IND vs ZIM: మెల్‌బోర్న్‌లో విజయం తప్పనిసరి.. లేదంటే సెమీస్ కష్టమే.. టీమిండియా ప్లేయింగ్ 11లో పలు మార్పులు?

India vs Zimbabwe T20 World Cup 2022: భారత్ సెమీ-ఫైనల్‌కు చేరుకోవాలంటే జింబాబ్వే‌తో జరిగే మ్యాచ్‌లో గెలవడం తప్పనిసరి. లేదంటే ఫలితాలు మారిపోతాయి.

IND vs ZIM: మెల్‌బోర్న్‌లో విజయం తప్పనిసరి.. లేదంటే సెమీస్ కష్టమే.. టీమిండియా ప్లేయింగ్ 11లో పలు మార్పులు?
Team India
Follow us

|

Updated on: Nov 06, 2022 | 6:30 AM

భారత క్రికెట్ జట్టు ఐసీసీ టీ20 ప్రపంచ కప్-2022 లో ఇప్పటివరకు మంచి ప్రదర్శనతో దూసుకపోతోంది. అయితే సెమీ-ఫైనల్‌లో టీమిండియా స్థానం ఇంకా నిర్ధారణకాలేదు. ఇందుకోసం ఆదివారం జింబాబ్వేతో జరిగే మ్యాచ్‌లో రోహిత్ సేన తప్పక గెలవాల్సి ఉంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే సెమీ ఫైనల్స్‌కు చేరుకోవడం ఖాయం. అయితే జింబాబ్వే జట్టు గెలిస్తే మాత్రం భారత్‌కు కష్టాలు తప్పవు. ఈ ప్రపంచకప్‌లో వర్షం కూడా చాలా మ్యాచ్‌లకు ఆటంకం కలిగించింది. భారత్‌-జింబాబ్వే మధ్య మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దయినా.. భారత్‌కే లాభిస్తుంది. ఎందుకంటే భారత్ ఖాతాలో మరో పాయింట్ చేరుతుంది. దీంతో రోహిత్ సేన సెమీ-ఫైనల్ ఆడేందుకు అవకాశం ఉంది.

రోహిత్ నుంచి భారీ ఇన్నింగ్స్ వచ్చేనా..

సెమీఫైనల్‌కు చేరుకోవాలంటే భారత్ తప్పక గెలవాల్సింది. ఇక కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ఈ మ్యాచ్‌లో భారీ ఇన్నింగ్స్ ఆడేందుకు ప్రయత్నిస్తాడు. కొన్ని ఆకట్టుకునే ఇన్నింగ్స్‌లు కూడా ఆడినా.. వాటిని భారత కెప్టెన్ సుదీర్ఘ ఇన్నింగ్స్‌లుగా మలచలేకపోయాడు. టోర్నీలో ఇప్పటి వరకు ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో 74 పరుగులు మాత్రమే చేసిన రోహిత్.. కొన్ని చిరస్మరణీయ ఇన్నింగ్స్‌లు ఆడిన మైదానంలో ఇప్పుడు అడుగుపెట్టనున్నాడు.

జింబాబ్వే జట్టును తక్కువ అంచనా వేస్తే కష్టమే..

జింబాబ్వేపై ఎట్టిపరిస్థితుల్లోనూ భారత జట్టు విజయాన్ని నమోదు చేయాల్సిందే. రెగిస్ చకబ్వా నేతృత్వంలోని జింబాబ్వే జట్టు బలమైన పోటీదారుగా నిలిచన నేపథ్యంలో.. రోహిత్ శర్మ జట్టు తప్పక విజయం సాధించాల్సిందే. కాగా, జింబాబ్వే టోర్నీలో శుభారంభం చేసినా తమ జోరును కొనసాగించలేకపోయింది. జింబాబ్వే బ్యాట్స్‌మెన్‌లు ఇప్పటి వరకు రాణించకపోవడంతో పాటు భువనేశ్వర్ కుమార్, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ షమీల ధాటికి పరుగులు చేయడం అంత సులువు కాదు.

ఓడితే టోర్నీ నుంచి ఔట్..

అయితే జింబాబ్వేను తేలిగ్గా తీసుకోవడంలో భారత్ తప్పు చేయదు. ఎందుకంటే ఈ ప్రపంచకప్‌లో జింబాబ్వే కొన్ని జట్ల తలరాతలను మార్చేసింది. పాకిస్తాన్ వంటి బలమైన జట్టును ఓడించింది. ఇటువంటి పరిస్థితిలో జింబాబ్వేను తేలికగా తీసుకుంటే మాత్రం.. టీమిండియాకు ప్రమాదకరంగా మారే ఛాన్స్ ఉంది.

సెమీ ఫైనల్స్ సమీకరణం..

ఈ మ్యాచ్‌లో గెలిస్తే భారత్‌ గ్రూప్‌-2లో అగ్రస్థానానికి చేరుకుంటుంది. అయితే ఓడిపోతే పాకిస్థాన్‌ సెమీఫైనల్‌కు చేరుకోవడానికి మార్గం చూపించినట్లు అవుతంది. పాకిస్థాన్ తమ చివరి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను ఓడిస్తే.. మెరుగైన రన్ రేట్ ఆధారంగా ముందుకు సాగుతుంది.

గ్రూప్‌లోని మరో జట్టు దక్షిణాఫ్రికా ప్రస్తుతం ఐదు పాయింట్లతో రెండవ స్థానంలో ఉంది. నెదర్లాండ్స్‌పై గెలిస్తే అది కూడా ముందుకు సాగుతుంది. అయితే సౌతాఫ్రికా ఓడిపోయి పాకిస్తాన్ గెలిస్తే, అప్పుడు పాకిస్తాన్, భారత్ టాప్ 2 లో చేరుకుంటాయి. గ్రూప్‌2లో అగ్రస్థానంలో టీమిండియా కొనసాగుతుంది. అప్పుడు టీమిండియా సెమీ-ఫైనల్‌లో ఇంగ్లాండ్ లేదా ఆస్ట్రేలియాతో తలపడవచ్చు.

హుడాకు అవకాశం వస్తుందా?

భారత జట్టు ప్రస్తుతం బ్యాటింగ్ ఆర్డర్‌ను మార్చలేదు. దక్షిణాఫ్రికాకు వ్యతిరేకంగా అక్షర్ పటేల్‌ను పక్కనపెట్టి, దీపక్ హుడాకు చొటిచ్చారు. జింబాబ్వే బ్యాటింగ్ ఆర్డర్‌లో క్రెయిగ్ ఎర్విన్, సీన్ ఎర్విన్, ర్యాన్ బర్లే, సీన్ విలియమ్స్ వంటి దిగ్గజాలు ఉండడంతో భారత జట్టు మేనేజ్‌మెంట్ దీపక్ హుడాకు మరో అవకాశం ఇచ్చే అవకాశం ఉంది.

అయితే, ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్న పాకిస్థాన్‌లో జన్మించిన సికందర్ రజా ద్వారా భారత్‌కు అతిపెద్ద సవాలు రానుంది. హర్షల్ పటేల్‌ను ప్రయత్నించడం మరో ఎంపికగా అవ్వొచ్చు. యుజ్వేంద్ర చాహల్‌ను ఇంకా ప్రయత్నించలేదు. ఎందుకంటే టీమ్ మేనేజ్‌మెంట్ చివర్లో బ్యాట్స్‌మెన్‌ల సుదీర్ఘ వరుసను కోరుకోలేదు. అయితే సెమీఫైనల్లో ఇంగ్లండ్‌తో భారత్ తలపడితే, ఇంగ్లీష్ బ్యాట్స్‌మెన్‌పై మంచి రికార్డు ఉన్నందున చాహల్‌కు చోటు దక్కవచ్చు.

తొలిసారి ఢీ..

భారత్ వర్సెస్ జింబాబ్వే టీ20 ప్రపంచ కప్‌లో మునుపెన్నడూ తలపడలేదు.

ఇరు జట్లు:

భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), కెఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్ (వికెట్), అక్షర్ పటేల్, ఆర్ అశ్విన్, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్, భువనేశ్వర్ కుమార్, రిషబ్ పంత్, దీపక్ హుడా, హర్షల్ పటేల్, యుజ్వేంద్ర చాహల్.

జింబాబ్వే: రెగిస్ చకబ్వా (కెప్టెన్), సీన్ విలియమ్స్, సీన్ ఎర్విన్, క్రెయిగ్ ఎర్విన్, సికందర్ రజా, టెండై ఛత్రా, ల్యూక్ జోంగ్వే, బ్రాడ్ ఎవాన్స్, వెస్లీ మాధేవెరే, వెల్లింగ్టన్ మసకదజ్కా, టోనీ మున్యోంగా, రిచర్డ్ న్గర్వా, ర్యాన్ స్మ్రాంబార్వా, ర్యాన్ మ్రాంజర్వా, బ్లెస్రింగ్ బుర్లెర్వా.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయిండి..

తెలంగాణ ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షల2024 షెడ్యూల్‌లో స్వల్పమార్పులు
తెలంగాణ ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షల2024 షెడ్యూల్‌లో స్వల్పమార్పులు
సమంత హీరోయిన్ అవ్వకముందు ఏం చేసేదో తెలుసా..?
సమంత హీరోయిన్ అవ్వకముందు ఏం చేసేదో తెలుసా..?
జియో కస్టమర్లకు గుడ్‌న్యూస్‌..చౌకైన ప్లాన్‌తో 28రోజుల వ్యాలిడిటీ!
జియో కస్టమర్లకు గుడ్‌న్యూస్‌..చౌకైన ప్లాన్‌తో 28రోజుల వ్యాలిడిటీ!
చెన్నైతో ఢీ కొట్టేందుకు సిద్ధమైన సన్‌రైజర్స్ హైదరాబాద్..
చెన్నైతో ఢీ కొట్టేందుకు సిద్ధమైన సన్‌రైజర్స్ హైదరాబాద్..
పెద్దపల్లి బీజేపీలో ముసలం మొదలైంది.. ఏకంగా రోడ్డెక్కి..!
పెద్దపల్లి బీజేపీలో ముసలం మొదలైంది.. ఏకంగా రోడ్డెక్కి..!
అమెరికా పోలీసుల దాష్టికానికి మరో నల్లజాతీయుడు బలి.. వీడియో వైరల్
అమెరికా పోలీసుల దాష్టికానికి మరో నల్లజాతీయుడు బలి.. వీడియో వైరల్
ఇంటర్నెట్ లేకుండా వాట్సాప్‌లో ఫోటోలు, వీడియోలు పంపొచ్చు..
ఇంటర్నెట్ లేకుండా వాట్సాప్‌లో ఫోటోలు, వీడియోలు పంపొచ్చు..
ఇదెప్పుడు తీశారు..! ఆర్ఆర్ఆర్‌లాంటి సాంగ్ చిరంజీవి కూడా చేశారా.!!
ఇదెప్పుడు తీశారు..! ఆర్ఆర్ఆర్‌లాంటి సాంగ్ చిరంజీవి కూడా చేశారా.!!
ఎగుమతి నిషేధంలో సడలింపు.. ఈ దేశాలకు ఉల్లి సరఫరాకు గ్రీన్‌సిగ్నల్
ఎగుమతి నిషేధంలో సడలింపు.. ఈ దేశాలకు ఉల్లి సరఫరాకు గ్రీన్‌సిగ్నల్
8 ఫోర్లు, 2 సిక్సర్లతో కీలక ఇన్నింగ్స్.. కట్‌చేస్తే..
8 ఫోర్లు, 2 సిక్సర్లతో కీలక ఇన్నింగ్స్.. కట్‌చేస్తే..