Mumbai: ముంబైలో కనిపించకుండా పోయిన మహిళ.. 20 ఏళ్ల తర్వాత పాక్‌లో ప్రత్యక్షం
తన తల్లి హమీదా బాను 20 ఏళ్ల క్రితం దుబాయ్‌కి వంట మనిషిగా పని చేయడానికి వెళ్ళింది. అప్పటి నుంచి ఆమె తన కుటుంబంతో ఎప్పుడూ సంబంధాలు పెట్టుకోలేదని యాస్మిన్ పేర్కొంది. అప్పటి నుంచి తాను తన తల్లి ఆచూకీ గురించి తెలుసుకోవడానికి ఏజెంట్‌ని కలవడానికి వెళ్తూనే ఉన్నామని..

కన్న తల్లి కనిపించడం లేదని.. ఆ తల్లి ఆచూకీ కోసం ఓ కూతురి ఆరాటం.. గత 20 ఏళ్లుగా పట్టువదలని విక్రమార్కునిగా వెదుకుతూనే ఉంది. ఇప్పుడు సోషల్ మీడియా సాయం తీసుకుని తల్లి ఎక్కడ ఉందో తెలుసుకుంది. ప్రస్తుతం ఈ వార్త వైరల్ అవుతోంది. ముంబైకి చెందిన యాస్మిన్ షేక్ 20 ఏళ్లుగా కనిపించకుండా పోయిన తన తల్లి హమీదా బాను (70) కోసం వెతుకుతోంది. ఇటీవల ఆ యువతి సహాయం కోసం సోషల్ మీడియాను ఆశ్రయించింది. యాస్మిన్ తన తల్లి దుబాయ్‌లో వంట పని కోసం వెళ్లిందని.. అప్పటి నుంచి తిరిగి ఇంటికి రాలేదని తెలిపింది. అయితే తనకు ‘‘పాకిస్థాన్‌కు చెందిన ఓ సోషల్ మీడియా ఖాతా ద్వారా 20 ఏళ్ల తర్వాత మా అమ్మ గురించి తెలుసుకున్నాను’’ అని యాస్మిన్ షేక్ ఏఎన్‌ఐకి వివరించింది.
తన తల్లి తరచుగా 2-4 సంవత్సరాల పాటు ఖతార్‌కు వెళ్లేదని.. అయితే 20 ఏళ్ల క్రితం 2002 లో తన తల్లి ఏజెంట్ సహాయంతో దుబాయ్ కు వెళ్లి తిరిగి రాలేదని పేర్కొంది. మేము అప్పటి నుంచి తన తల్లి కోసం వెతకడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాం.. కాని మేము పోలీసులకు ఫిర్యాదు చేయడానికి ఎటువంటి ఆధారాలు లేవు. దీంతో మేము మా తల్లిని వెదకడం కోసం చేసిన ప్రయత్నాలు ఫలించలేదని యాస్మిన్ పేర్కొంది.
తన తల్లి హమీదా బాను 20 ఏళ్ల క్రితం దుబాయ్‌కి వంట మనిషిగా పని చేయడానికి వెళ్ళింది. అప్పటి నుంచి ఆమె తన కుటుంబంతో ఎప్పుడూ సంబంధాలు పెట్టుకోలేదని యాస్మిన్ పేర్కొంది. అప్పటి నుంచి తాను తన తల్లి ఆచూకీ గురించి తెలుసుకోవడానికి ఏజెంట్‌ని కలవడానికి వెళ్తూనే ఉన్నామని.. వెళ్ళినప్పుడల్లా ఆ ఏజెంట్ మా అమ్మ మమ్మల్ని కలవడానికి లేదా మాట్లాడటానికి ఇష్టపడలేదని చెప్పేదని యాస్మిన్ ఆవేదన వ్యక్తం చేసింది. అయితే తన తల్లి అక్కడ చాలా బాగుందని.. చెప్పేదని.. తన తల్లి కనిపించడం లేదనే విషయం ఎవరికీ చెప్పొద్దని ఆ ఏజెంట్ చెప్పిందని.. యాస్మిన్ చెప్పింది.




“అయితే సోషల్ మీడియాలో తాను తల్లి గురించి పోస్ట్ చేయడంతో.. ఇప్పుడు తన తల్లి హమీదా పాకిస్తాన్‌లో నివసిస్తున్నట్లు మాకు తెలిసిందని చెప్పింది. హమీదా బాను సోదరి షాహిదా తాము సోషల్ మీడియాలో చూసిన వీడియో ద్వారా తన సోదరిని గుర్తించినట్లు పేర్కొంది. హమిదా బానును చాలా సంవత్సరాల తర్వాత కలవడం కోసం కూతురు యాస్మిన్, బాను సోదరి షాహిదా సహా కుటుంబ సభ్యులు ఆతృతగా ఎదురుచూస్తున్నామని చెబుతున్నారు. ఆమెను కలవడం ఒక అద్భుతంగా భావిస్తున్నామని.. వీలైనంత త్వరగా తమ తల్లిని తిరిగి భారత్ కు తీసుకురావడానికి ప్రభుత్వం సహాయం చేయాలని కోరుతున్నారు కుటుంబ సభ్యులు..
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




