Wildlife Video: మొసలిపై కొంగ స్వారీ.. శత్రువును స్నేహితునిగా చేసుకునే రహస్యం ఈ కొంగని అడగాలంటూ..
మొసలి వీపుపై కొంగ చాలా నిర్భయంగా నిలబడింది. ఆ మొసలి పడవ మాదిరిగా నీటిలో ఈదుతూ తనకు ఏమీ పర్వాలేదు అన్న చందంగా వెళ్తోంది. ఆ సమయంలో నది నీటిలో చాలా మొసళ్లు కనిపిస్తున్నాయి.
మొసలి నీటిలో నిగిడి ఏనుగు పట్టు అంటారు.. నీటిలో ఉన్న మొసలి బలం ఎంత ఉంటుందంటే.. మొసలి నోటిలో చిక్కుక్కున వారిని రక్షించడానికి స్వయంగా విష్ణువు వైకుంఠం నుంచి వచ్చేటంత.. అంటే మొసలి శక్తి ఏ రేంజ్ లో ఉంటుందో ఒక్కసారి ఊహించవచ్చు. మొసలి వేట శైలి చాలా ప్రమాదకరమైనది.. నీటిలో ఉన్న ఎంత బలమైన జంతువునైనా సరే రెప్పపాటులో పట్టుకుంటుంది. అయితే ప్రస్తుతం ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఒక కొంగ మొసలిపై హాయిగా స్వారీ చేస్తూ కనిపించింది.
వీడియోలో.. ఒక నదిలో ఉన్న మొసలి శరీరంపై ఓ కొంగ ధైర్యంగా నిలబడి స్వారీ చేస్తుంది. మొసలి వీపుపై కొంగ చాలా నిర్భయంగా నిలబడింది. ఆ మొసలి పడవ మాదిరిగా నీటిలో ఈదుతూ తనకు ఏమీ పర్వాలేదు అన్న చందంగా వెళ్తోంది. ఆ సమయంలో నది నీటిలో చాలా మొసళ్లు కనిపిస్తున్నాయి. అయినప్పటికీ కొంగ వేటినీ పట్టించుకోలేదు..తన మానాన తాను మొసలి పై స్వారీ చేస్తూ.. నీటిలో పయనిస్తోంది. అంతేకాదు మొసలి కూడా తనపై ఉన్న కొంగపై ఎటువంటి దాడి చేసే ప్రయత్నం చేయలేదు.. చుట్టూ ఉన్న మొసళ్ళు కూడా తమకు ఏమీ పట్టలేదు అన్నచందంగా నీటిలో తేలుతున్నాయి.
ఇక్కడ వీడియో చూడండి:
View this post on Instagram
మొసలి వీపు పై కూర్చొని కొంగ ప్రయాణిస్తున్నట్లు వీడియోలో మీరు చూడవచ్చు. మొసలి ఒక్కసారి ఏ జంతువులనైనా పట్టుకుంటే.. దాని పట్టు నుండి తప్పించుకునే అవకాశం దాదాపు కోల్పోయినట్లే అని అంటారు. అటువంటిది.. మొసలి దర్జాగా స్వారీ చేస్తోన్న కొంగ చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఎందుకంటే పక్షులు మొసళ్లకు ప్రత్యేక ఆహారం. అయితే ఇక్కడ సీన్ వేరేలా కనిపిస్తోంది.
ఈ వీడియో వైరల్‌హాగ్ అనే ఖాతాలో షేర్ చేయబడింది. 12 వేల మందికి పైగా లైక్ చేశారు.. లక్షలాది మంది చూశారు.. ఓ యూజర్ వీడియోపై కామెంట్ చేస్తూ, ‘పక్షి ఉబర్ రైడ్‌ను ఆస్వాదిస్తున్నట్లుంది’ అని కామెంట్ చేయగా.. ఇది నిజమైన డేంజర్ ప్లేయర్’ అని మరొకరు, ‘వీరు నిజమైన స్నేహితులు అని రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..