AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

KL Rahul: నా జోకర్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు.. ప్రియురాలికి బర్త్ డే విషెస్‌ చెప్పిన టీమిండియా క్రికెటర్‌

ప్రియురాలితో కలిసున్న ఫొటోలను ఇన్‌స్టాలో షేర్‌ చేసిన రాహుల్ .. 'నా జోకర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు. నువ్వు ప్రతి విషయాన్ని గొప్పగా చేయాలి' అని బర్త్‌ డే విషెస్‌ చెప్పాడు రాహుల్‌

KL Rahul: నా జోకర్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు.. ప్రియురాలికి బర్త్ డే విషెస్‌ చెప్పిన టీమిండియా క్రికెటర్‌
Kl Rahul Athiya Shetty
Basha Shek
|

Updated on: Nov 05, 2022 | 9:00 PM

Share

టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ కేఎల్‌ రాహుల్‌, బాలీవుడ్ హీరోయిన్‌ అతియాశెట్టి ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. త్వరలోనే వీరి పెళ్లి జరగనుందని వార్తలు కూడా వస్తున్నాయి. ఇరు కుటుంబ సభ్యులు కూడా వీరి పెళ్లికి అంగీకరించారని, వచ్చే ఏడాది ఫిబ్రవరిలో గ్రాండ్‌ వెడ్డింగ్‌కు ముహూర్తం ఫిక్స్‌ అయిందని రూమర్స్‌ వస్తున్నాయి. కాగా శనివారం (నవంబర్‌ 5) అతియాశెట్టి పుట్టిన రోజు. ఈ సందర్భంగా ప్రియురాలితో కలిసున్న ఫొటోలను ఇన్‌స్టాలో షేర్‌ చేసిన రాహుల్ .. ‘నా జోకర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు. నువ్వు ప్రతి విషయాన్ని గొప్పగా చేయాలి’ అని బర్త్‌ డే విషెస్‌ చెప్పాడు రాహుల్‌. దీనికి అతియా తండ్రి సునీల్ శెట్టి హార్ట్ ఎమోజీతో కామెంట్ చేశారు. అతియా కూడా ‘లవ్ యూ’ అని రిప్లై ఇచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్‌ వైరల్‌గా మారింది. అభిమానులు, నెటిజన్లు అతియాకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. కాగా కేఎల్ రాహుల్, అతియా మూడేళ్లుగా డేటింగ్‌లో ఉన్నారు. ఈ ఏడాదే వారి రిలేషన్‌ను ఆఫిషియల్‌ చేశారీ లవ్లీ బర్డ్స్‌.

ఇక సూరజ్ పంచోలీ సరసన హీరో చిత్రంతో 2015లో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది అతియా. ముబారకన్, మోతీచూర్ చక్నాచూర్ సినిమాల్లో నటించినా పెద్దగా గుర్తింపుతెచ్చుకోలేకపోయింది. ఇదే సమయంలో రాహుల్‌తో రిలేషన్‌షిప్‌తో తరచూ వార్తల్లో నిలుస్తూ వస్తోంది. కాగా ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌లో రాహుల్‌ పెద్దగా ఆకట్టుకోలేదు. అయితే బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో అర్ధసెంచరీ చేసి ఫామ్‌లోకి వచ్చాడు. ఆదివారం (నవంబర్‌ 5) జింబాబ్వేతో టీమిండియా తలపడనుంది.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by KL Rahul? (@klrahul)

మరిన్ని క్రీడావార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..