MEIL: విదేశాల్లో సత్తాచాటుతున్న మెయిల్‌.. మంగోలియాలో ఆయిల్ రిఫైనరీ నిర్మాణానికి ఒప్పందం..

మేఘా ఇంజినీరింగ్‍ అండ్‍ ఇన్‍ఫ్రాస్ట్రక్చర్‍ లిమిటెడ్‍ (మెయిల్) కంపెనీ మరో మైలు రాయిని అధిగమించింది. భారత్‌తోపాటు విదేశాల్లోనూ మెయిల్‌ కంపెనీ సత్తాచాటుతోంది.

MEIL: విదేశాల్లో సత్తాచాటుతున్న మెయిల్‌.. మంగోలియాలో ఆయిల్ రిఫైనరీ నిర్మాణానికి ఒప్పందం..
Mongolia’s first greenfield oil refinery
Follow us

|

Updated on: Nov 03, 2022 | 5:16 PM

మేఘా ఇంజినీరింగ్‍ అండ్‍ ఇన్‍ఫ్రాస్ట్రక్చర్‍ లిమిటెడ్‍ (మెయిల్) కంపెనీ మరో మైలు రాయిని అధిగమించింది. భారత్‌తోపాటు విదేశాల్లోనూ మెయిల్‌ కంపెనీ సత్తాచాటుతోంది. మేఘా ఇంజనీరింగ్ & ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్.. తాజాగా మంగోలియా దేశంలో మొదటి చమురు శుద్ధి కర్మాగారాన్ని నిర్మించేందుకు అధికారిక పత్రాలను అందుకుంది. మంగోల్ రిఫైనరీ ప్రాజెక్ట్ కోసం అధికార ఉత్తర్వులతోపాటు.. ఒప్పందం పత్రాలపై కూడా మెయిల్‌, మంగోలియా దేశ ప్రతినిధులు సంతకాలు చేశారు. హైదరాబాద్‌కు చెందిన దిగ్గజ కంపెనీ మెయిల్‌ మంగోలియాలో నిర్మించనున్న ఈ గ్రీన్‌ఫీల్డ్‌ రిఫైనరీ చారిత్రాత్మక ప్రాజెక్టుల్లో ఒకటిగా నిలవనుంది. ఈ మేరకు పలువురు మెయిల్‌ కంపెనీని అభినందిస్తున్నారు. దేశంతోపాటు విదేశాల్లోనూ మెయిల్‌ నిర్మాణ రంగంలో దూసుకెళ్లడం పట్ల హర్షం వ్యక్తంచేస్తున్నారు.

MEIL మంగోలియాలో అధునాతన సాంకేతికతను ఉపయోగించి USD 790 మిలియన్‌ డాలర్ల వ్యయంతో EPC-2 (ఓపెన్ ఆర్ట్ యూనిట్లు, యుటిలిటీస్ & ఆఫ్‌సైట్‌లు, ప్లాంట్ బిల్డింగ్‌లు), EPC-3 (క్యాప్టివ్ పవర్ ప్లాంట్లు) ని నిర్మించనుంది. ఈ ప్రాజెక్ట్ భారత ప్రభుత్వ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) డెవలప్‌మెంట్ పార్టనర్‌షిప్ అడ్మినిస్ట్రేషన్ చొరవలో భాగమని మెయిల్‌ తెలిపింది. దీనిని భారత ప్రభుత్వ చేయుతతో నిర్మిస్తున్నారు. ఇరు ప్రభుత్వాల (G2G) భాగస్వామ్య ప్రాజెక్ట్ లో ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్ (EIL), ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ కన్సల్టెంట్ (PMC) కూడా సహకారం అందిస్తున్నాయి.

Meil

Meil

రాబోయే సంవత్సరాల్లో ఈ మంగోలియా రిఫైనరీ అనేక ఉపాధి అవకాశాలను, ఉద్యోగాలను పెంచనుంది. సమీపంలోని చిన్న పరిశ్రమల అభివృద్ధికి తోడ్పడుతుంది. తద్వారా మంగోలియా ఆర్థికాభివృద్ధికి దారి తీస్తుందని మెయిల్‌ తెలిపింది. MEIL ప్రకారం.. ఈ ప్రాజెక్ట్ అపారమైన ప్రాముఖ్యతను కలిగి ఉంది. భారతదేశం – మంగోలియా మధ్య ఉన్న సంబంధాలలో, హైడ్రోకార్బన్ రంగంలో MEIL విస్తరణ వ్యూహంలో కీలకమైన దశను సూచిస్తుందని తెలిపింది. అదనంగా ఈ ప్రాజెక్ట్ మంగోలియాకు ఆర్థిక, ఇంధన శక్తికి దోహదపడుతుంది.

ఇవి కూడా చదవండి

మంగోల్ రిఫైనరీ ప్రాజెక్ట్

రష్యా నుంచి చమురు దిగుమతులపై మంగోలియా ఆధారపడటాన్ని తగ్గించడానికి, దేశం తన మొదటి గ్రీన్‌ఫీల్డ్ చమురు శుద్ధి కర్మాగారాన్ని – మంగోల్ రిఫైనరీని నిర్మిస్తోంది. పైప్‌లైన్, పవర్ ప్లాంట్ రిఫైనరీ కార్యకలాపాలలో భాగం. ఇది పూర్తయిన తర్వాత ఈ రిఫైనరీ రోజుకు 30,000 బ్యారెళ్ల ముడి చమురును లేదా ఏటా 1.5 మిలియన్ టన్నులను ప్రాసెస్ చేయగలదు. ఇది రష్యన్ ఇంధనంపై మంగోలియా ఆధారపడటాన్ని తగ్గిస్తుంది. గ్యాసోలిన్, డీజిల్, విమాన ఇంధనం, ద్రవీకృత పెట్రోలియం గ్యాస్ (LPG) వంటి పెట్రోలియం ఉత్పత్తుల కోసం దేశం తన అవసరాలను తీర్చడంలో సహాయపడుతుంది.

MEIL సంస్థ గురించి..

మేఘా ఇంజినీరింగ్ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (MEIL) సంస్థను 1989లో స్థాపించారు. అత్యంత వేగవంతమైన వృద్ధితో భారతదేశపు అగ్రశ్రేణి మౌలిక సదుపాయాల కంపెనీలలో మెయిల్‌ ఒకటి. గత మూడు దశాబ్దాల్లో 20 దేశాల్లో మెయిల్‌ తనదైన ముద్ర వేసింది. కంపెనీ ఆయిల్ అండ్ గ్యాస్, డిఫెన్స్, ట్రాన్స్‌పోర్ట్, ఇరిగేషన్, పవర్, టెలికాం రంగాలలో పనిచేస్తుంది. ఇండియా నేషన్-బిల్డింగ్ ప్రోగ్రామ్‌లో MEIL చురుకుగా పాల్గొంది. నేషన్ ఫస్ట్ అనే నినాదంతో మెఇల్‌ ముందుకు సాగుతోంది. మెయిల్‌ భారతదేశంలోని కొన్ని ఐకానిక్ ప్రాజెక్ట్‌లను సైతం నిర్మించింది. ఈ ప్రాజెక్టులు ప్రజల జీవన నాణ్యతను గణనీయంగా ప్రభావితం చేశాయి. రాబోయే సంవత్సరాల్లో నిర్మాణ రంగంలో తనదైన ముద్రను వెసి.. మరెన్నో జీవితాల్లో కాంతిని నింపేందుకు, అభివృద్ధికి దోహదపడనుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం..