AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Afghanistan: ఆఫ్ఘనిస్తాన్ లో ఈ టన్నెల్ వెరీ వెరీ స్పెషల్.. ఎన్నో దుర్ఘటనలకు సజీవ సాక్ష్యం.. ఎంత మంది మరణానికి కారణం అయిందో తెలుసా

సలాంగ్ టన్నెల్ ఆఫ్ఘనిస్తాన్‌లోని హిందూ కుష్ పర్వతాలలో బగ్లాన్ ప్రావిన్సుల పర్వాన్ మధ్యలో నిర్మించబడింది. ఇది 2.6 కి.మీ పొడవైన సొరంగం, దీనిని 1960లో సోవియట్ యూనియన్ నిర్మించింది. ఉత్తర-దక్షిణ దిశలో ఏడాది పొడవునా తెరిచి ఉండే ఏకైక రహదారి ఇదే..

Afghanistan: ఆఫ్ఘనిస్తాన్ లో ఈ టన్నెల్ వెరీ వెరీ స్పెషల్.. ఎన్నో దుర్ఘటనలకు సజీవ సాక్ష్యం.. ఎంత మంది మరణానికి కారణం అయిందో తెలుసా
Afghanistan Salang Tunnel
Surya Kala
|

Updated on: Nov 03, 2022 | 3:49 PM

Share

ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్‌ను దేశంలోని ఉత్తర నగరాలకు కలిపే సలాంగ్ టన్నెల్ అనేక విషయాలకు ప్రసిద్ధి చెందింది. అంతేకాదు ఈ టన్నెల్ భారీ  అగ్నిప్రమాదానికి గురై ఎందరో మరణానికి కారణమైన టన్నెల్ గా కూడా ప్రసిద్ది చెందింది. ఈ అగ్ని ప్రమాదంలో 2700 నుండి 3 వేల మంది మరణించినట్లు అంచనా. కొన్ని ఏళ్ల క్రితం.. నవంబర్ 3న అంటే ఈ రోజున.. సలాంగ్ టన్నెల్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో అనేక మంది సోవియట్, ఆఫ్ఘన్ సైనికులు, పౌరులు మరణించారు.

అధికారిక గణాంకాల ప్రకారం.. అప్పుడు జరిగిన ఈ ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య 168 నుండి 176 వరకు ఉంది. అయితే పాశ్చాత్య మీడియా 2700 నుండి 3 వేల మంది మరణించినట్లు అంచనా వేసింది. అంతేకాదు ఆధునిక కాలంలోని ఘోరమైన అగ్నిప్రమాదంగా .. చరిత్రలో ఘోరమైన రోడ్డు ప్రమాదంగా కూడా మీడియాలో అభి వర్ణించబడింది.

ప్రమాదం ఎలా జరిగిందంటే… ఆఫ్ఘనిస్తాన్‌ను సోవియట్ ఆక్రమణ సమయంలో 1982 నవంబర్ 3న సలాంగ్ టన్నెల్‌లో అగ్నిప్రమాదం జరిగింది. ఈ సంఘటన గురించి చాలా తక్కువ సమాచారం ప్రపంచానికి వెల్లడైంది. సోవియట్ లేదా ఆఫ్ఘన్ ప్రభుత్వాలు ఈ సంఘటనను ధృవీకరించలేదు. అయితే ఈ  విషయం గురించి ప్రపంచ దేశాల మీడియా ప్రకటించిన సమాచారం ప్రకారం..ఆఫ్ఘనిస్తాన్‌లో ఆక్రమణ కోసం  సొవియట్ ఆర్మీ కాన్వాయ్ దక్షిణాన సొరంగం గుండా ప్రయాణించింది. ఆ  సమయంలో సోవియట్ సైన్యం రికార్డుల ప్రకారం..  3 నవంబర్ 1982న.. సలాంగ్ టన్నెల్‌లో రెండు మిలిటరీ కాన్వాయ్‌లు (2211 – 2212) ఢీ కొన్నాయి. అప్పుడు జరిగిన ఈ ప్రమాదంలో టన్నెల్ లో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అంతేకాదు భారీ పేలుడు సంభించి మంటలు ఏర్పడ్డాయి.

ఇవి కూడా చదవండి

ఈ ప్రమాదంపై పాశ్చాత్య దౌత్యవేత్తలు స్పందిస్తూ.. ఇంధన ట్రక్కుతో  మిలిటరీ కాన్వాయ్‌ ఢీకొన్న తర్వాత సొరంగంలో మంటలు చెలరేగాయని.. భారీ విధ్వసం సృష్టించిందని చెప్పారు. ఈ ప్రమాదంలో సుమారు  700 మంది సోవియట్ సైనికులు,  400 నుండి 2000 మంది ఆఫ్ఘన్ పౌరులు మరణించారని పేర్కొన్నారు. అగ్ని ప్రమాదంలో మంటల్లో చిక్కుకుని కొందరు.. ఊపిరాడక అందక మరికొందరు చనిపోయారని చెప్పారు. అయితే ఈ ప్రమాదంలో మరించిన వారి సంఖ్యలో మార్పులు చోటు చేసుకుంటూనే ఉంది.

సలాంగ్ టన్నెల్ ఆఫ్ఘనిస్తాన్‌లోని హిందూ కుష్ పర్వతాలలో బగ్లాన్ ప్రావిన్సుల పర్వాన్ మధ్యలో నిర్మించబడింది. ఇది 2.6 కి.మీ పొడవైన సొరంగం, దీనిని 1960లో సోవియట్ యూనియన్ నిర్మించింది. ఉత్తర-దక్షిణ దిశలో ఏడాది పొడవునా తెరిచి ఉండే ఏకైక రహదారి ఇదే. అనేక హిమపాత సంఘటనలకు సజీవ సాక్ష్యం ఈ టన్నెల్. 2010లో జరిగిన భారీ హిమపాతం ఘటనలో 172 మంది మరణించినట్లు సమాచారం.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..