Tanzania: విక్టోరియా సరస్సులో కూలిన విమానం.. 15మంది సేఫ్.. కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్
విమానం ల్యాండ్ అయ్యే సమయంలో గాలిలో 100 మీటర్ల దూరంలో ఉంది.. ఇది అధిక వేగంతో కూడిన గాలులు, భారీ వర్షాల కారణంగా సమస్యలను ఎదుర్కొంది. వెంటనే రంగంలోకి దిగిన రెస్క్యూ సిబ్బంది విమానంలో చిక్కుకున్న ప్రయాణీకులను రక్షించే ప్రయత్నాలు చేస్తోంది.
టాంజానియాలో దారుణ ఘటన చోటు చేసుకుంది.. బుకోబా విమానాశ్రయం సమీపంలోని ఆఫ్రికాలోని అతిపెద్ద సరస్సులో విమానం కూలిపోయింది. ప్రెసిషన్ ఎయిర్‌కు చెందిన వాణిజ్య విమానం విక్టోరియా సరస్సులో కూలిపోయింది. ప్రయాణికులను రక్షించేందుకు ఉదయం నుంచి రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. స్థానిక మీడియా ప్రకారం.. దార్-బుకోబా-మ్వాన్జా నుండి ప్రయాణీకుల విమానం PW 494 బుకోబా విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యే సమయంలో విక్టోరియా సరస్సులో కూలిపోయింది. ఈ విమానంలో సిబ్బంది సహా మొత్తం 53 మంది ఉన్నట్లు తెలుస్తోంది. వీరిలో 49 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ విమాన ప్రమాదానికి కారణం ప్రతికూల వాతావరణం అని.. అందుకనే ల్యాండ్ అయ్యే ముందు.. విమానం సరస్సులోకి దూసుకెళ్లిందని చెబుతున్నారు. విమానంలోని 49 మంది ప్రయాణికులను రక్షించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.
విమానం ల్యాండ్ అయ్యే సమయంలో గాలిలో 100 మీటర్ల దూరంలో ఉంది.. ఇది అధిక వేగంతో కూడిన గాలులు, భారీ వర్షాల కారణంగా సమస్యలను ఎదుర్కొంది. వెంటనే రంగంలోకి దిగిన రెస్క్యూ సిబ్బంది విమానంలో చిక్కుకున్న ప్రయాణీకులను రక్షించే ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటివరకు 15 మందిని రక్షించినట్లు ప్రభుత్వ యాజమాన్యంలోని టాంజానియా బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్ (టిబిసి) తెలిపింది. ప్రాణనష్టం జరిగిందా అనేది తెలియాల్సి ఉందని పేర్కొంది.
Precision Air flight plunges into Lake Victoria when landing at Bukoba Airport in Tanzania, authorities say rescue operations underway
?: Courtesy pic.twitter.com/WJLYfGeVjw
— Citizen TV Kenya (@citizentvkenya) November 6, 2022
విమానంలో అధిక భాగం.. సరస్సులో మునిగిపోయిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. రెస్క్యూ బోట్‌లను మోహరించారు. విమానంలో చిక్కుకున్న ఇతర ప్రయాణీకులను రక్షించడానికి అత్యవసర సహాయ కార్యక్రమాలను చేపట్టారు. అల్-జజీరా నివేదిక ప్రకారం, టాంజానియాలోని అతిపెద్ద ప్రైవేట్ ఎయిర్‌లైన్ సంస్థ ప్రెసిషన్ ఎయిర్ గా తెలుస్తోంది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..