ్లాదేశ్ ఔట్.. రంగంలోకి మరో జట్టు?
టీ20 ప్రపంచ కప్ నుంచి బంగ్లాదేశ్ ఔట్.. రంగంలోకి మరో జట్టు?
పదే పదే కడుపు నొప్పి వస్తున్నా లైట్ తీసుకుంటున్నారా.. ప్రమాదకరమే
పదే పదే కడుపు నొప్పి వస్తున్నా లైట్ తీసుకుంటున్నారా.. ప్రమాదకరమే
ఏడు జన్మలలో ఒకే వ్యక్తి భర్తగా ఉండగలరా..? ఎలా సాధ్యమో తెలుసుకోండి
ఏడు జన్మలలో ఒకే వ్యక్తి భర్తగా ఉండగలరా..? ఎలా సాధ్యమో తెలుసుకోండి
మందుబాబులకు పూనకాలే.. దేశంలోనే బెస్ట్ బార్ల లిస్ట్ వచ్చేసింది
మందుబాబులకు పూనకాలే.. దేశంలోనే బెస్ట్ బార్ల లిస్ట్ వచ్చేసింది
శుక్రుడి ఎఫెక్ట్ :అదృష్టం కలిసి వచ్చే రాశులివే.. మరి మీ రాశి ఉందా
శుక్రుడి ఎఫెక్ట్ :అదృష్టం కలిసి వచ్చే రాశులివే.. మరి మీ రాశి ఉందా
ఆధార్ కార్డు ఉన్నవారికి అదిరిపోయే న్యూస్..కేంద్రం నుంచి రూ.90వేలు
ఆధార్ కార్డు ఉన్నవారికి అదిరిపోయే న్యూస్..కేంద్రం నుంచి రూ.90వేలు
టీవీ9 నెట్‌వర్క్ ఆధ్వర్యంలో ఆటో 9 అవార్డులు..
టీవీ9 నెట్‌వర్క్ ఆధ్వర్యంలో ఆటో 9 అవార్డులు..
మతిమరుపు వేధిస్తోందా? ఫోకస్ కుదరట్లేదా?
మతిమరుపు వేధిస్తోందా? ఫోకస్ కుదరట్లేదా?
చేతిలో ఉన్న వస్తువు కిందపడిపోతే భవిష్యత్తుకు సంకేతమా? శాస్త్రంలో.
చేతిలో ఉన్న వస్తువు కిందపడిపోతే భవిష్యత్తుకు సంకేతమా? శాస్త్రంలో.
మీ పాదాల్లోనే మీ ఆరోగ్య రహస్యం.. ఈ లక్షణాలను లైట్ తీసుకుంటే..
మీ పాదాల్లోనే మీ ఆరోగ్య రహస్యం.. ఈ లక్షణాలను లైట్ తీసుకుంటే..