T20 World Cup: టీ20 ప్రపంచ్‌కప్ సింగిల్ సీజన్‌లో అత్యధిక పరుగుల రికార్డ్.. లిస్టులో ముగ్గురు టీమిండియా ఆటగాళ్లు..
Team India: విరాట్ కోహ్లీ కాకుండా ఈ ఆటగాళ్లు ఇప్పటివరకు టీ20 ప్రపంచ కప్‌లో ఒక సీజన్‌లో భారత జట్టు తరపున అత్యధిక పరుగులు చేసిన లిస్టులో ఉన్నారు.
టీ20 ప్రపంచ కప్ 2022లో సూపర్ 12 మ్యాచ్‌లు పూర్తయ్యాయి. ఇక నవంబర్ 9, 10 తేదీల్లో రెండు సెమీ ఫైనల్స్ జరగనున్నాయి. ఇందులో భారత జట్టు సెమీఫైనల్‌లో ఇంగ్లండ్ టీంను ఢీకొట్టనుంది. ప్రపంచకప్ ఆరంభం నుంచి టీమ్ ఇండియా అద్భుతమైన లయలో కనిపించింది. అదే సమయంలో టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ కూడా ఈ సీజన్‌లో అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు.
ఈ టీ20 ప్రపంచకప్‌లో విరాట్ ఇప్పటి వరకు ఐదు ఇన్నింగ్స్‌ల్లో 123 సగటుతో 246 పరుగులు చేశాడు. ఈ టీ20 ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు చేసిన లిస్టులో విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో నిలిచాడు. ఇప్పటివరకు టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు ఎవరో తెలుసుకుందాం.
మూడుసార్లు అగ్రస్థానంలో నిలిచిన విరాట్ కోహ్లీ..
టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు తరపున ఒక సీజన్‌లో మూడుసార్లు అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ నిలిచాడు. ఇందులో తొలిసారిగా 2014లో 319 పరుగులు, 2016లో 273 పరుగులు చేశాడు. ఈ రెండు సంవత్సరాల్లో కూడా విరాట్ కోహ్లీ టీ20 ప్రపంచకప్‌లో ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్‌గా నిలిచాడు. అదే సమయంలో ఈ ఏడాది టీ20 ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు.
లిస్టులో గౌతమ్ గంభీర్..
2007 టీ20 ప్రపంచ కప్‌లో భారత జట్టు మాజీ ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్ గౌతమ్ గంభీర్ భారత జట్టు తరపున అత్యధిక పరుగులు చేశాడు. 2007 ప్రపంచకప్‌లో అతను 225 పరుగులు చేశాడు. అయితే ఆ ఏడాది పాకిస్థాన్ ఆల్ రౌండర్ షాహిద్ అఫ్రిది ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్’గా ఎంపికయ్యాడు.
2022లో సూర్య కూడా..
ఈ ఏడాది విరాట్ కోహ్లీతో పాటు సూర్యకుమార్ యాదవ్ కూడా ఫుల్ ఫాంలో కనిపిస్తు్న్నాడు. సూర్యకుమార్ యాదవ్ ఇప్పటి వరకు ఐదు ఇన్నింగ్స్‌ల్లో 75 సగటుతో 225 పరుగులు చేశాడు. ఈ సమయంలో అతని సగటు 193.96గా నిలిచింది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..