Urination At Night: రాత్రిపూట తరచూ బాత్రూమ్‌కు వెళ్తున్నారా..? ఆ ప్రమాదకర జబ్బులకు సంకేతం కావొచ్చు.. జాగ్రత్త..

రాత్రిపూట తరచుగా మూత్రవిసర్జన సమస్య కొంతమంది ప్రజలను ఇబ్బంది పెడుతుంది. అయితే.. తరచూ యూరినేషన్ సమస్యను చాలామంది విస్మరిస్తూ వస్తుంటారు.

Urination At Night: రాత్రిపూట తరచూ బాత్రూమ్‌కు వెళ్తున్నారా..? ఆ ప్రమాదకర జబ్బులకు సంకేతం కావొచ్చు.. జాగ్రత్త..
Urination At Night
Follow us

|

Updated on: Nov 01, 2022 | 7:49 PM

రాత్రిపూట తరచుగా మూత్రవిసర్జన సమస్య కొంతమంది ప్రజలను ఇబ్బంది పెడుతుంది. అయితే.. తరచూ యూరినేషన్ సమస్యను చాలామంది విస్మరిస్తూ వస్తుంటారు. అయితే, అలా చేయడం అస్సలు మంచిది కాదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే ఎక్కువ సార్లు మూత్రవిసర్జన అనేది.. మూత్రాశయం, మూత్రపిండాలు లేదా శరీరంలోని పలు అవయవాల పని తీరులో ఏదో ఒక సమస్య ఉందని అర్థం అని పేర్కొంటున్నారు. శరీరంలో తలెత్తే ఏ సమస్య, వ్యాధి తరచుగా మూత్రవిసర్జనకు కారణమవుతుందో అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..

మూత్రాశయంలో రాళ్లు..

రాత్రిపూట తరచుగా మూత్రవిసర్జన చేస్తుంటే ముందుగా మూత్రాశయాన్ని పరీక్షించుకోవాలి. మూత్రాశయం లోపల రాళ్లు ఉండటం వల్ల తరచుగా మూత్రవిసర్జన అవుతుంది. వాస్తవానికి ఇది మూత్ర విసర్జనలో అడ్డంకి మారుతుంది. దీనివల్ల కూడా తరచుగా మూత్రం వస్తుంది.

ప్రోస్టేట్ గ్రంధి విస్తరణ

ప్రోస్టేట్ గ్రంధి విస్తరణ అనేది పురుషులలో సాధారణ సమస్య. ప్రోస్టేట్ గ్రంధి విస్తరణ మూత్ర ప్రవాహాన్ని అడ్డుకుంటుంది. ఇది ఒక్కోసారి అధిక మూత్రవిసర్జనకు కారణమవుతుంది.

ఇవి కూడా చదవండి

మధుమేహం..

అధిక మూత్ర విసర్జనకు మధుమేహం కూడా కారణం కావచ్చు. మధుమేహం ఎక్కువగా ఉన్నప్పుడు రక్తంలో అదనపు గ్లూకోజ్ పేరుకుపోతుంది. దీని కారణంగా మూత్రపిండాలు అదనపు గ్లూకోజ్‌ను ఫిల్టర్ చేయడానికి, గ్రహించడానికి ఓవర్‌టైమ్ పని చేస్తాయి.

కిడ్నీ వ్యాధులు

మూత్రపిండ వ్యాధులు తరచుగా మూత్ర వ్యవస్థను ప్రభావితం చేస్తాయి. కిడ్నీ స్టోన్స్, క్రానిక్ కిడ్నీ డిసీజ్, కిడ్నీ డ్యామేజ్ వంటి అనేక సమస్యలు తరచుగా మూత్రవిసర్జనకు కారణమవుతాయి.

UTI ఇన్ఫెక్షన్ (యూరిన్ ఇన్పెక్షన్)..

UTI సంక్రమణ కూడా తరచుగా మూత్రవిసర్జనకు కారణమవుతుంది. ఇది మూత్ర వ్యవస్థలోని ఏదైనా భాగంలో (మూత్రనాళం, మూత్రాశయం, మూత్రపిండాలు) సంభవించవచ్చు. ఈ సమస్య కారణంగా మీరు మూత్ర విసర్జన చేసేటప్పుడు నొప్పి కూడా అనిపిస్తుంది.

మీరు కూడా తరచూ మూత్ర విసర్జనకు వెళ్తుంటే.. జాగ్రత్తగా ఉండాలని.. ముందుగా వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవాలని నిపుణులు పేర్కొంటున్నారు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం..

మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!