Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tattoos: టాటూలకు పెద్ద చరిత్రే ఉందండోయ్.. ఆ కోరికలను పెంచుతుందట.. ఇంకెన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్..

పచ్చబొట్టు వేయించుకోవడం అనేది లేటెస్ట్ ఫ్యాషన్. మారుతున్న ట్రెండింగ్ కు అనుగుణంగా యూత్ టాటూస్ పేరుతో సరికొత్త డిజైన్లను పచ్చబొట్టులా వేయించుకుంటున్నారు. అయితే.. ఇది లేటెస్ట్ ట్రెండ్ మాత్రమే కాదు. ఇది అనేక..

Tattoos: టాటూలకు పెద్ద చరిత్రే ఉందండోయ్.. ఆ కోరికలను పెంచుతుందట.. ఇంకెన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్..
Tattoos Health
Follow us
Ganesh Mudavath

|

Updated on: Nov 03, 2022 | 7:47 PM

పచ్చబొట్టు వేయించుకోవడం అనేది లేటెస్ట్ ఫ్యాషన్. మారుతున్న ట్రెండింగ్ కు అనుగుణంగా యూత్ టాటూస్ పేరుతో సరికొత్త డిజైన్లను పచ్చబొట్టులా వేయించుకుంటున్నారు. అయితే.. ఇది లేటెస్ట్ ట్రెండ్ మాత్రమే కాదు. ఇది అనేక సంస్కృతులలో యుగాలుగా ఒక ఆచార పద్ధతిగా ఉంది. జపాన్ నుంచి మొదలుకుని ఈజిప్ట్ వరకు చాలా కాలం నుంచి పచ్చబొట్టును వేయించుకుంటున్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న టాటూలు సర్వసాధారణ విషయంగా మారిపోయాయి. కార్టూన్లు, దేవతలు చిత్రాలు, ప్రియమైన వారి జ్ఞాపకాలను టాటూల రూపంలో శరీరంపై చెరగని ముద్రగా వేయించుకుంటున్నారు. కొంత మంది మాత్రం మానసిక స్థిరత్వం లేని కారణంగా, ఉద్రేకాలు అదుపు చేసుకోలేక పచ్చబొట్లు వేయించుకుంటారు. రివ్యూ ఆఫ్ జనరల్ సైకాలజీకి సమర్పించిన ఒక అధ్యయనం.. 5,000 సంవత్సరాలకు పైగా మానవ సంస్కృతిలో పచ్చబొట్టు భాగంగా ఉంది. పచ్చబొట్టు అనేది జీవిత అనుభవం, మానవ చరిత్రకు ప్రతీకగా నిలుస్తుంది. అంతే కాకుండా ఆకర్షించేందుకు, లైంగిక దృఢత్వానికి సూచనగా టాటూలు కాలక్రమంలో డెవలప్ అయ్యాయని నిపుణులు చెబుతున్నారు.

పచ్చబొట్టు వేయించుకోవడానికి ప్రధాన కారణం సెల్ఫ్ ఐడెంటిటీ.. ఒకరిని ఆకర్షించాలనే ఉద్దేశ్యంతో చాలా మంది టాటూస్ వేయించుకుంటారు. పచ్చబొట్టు ద్వారా వారు స్వీయ-గుర్తింపును సృష్టించుకోగలుగుతారు. పచ్చబొట్లు ఆత్మగౌరవాన్ని, విశ్వాసాన్ని కూడా పెంచుతాయి. పచ్చబొట్లు అంతర్గత భావాలను ప్రతిబింబిస్తాయి. ఇది గుర్తింపులో కీలకమైన అంశం. పచ్చబొట్లు తమ మనసులోని భావాలను ఇతరులకు సులభంగా అర్థమయ్యేలా చేస్తాయని చాలా మంది నమ్ముతారు. టాటూలు శరీరాన్ని ఫ్యాషన్ అనుబంధంగా శరీరంపై వేసుకునే అందమైన ఆర్ట్ గా భావించవచ్చని అధ్యయనం సూచించింది.

సాధారణంగా పచ్చబొట్టు వేయించుకునేటప్పుడు నొప్పి ఉంటుంది. అయితే నొప్పిని తట్టుకోవడం అనేది శారీరక దృఢత్వం, వారి లైంగికతపై దృష్టి పెట్టడం, వారి మనసులోని భావాలపై ప్రభావం చూపిస్తుంది. కొందరు వ్యక్తులు తమ జీవితంలో పెళ్లి చేసుకోవడం లేదా పిల్లవాడిని కలిగి ఉండటం వంటి అత్యంత ముఖ్యమైన సంఘటనలను గుర్తుచేసుకోవడానికి పచ్చబొట్లు వేసుకుంటారు. మరికొందరు తమ ప్రియమైన వారి మరణాన్ని గౌరవించటానికి లేదా విచారం వ్యక్తం చేయడానికి వేసుకుంటారు. ఏది ఏమైనా మరిచిపోలేని పదిలమైన జ్ఞాపకాలను అంతే మధురంగా గుర్తుంచుకునేందుకు ఈ టాటూలు ఎంతగానో ఉపయోగపడతాయి.

ఇవి కూడా చదవండి

నోట్.. ఇందులో పేర్కొన్న విషయాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటిని టీవీ9 తెలుగు ధ్రువీకరించడం లేదు.