Stress Awareness Day 2022: స్ట్రెస్‌, యాంగ్జైటీలకు సైతం బీమా సౌకర్యం! రక్తంలో ఇది ఎక్కువైతే మానసిక రుగ్మతలు తప్పవట..

నేటి జీవన శైలి కారణంగా మానసిక వ్యాధులతో బాధపడేవారి సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ప్రకారం.. ప్రతి ముగ్గురిలో ఒకరికి డిప్రెషన్‌కు గురౌతున్నారు. ఐతే మానసిక రుగ్మతలతో పోరాడే వ్యక్తులకు  బీమా తోడ్పాటు ఏ విధంగా..

Stress Awareness Day 2022: స్ట్రెస్‌, యాంగ్జైటీలకు సైతం బీమా సౌకర్యం! రక్తంలో ఇది ఎక్కువైతే మానసిక రుగ్మతలు తప్పవట..
mental illnesses under insurance coverage
Follow us

|

Updated on: Nov 03, 2022 | 8:17 PM

నేటి జీవన శైలి కారణంగా మానసిక వ్యాధులతో బాధపడేవారి సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ప్రకారం.. ప్రతి ముగ్గురిలో ఒకరికి డిప్రెషన్‌కు గురౌతున్నారు. లాన్సెట్ నివేదిక ప్రకారం.. మన దేశంలో 2017లో 197.3 మిలియన్ల మంది మానసిక సమస్యలతో బాధపడుతున్నారు. 45.7 మిలియన్లు డిప్రెసివ్ డిజార్డర్స్‌తో, 44.9 మిలియన్ల మంది యాంగ్టైటీ డిజార్టర్స్‌తో బాధపడుతున్నట్లు వెల్లడించాయి. మానసిక రుగ్మతలతో పోరాడే వ్యక్తులకు  బీమా తోడ్పాటు ఏ విధంగా ఉంటుంది. ఆయా మానసిక సమస్యల నుంచి బయటపడిన తర్వాత కూడా ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలపై స్ట్రెస్‌ అవేర్‌నెస్‌ డే 2022 సందర్భంగా నిపుణులు అవగాహన కల్పిస్తున్నారు.

మానసిక సమస్యలకు కూడా ఇన్సురెన్స్‌ సౌకర్యం

ఇప్పటి వరకు శారీరక రుగ్మతలు, ప్రమాదాలకు సంబంధించిన ఇన్సూరెన్స్‌లు మాత్రమే ఉండేవి. అక్టోబర్‌ 31న మానసిక సమస్యలకు కూడా ఐఆర్‌డీఏఐ (ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా) ఇన్సూరెన్స్ (బీమా) సౌకర్యం కల్పిచింది. దీంతో ఎమ్‌హెచ్‌సీ యాక్ట్ 2017 కింద నవంబర్‌ 1 నుంచి ప్రధాన మానసిక సమస్యలన్నింటికీ బీమా అమల్లోకొచ్చింది. బీమాదారులు అక్టోబర్ 31 2022లోపు సమ్మతిని నిర్ధారించవలసిందిగా తెల్పుతూ ఐఆర్‌డీఏఐ సర్క్యులర్ జారీ చేసింది.

శరీరక స్థితిగతుల మూలంగానే మనసుకు ఆందోళన..

ముంబైలోని వోకార్డ్ హాస్పిటల్‌కు చెందిన సైకియాట్రిస్ట్ డాక్టర్ సోనాల్ ఆనంద్ మాట్లాడుతూ.. స్ట్రెస్‌ (ఒత్తిడి), యాంగ్జైటీ (ఆందోళన) సాధారణ జెనెటిక్‌ కెమికల్‌ అసమతుల్యత కాదు. ఆ విధమైన సమస్యలు శరీర భౌతిక స్థితిపై ఎక్కవ ఆధారపడి ఉంటాయి. శరీరం ఒత్తిడికి లోనైనప్పుడు భయాందోళనలకు గురౌతారు.

ఇవి కూడా చదవండి

బ్లడ్‌ షుగర్‌ అసమతుల్యతపై మానసు ప్రభావం..

బ్లడ్‌లో రక్తం స్థాయిలను స్థిరీకరించడం ద్వారా రోజును ప్రారంభించాలి. ఎందుకంటే ఇది రోజు మొత్తంపై ప్రభావం చూపుతుంది. ఇన్సులిన్ ద్వారా రక్తంలో చక్కెర స్థాయిలను పెంచే ఈ రోలర్ కోస్టర్ రైడ్‌ను పరిశీలించాం. బ్లడ్ షుగర్‌లో తలెత్తే వ్యత్యాసాలు భావోధ్వేగాలపై ప్రభావం చూపుతుంది.

ఈ విధమైన ఆహారం తీసుకోవాలి..

బ్లడ్ షుగర్‌ పెరగకుండా ఉండాలంటే తక్కువ శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు అధికంగా ఉండే ఆహారం, ఆరోగ్యకరమైన కొవ్వులతో కూడిన ఆహారం ప్రతి రోజూ తీసుకోవాలి. టెక్నాలజీ, కెఫిన్, ఆల్కహాల్‌ దూరంగా ఉండటం, సరైన పోషకాహారం తీసుకోవడం, సరిపడా నిద్ర పోవడం వల్ల మానసిక సమస్యల నుంచి బయటపడవచ్చు. అలాగే కొన్ని గంటలకొకసారి.. ఒక స్పూన్‌ పొద్దుతిరుగుడు, బాదం లేదా ఇతర గింజల నుంచి తీసిన వెన్న, నెయ్యి లేదా కొబ్బరి నూనె నోట్లో వేసుకుని మింగాలి. ఇది శరీరంలో బ్లడ్ షుగర్ క్రాష్ కాకుండా బలమైన భద్రతా వలయాన్ని సృష్టిస్తుంది. ఈ విధంగా చేయడం వల్ల చాలా మంది పేషెంట్లు తమలో భయాందోళనలకు కలగడం ఆగిపోయినట్లు’ డాక్టర్ ఆనంద్ సూచించారు. సరైన ఆహార అలవాట్లు శరీర ఆరోగ్యానికేకాదు మానసిక ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తాయి.

మరిన్ని లైఫ్‌స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.