Raja Raja Chola: చోళ వంశంలో రాజరాజ చోళుడి పాలన స్వర్ణ యుగమని ఎందుకు అంటారో తెలుసా.. ఇక అధికారికంగా ఆయన జయంతి వేడుకలు..
చోళ సామ్రాజ్యం చరిత్ర 1000 సంవత్సరాల కంటే ఎక్కువ పురాతనమైనదిగా చెబుతారు. దక్షిణ భారతదేశంలోని కావేరీ నది ఒడ్డున ఈ సామ్రాజ్యానికి పునాది వేయబడింది. తిరుచిరాపల్లి చోళ సామ్రాజ్యానికి రాజధాని. చోళ సామ్రాజ్యం చక్రవర్తులు దక్షిణ భారతదేశంలో అనేక అద్భుతమైన దేవాలయాలను నిర్మించారు.

చోళ వంశానికి చెందిన గొప్ప పాలకుడు రాజరాజ చోళుని జయంతిని ప్రతి సంవత్సరం నవంబర్ 3న జరుపనున్నామని తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. ఇటీవల చోళ సామ్రాజ్య చరిత్రని వెండి తెరపై పొన్నియిన్ సెల్వన్ చిత్రం ఆవిష్కరించింది. ఈ సినిమాను ప్రముఖ దర్శకుడు మణిరత్నం తమిళ రచయిత కల్కి ప్రసిద్ధ నవల పొన్నియిన్ సెల్వన్ (ది సన్ ఆఫ్ పొన్ని) ఆధారంగా తెరకెక్కించారు. ఈ సినిమాలో పొన్నియన్ సెల్వన్ పాత్రలో జయం రవి నటించారు. రాజరాజ చోళుడిని పొన్నియిన్ సెల్వన్ అని కూడా పిలుస్తారు. దక్షిణ భారతదేశంలోని చోళ రాజవంశానికి గొప్ప చక్రవర్తి రాజరాజ చోళ I. ఇతను 985 నుంచి 1014 వరకు పరిపాలించారు.
985-1014 నాటికి రాజరాజ చోళ సామ్రాజ్యం బాగా విస్తరించింది. అతని సామ్రాజ్యం ఒడిషా నుండి ఉత్తరాన మాల్దీవులు.. దక్షిణాన ఆధునిక శ్రీలంక వరకు విస్తరించింది. ప్రతిష్టను పెంచారు. ముఖ్యంగా రాజరాజ చోళుడు కాలంలో నౌకాదళ రవాణా ప్రాముఖ్యత పొందింది. మలబార్ తీరం, మాల్దీవులు, శ్రీలంకలను తన అధీనంలోకి తీసుకున్నాడు. రాజరాజ చోళుడు తన కాలంలో అనేక దేవాలయాలను నిర్మించాడు. వీటిలో తంజావూరులోని బృహదీశ్వర దేవాలయం కూడా ఉంది. ప్రస్తుతం యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందింది.
చోళ సామ్రాజ్యం ఎలా మొదలైందంటే: చోళ సామ్రాజ్యం చరిత్ర 1000 సంవత్సరాల కంటే ఎక్కువ పురాతనమైనదిగా చెబుతారు. దక్షిణ భారతదేశంలోని కావేరీ నది ఒడ్డున ఈ సామ్రాజ్యానికి పునాది వేయబడింది. తిరుచిరాపల్లి చోళ సామ్రాజ్యానికి రాజధాని. చోళ సామ్రాజ్యం చక్రవర్తులు దక్షిణ భారతదేశంలో అనేక అద్భుతమైన దేవాలయాలను నిర్మించారు. చరిత్ర పుస్తకాల ప్రకారం.. కావేరీ తీరాన్ని కాంచీపురం పల్లవ రాజుల క్రింద ముత్తియార్ అనే కుటుంబం పాలించింది. క్రీ.శ.849లో, చోళ రాజవంశ అధిపతి విజయాలయ ముత్తియార్లను ఓడించి ఈ డెల్టాను స్వాధీనం చేసుకుని చోళ సామ్రాజ్యాన్ని స్థాపించాడు.




చోళ సామ్రాజ్యం- రాజరాజ చోళ విస్తరణ: చోళ సామ్రాజ్య స్థాపన తర్వాత సర్దార్ విజయాలయ తంజావూరు నగరాన్ని స్థాపించాడు. నిశుంభసుదినీ దేవి ఆలయాన్ని కూడా నిర్మించాడు. అనంతరం విజయాలయ వారసులు తంజావూరు నగర పొరుగు ప్రాంతాలను స్వాధీనం చేసుకున్నారు. తద్వారా తమ సామ్రాజ్యం సరిహద్దులను మరింతగా విస్తరించారు. ఆ సమయంలో పాండ్యన్ , పల్లవులు సర్దార్ విజయాలయ సామ్రాజ్యంలో భాగమయ్యారు. క్రీ.శ.985లో మొదటి రాజరాజ చోళుడు ఈ రాజ్యానికి పాలకుడయ్యాడు. రాజరాజ చోళుడు కూడా చోళ రాజవంశం సామ్రాజ్యాన్ని మరింతగా విస్తరించారు. ప్రజారంజకంగా పాలన చేస్తూ.. చోళ వంశ ప్రతిష్టను మరింత పెంచాడు.
భారీ దేవాలయాలను నిర్మించిన చోళ రాజులు రాజరాజ చోళుడు.. అతని కుమారుడు రాజేంద్ర I తంజాపూర్, గంగైకొండ చోళపురంలో భారీ దేవాలయాలను నిర్మించారు. 985-1014 నాటికి రాజరాజ చోళ సామ్రాజ్యం బాగా విస్తరించింది. చోళ సామ్రాజ్యం ఒడిషా నుండి ఉత్తరాన మాల్దీవులు, దక్షిణాన ఆధునిక శ్రీలంక వరకు విస్తరించింది. చోళ సామ్రాజ్యం ఆధ్వర్యంలో నిర్మించిన దేవాలయాలు , విగ్రహాలు ప్రపంచంలోని అత్యుత్తమ కళాఖండాల్లో ఒకటిగా పరిగణించబడుతున్నాయి. చోళులు నిర్మాణాల్లో ఎక్కువ ఆలయాలు, దేవతల విగ్రహాలే.. తమిళ సంస్కృతిలో రాజరాజ చోళుడును గొప్ప రాజుగా పిలుస్తారు. చోళ రాజులు బృహదీశ్వరాలయం, రాజరాజేశ్వరాలయం కూడా నిర్మించారు. దక్షిణ భారతదేశంలో అనేక ప్రాంతాలను సుమారు 500 సంవత్సరాలు పాలించారు.
చోళ సామ్రాజ్యం ఎలా పతనమైందంటే..? చోళ సామ్రాజ్యం ప్రభావం క్షీణించడం మొదలైన తర్వాత.. పాండ్య రాజవంశం పెరుగుదల మొదలైంది. పాండ్య రాజులు తమ సత్తా చాటుతూ.. క్రమంగా చోళ ప్రాంతాలను ఆక్రమించుకున్నారు. 1150 నుంచి 1279 మధ్య, పాండ్య కుటుంబం .. తమ సైన్యాన్ని పెంపొందించుకుని.. చోళ రాజుల పాలనలో ఉన్న ప్రాంతాలపై నిరంతరం దాడి చేసింది. 1279లో కులశేఖర పాండ్య .. చోళ వంశ చివరి చక్రవర్తి III రాజేంద్ర పై యుద్ధం చేసి.. చోళ వశం పూర్తిగా ఓడిపోయే వరకు పాండ్య రాజులు దాడులు చేస్తూనే ఉన్నారు. చోళ వంశ చివరి చక్రవర్తి III రాజేంద్ర ఓటమితో చోళ సామ్రాజ్యం ఉనికిని కోల్పోయింది. చోళ సామ్రాజ్యం తమిళ ప్రాంతంలో గొప్ప వారసత్వం ఆనవాలు మాత్రమే మిగిలాయి. చోళుల పాలనలో సామ్రాజ్యం విస్తరించడం మాత్రమే కాదు.. ప్రజలు సుఖ శాంతులతో జీవించారు. వారి పాలనకు, కళాతృష్ణకు.. దైవారాధనకు తంజావూరు ఆలయం, కాంస్య శిల్పం వంటి అద్భుతమైన కళాఖండాలు సజీవ సాక్ష్యాలుగా నేటికీ నిలిచాయి. తమిళ సాహిత్యం , కవిత్వం చోళ వంశ రాజుల పాలనలో ముఖ్యంగా రాజరాజ చోళ పాలనను స్వర్ణయుగం గా కీర్తించారు.
మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..