లైంగిక సామర్థ్యం తగ్గిందని చింతిస్తున్నారా? దీనిని ఇలా తీసుకుంటే జీవితంలో వెలుగులు జిలుగులే..

Shaik Madarsaheb

Shaik Madarsaheb |

Updated on: Nov 02, 2022 | 6:31 PM

మునగకాయలు, మునగ ఆకుల్లో ఎన్నో పోషకాలు దాగున్నాయి. అందుకే.. మునగ కూరను ఎక్కువగా తింటూ ఉంటారు. మునగాకు, మునక్కాయలు రెండూ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

లైంగిక సామర్థ్యం తగ్గిందని చింతిస్తున్నారా? దీనిని ఇలా తీసుకుంటే జీవితంలో వెలుగులు జిలుగులే..
Drumstick Health Benefits

మునగకాయలు, మునగ ఆకుల్లో ఎన్నో పోషకాలు దాగున్నాయి. అందుకే.. మునగ కూరను ఎక్కువగా తింటూ ఉంటారు. మునగాకు, మునక్కాయలు రెండూ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. మునగ మొక్కలో ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. మునగను.. డ్రమ్ స్టిక్ అని కూడా అంటారు. మునగాకుల నుంచి కాయలు, పువ్వులు అన్నీ మేలు చేసేవే. ఇవి మధుమేహం, కొలెస్ట్రాల్ వంటి సమస్యలను తొలగించడంలో ప్రభావవంతమైన పోషకాలను కలిగి ఉన్నాయి. ఇది మాత్రమే కాదు ఈ మునగ మొక్క అనేక ఇతర వ్యాధులను తొలగించడంలో కూడా సహాయపడుతుంది. దీని వినియోగం ఆరోగ్యానికి అద్భుతమైన ప్రయోజనాలను కలిగిస్తుంది..

మునగలో బోలెడన్ని పోషకాలు..

మునగలో క్యాన్సర్ నిరోధక యాంటీ డయాబెటిక్ లక్షణాలు ఉన్నాయి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీబయాటిక్ గుణాలు ఎన్నో వ్యాధులను నయం చేస్తాయి. మునగలో విటమిన్ ఎ, విటమిన్ బి1, విటమిన్ బి2, విటమిన్ బి3, విటమిన్ బి6, విటమిన్ సి ఉన్నాయి. ఇంకా పొటాషియం, ఐరన్, మెగ్నీషియం, ఫాస్పరస్, జింక్, కాల్షియం వంటి ఖనిజాలు సైతం మునగలో లభిస్తాయి. ఇవి అనేక వ్యాధులను దూరం చేస్తాయి.

మునగకాయ, ఆకు, పువ్వులను ఎలా తీసుకోవాలి..

మునగ, ఆకులు, గింజలను కూరగా తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. అయితే కొలెస్ట్రాల్, మధుమేహం సమస్య దూరం కావాలంటే మునగ ఆకులను పొడి చేసి తింటే మేలు జరుగుతుందని ఆయుర్వేద నిపుణులు పేర్కొంటున్నారు. మునగకాయను రోటీ, పరాటా, దోశ, పులుసు, పప్పులో చేర్చి కూడా మనం తినవచ్చు. ఇంకా డ్రమ్ స్టిక్ డ్రింక్ (మునగ రసం) కూడా తయారు చేసి తాగవచ్చు.

ఇవి కూడా చదవండి

మునగతో ఈ వ్యాధులు దూరం..

  • డయాబెటిక్ రోగులకు మునగ చాలా మేలు చేస్తుంది. ఇది చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది.
  • మునగలో ఉండే పోషకాలు కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తాయి. రక్తపోటును కూడా అదుపులో ఉంచుతాయి.
  • బరువు తగ్గడంలో మునగ ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఇది జీవక్రియను మెరుగుపరుస్తుంది. కొవ్వును తగ్గించడానికి పనిచేస్తుంది. బరువు తగ్గడానికి మీరు దాని పొడిని నీటిలో కలుపుకుని తాగవచ్చు. ఇంకా ఉడకబెట్టుకుని తాగవచ్చు.
  • ఇది కాలేయం, మూత్రపిండాలను నిర్విషీకరణ (డిటాక్స్) చేయడానికి పనిచేస్తుంది. మునగకాయను తీసుకోవడం వల్ల కాలేయం శుభ్రపడుతుంది. ఇది జీర్ణవ్యవస్థకు కూడా ప్రయోజనం చేకూర్చుతుంది.
  • మునగలో ఉండే గుణాలు ఒత్తిడిని తగ్గిస్తాయి. ఒత్తిడి, ఆందోళన నుంచి ఉపశమనం పొందడంలో ఇది ప్రభావవంతంగా ఉంటుంది.
  • మునగ లైంగిక, సంతాన సమస్యలను కూడా దూరం చేస్తుంది. దీనిని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల వంధత్వ సమస్య నుంచి బయటపడొచ్చు. స్పెర్మ్ కౌంట్ కూడా పెరుగుతుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu