IND vs ZIM: హాఫ్ సెంచరీలతో సత్తా చాటిన రాహుల్, సూర్యకుమార్.. జింబాబ్వే టార్గెట్ ఎంతంటే?
టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 186 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ 51, సూర్యకుమార్ 59, పాండ్యా 30 పరుగులు చేశారు. విరాట్ 26, రోహిత్ 15 , పంత్ 3 పరుగులు మాత్రమే చేశారు. జింబాబ్వే ముందు 187 పరుగుల టార్గెట్ ఉంది.
టీ20 ప్రపంచకప్ చివరి లీగ్ మ్యాచ్‌లో భారత్ నేడు జింబాబ్వేతో తలపడుతోంది. టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. దీంతో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 186 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ 51, సూర్యకుమార్ 61, పాండ్యా 30 పరుగులు చేశారు. విరాట్ 26, రోహిత్ 15 , పంత్ 3 పరుగులు మాత్రమే చేశారు. జింబాబ్వే ముందు 187 పరుగుల టార్గెట్ ఉంది. కాగా, ప్లేయింగ్ ఎలెవన్‌లో రిషబ్ పంత్‌కు అవకాశం లభించింది. అదే సమయంలో, దినేష్ కార్తీక్ జట్టులో భాగం కాలేదు.
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఫ్లాప్ షో కొనసాగుతోంది. జింబాబ్వేపై కూడా అతను భారీ ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు. రోహిత్ 13 బంతులు ఎదుర్కొని 15 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరుకున్నాడు. అదే సమయంలో అద్భుతమైన ఫామ్‌లో ఉన్న విరాట్ కోహ్లీ కూడా 26 పరుగులు మాత్రమే చేయగలిగాడు. రిషబ్ పంత్ కూడా తనకు ప్లేయింగ్ ఎలెవన్‌లో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. 5 బంతుల్లో 3 పరుగులు చేసి ఔటయ్యాడు.
సూర్యకుమార్ యాదవ్ 25 బంతుల్లో 61 పరుగులు చేశాడు. అతని స్ట్రైక్ రేట్ 244గా నిలిచింది. ఈ సమయంలో అతను 6 ఫోర్లు, 4 సిక్సర్లు బాదాడు. అదే సమయంలో కేఎల్ రాహుల్ కూడా 35 బంతుల్లో 51 పరుగులు చేశాడు. 3 ఫోర్లు, 3 సిక్సులు బాదేశాడు. ఇక జింబాబ్వే తరపున సీన్ విలియమ్స్ 2 వికెట్లు తీశాడు.
ఇరుజట్లు..
జింబాబ్వే ప్లేయింగ్ XI: వెస్లీ మాధేవెరే, క్రెయిగ్ ఎర్విన్ (కెప్టెన్), రెగిస్ చకబ్వా (కీపర్), సీన్ విలియమ్స్, సికందర్ రజా, టోనీ మునియోంగా, ర్యాన్ బర్ల్, టెండై చటారా, రిచర్డ్ నగరవ, వెల్లింగ్టన్ మసకద్జా, బ్లెస్సింగ్ ముజరబానీ
భారత్ ప్లేయింగ్ XI: కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ(కీపర్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రిషబ్ పంత్(కెప్టెన్), అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, భువనేశ్వర్ కుమార్, మహమ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్