IND vs PAK: ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ఫైనల్ మ్యాచ్ ఆడేది భారత్, పాక్ జట్లే.. 2007 సీన్ రిపీట్? కారణం ఇదే..

టీ20 ప్రపంచ కప్‌ 2022లో IND-PAK కలిసి సెమీ-ఫైనల్‌కు చేరాయి. ఇప్పటివరకు ఆడిన 7 టీ20 ప్రపంచ కప్‌లలో భారతదేశం-పాకిస్తాన్ ఒక్కసారి మాత్రమే సెమీ-ఫైనల్‌కు చేరాయి. 2007లో ఆడిన తొలి టీ20 ప్రపంచకప్‌లో ఇది జరిగింది.

IND vs PAK: ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ఫైనల్ మ్యాచ్ ఆడేది భారత్, పాక్ జట్లే.. 2007 సీన్ రిపీట్? కారణం ఇదే..
India Vs Pakistan T20 World
Follow us
Venkata Chari

|

Updated on: Nov 06, 2022 | 5:10 PM

ఆదివారం ఉదయం ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్‌లో సంచలనం నమోదైంది. ర్యాంకింగ్స్‌లో 17వ స్థానంలో ఉన్న నెదర్లాండ్స్ 13 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాపై విజయం సాధించింది. ఈ విజయంతో భారత్‌, పాకిస్థాన్‌లకు అత్యధిక ప్రయోజనం లభించింది. భారత్ నేరుగా సెమీఫైనల్‌కు చేరుకోగా, పాకిస్థాన్‌కు కూడా సెమీఫైనల్‌కు చేరే అవకాశాలను మరింతగా పెంచింది. అలాగే వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకున్న పాకిస్తాన్ జట్టు.. బంగ్లాదేశ్‌ను ఓడించి సెమీఫైనల్‌కు కూడా చేరుకుంది. అయితే, ఇటు పాకిస్తాన్, అటు భారత్ రెండు టీంలు సెమీఫైనల్ చేరుకోవడంతో ఇక అందరి చూపు ఫైనల్ మ్యాచ్‌పైనే నిలిచింది. టీ20 ప్రపంచ కప్ చివరి పోరులో దాయాదులు తలపడతాయంటూ జోస్యం చెబుతున్నారు. భారత్, పాక్ జట్లు ఫైనల్ మ్యాచ్‌లో తలపడాలంటే ఏం జరగాలో ఇప్పుడు చూద్దాం..

టీ20 ప్రపంచ కప్‌ 2022లో IND-PAK కలిసి సెమీ-ఫైనల్‌కు చేరాయి. ఇప్పటివరకు ఆడిన 7 టీ20 ప్రపంచ కప్‌లలో భారతదేశం-పాకిస్తాన్ ఒక్కసారి మాత్రమే సెమీ-ఫైనల్‌కు చేరాయి. 2007లో ఆడిన తొలి టీ20 ప్రపంచకప్‌లో ఇది జరిగింది. ఆ తర్వాత ఏ ప్రపంచకప్‌లోనూ ఇరు జట్లు కలిసి సెమీఫైనల్‌కు చేరుకోలేదు.

2007 ప్రపంచ కప్‌లో రెండు జట్లూ తమ తమ సెమీ-ఫైనల్ మ్యాచ్‌లలో గెలిచి ఫైనల్‌కు చేరుకున్నాయి. సెమీస్‌లో భారత్‌ ఆస్ట్రేలియాపై, పాకిస్థాన్‌ న్యూజిలాండ్‌పై విజయం సాధించాయి. ఆ తర్వాత వీరిద్దరి మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో భారత్ 5 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఇరు జట్లు ఫైనల్స్‌కు ఆడే అవకాశాలు కనిపిస్తున్నాయని ఫ్యాన్స్ అంటున్నారు.

ఇవి కూడా చదవండి

2007 వరల్డ్ కప్ ఫైనల్ స్టోరీ ఏంటో తెలుసా…

2007 టీ20 ప్రపంచ కప్‌లో గ్రూప్ మ్యాచ్ తర్వాత, ఇరు జట్లు మరోసారి ఫైనల్‌లో తలపడ్డాయి. టాస్ గెలిచిన భారత్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. గౌతమ్ గంభీర్ 54 బంతుల్లో 75 పరుగుల బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడాడు. ఈ ఇన్నింగ్స్‌లో 8 ఫోర్లు, రెండు సిక్సర్లు బాదాడు. రోహిత్ శర్మ 16 బంతుల్లో 30 పరుగులు చేశాడు. దీంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పాకిస్థాన్‌కు ఆరంభం చాలా పేలవంగా ఉంది.

దీంతో పాకిస్థాన్ 77 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత మిస్బా-ఉల్-హక్ చివరి ఓవర్ వరకు మ్యాచ్‌ని తీసుకెళ్లాడు. ఈ ఓవర్‌లో పాకిస్థాన్ విజయానికి 13 పరుగులు అవసరం కాగా, మిస్బా 43 పరుగుల వద్ద అవుట్ కావడంతో భారత్ 5 పరుగుల తేడాతో విజయం సాధించింది.

దీంతో తొలి టీ20 ప్రపంచకప్ విజేతగా ధోనీ సారధ్యంలోకి టీమిండియా నిలిచింది. ఈ మ్యాచ్‌లో చివరి ఓవర్‌ వేయడానికి జోగీందర్ శర్మ వచ్చాడు. జోగీందర్ ఒక్క మ్యాచ్‌తోనే స్టార్ అయ్యాడు. ఈ యువ బౌలర్ భారతదేశంలోని ప్రతీ క్రీడాభిమానికి చేరువయ్యాడు.

2022లో భారత్-పాకిస్థాన్ ఫైనల్‌కు చేరుకోవాలంటే..

ఈరోజు భారత్, జింబాబ్వేతో జరిగే మ్యాచ్‌లో టీమ్ ఇండియా విజయం సాధించి, గ్రూప్-2లో నంబర్-1కి చేరింది. దీంతో సెమీ-ఫైనల్‌లో ఇంగ్లండ్‌తో తలపడనుంది. అదే సమయంలో మరో సెమీఫైనల్ మ్యాచ్‌లో పాకిస్థాన్‌, న్యూజిలాండ్ టీంలు తలపడనున్నాయి.

2007 ప్రపంచ కప్ సెమీ-ఫైనల్స్‌లో కివీ జట్టును ఓడించినందున, పాకిస్తాన్ జట్టు ఖచ్చితంగా సెమీస్‌లో న్యూజిలాండ్‌పై గెలవాలని కోరుకుటుంది. అదే సమయంలో సెమీస్‌లో ఇంగ్లండ్‌తో టీమిండియా కూడా తప్పక గెలవాల్సిందే. అప్పుడే ఇరు జట్లు ఫైనల్ ఆడతాయి. ఈ రెండు జట్లు తమ సెమీస్‌లో ఓడిపోతే మాత్రం ఫైనల్ రేసు నుంచి తప్పుకుంటాయి.

చివరి మ్యాచ్‌కు ముందు సెమీ ఫైనల్‌ చేరిన భారత్..

ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌లో ఆదివారం జరిగిన తొలి మ్యాచ్‌లో నెదర్లాండ్స్ 13 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాపై విజయం సాధించింది. నెదర్లాండ్స్ విజయంతో గ్రూప్ 2 సమీకరణాలు మారిపోయాయి. భారత్ నేరుగా సెమీఫైనల్‌కు చేరుకుంది. కాగా, దక్షిణాఫ్రికా సెమీ ఫైనల్ రేసు నుంచి తప్పుకుంది.

పాకిస్థాన్ ఫేట్ మార్చిన మ్యాచ్..

2009 ఛాంపియన్ పాకిస్థాన్ టీ20 ప్రపంచకప్‌లో సెమీఫైనల్‌లోకి ప్రవేశించింది. డూ ఆర్ డై మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను 5 వికెట్ల తేడాతో ఓడించింది. దీంతో ఆ జట్టు సెమీస్‌లో న్యూజిలాండ్ టీంతో తలపగనుంది. మెల్‌బోర్న్‌ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌కు ముందే భారత్‌ టాప్‌-4లో చోటు దక్కించుకుంది. ఎందుకంటే, గ్రూప్-2లో మరో ప్రత్యర్థి దక్షిణాఫ్రికా పరాజయం పాలైంది. కీలక మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌తో 13 పరుగుల తేడాతో ఓడిపోయింది.

1983 ప్రపంచకప్‌ను గుర్తుచేస్తూ…

టీ20 ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా జట్టు ప్రయాణం ఆదివారంతో ముగిసింది. గ్రూప్ 2 మ్యాచ్‌లో నెదర్లాండ్స్ 13 పరుగుల తేడాతో ఆఫ్రికాను ఓడించి సెమీ-ఫైనల్ రేసు నుంచి నిష్క్రమించింది. ఈ ఓటమితో పాపం సౌతాఫ్రికా జట్టు 1983 ప్రపంచ కప్‌లో జరిగినట్లే.. అభిమానుల ఆశలను కూనీ చూస్తూ.. రేసు నుంచి తప్పుకుంది.