Uric Acid: యూరిక్ యాసిడ్ సమస్యతో బాధపడుతున్నారా..? ఆహారంలో వీటిని చేర్చుకుంటే సింపుల్‌గా చెక్ పెట్టొచ్చు..
ప్రస్తుత కాలంలో చాలామంది యూరిక్ యాసిడ్ సమస్యతో బాధపడుతున్నారు. చాలాసార్లు ఆహారం తీసుకున్న తర్వాత శరీరంలో యూరిక్ యాసిడ్ పేరుకుపోతుంది.
ప్రస్తుత కాలంలో చాలామంది యూరిక్ యాసిడ్ సమస్యతో బాధపడుతున్నారు. చాలాసార్లు ఆహారం తీసుకున్న తర్వాత శరీరంలో యూరిక్ యాసిడ్ పేరుకుపోతుంది. వాస్తవానికి, ఆమ్లం పేరుకుపోవడానికి కారణం ప్యూరిన్లు కలిగిన ఆహారాన్ని తీసుకోవడం. యూరిక్ యాసిడ్ శరీరంలో పేరుకుపోయినప్పుడు, అది గౌట్ అటాక్ ప్రమాదాన్ని పెంచుతుంది. కీళ్లలో యూరేట్ స్ఫటికాలు పేరుకుపోయినప్పుడు గౌట్ ఏర్పడుతుంది. దీనివల్ల వల్ల మంట, తీవ్రమైన నొప్పి వస్తుంది. ఇంకా శరీరంలోని పలు భాగాల్లో వాపు కూడా కనిపిస్తుంది. ఇది అకస్మాత్తుగా తీవ్రమైన ఇబ్బందిని కలిగిస్తుంది. అందువలన ప్యూరిన్లను కలిగి ఉన్న ఆహారం తీసుకోవడం మానుకోవాలి. అయితే , కొన్ని కూరగాయలు తీసుకోవడం ద్వారా మీరు యూరిక్ యాసిడ్ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. ఎలాంటి కూరగాయలు తీసుకుంటే.. యూరిక్ యాసిడ్ సమస్య నుంచి బయటపడవచ్చు. ఎలా ఉపశమనం పొందవచ్చు అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..
బంగాళదుంపలు తినండి..
యూరిక్ యాసిడ్ నుంచి ఉపశమనం పొందడానికి మీరు బంగాళదుంపలను కూడా తినవచ్చు. వాస్తవానికి బంగాళాదుంప అనేది కొవ్వు పదార్ధం. దీనిలో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. అందుకే దీనిని ప్రజలు తరచుగా దూరంగా ఉంచుతారు. కానీ బంగాళాదుంప రసం యూరిక్ యాసిడ్ నుంచి రక్షించడానికి పనిచేస్తుంది.
పచ్చి కూరగాయలు తినండి..
యూరిక్ యాసిడ్‌ను నియంత్రించడానికి ఆకు కూరలు, తాజా కూరగాయలను కూడా తీసుకోవచ్చు. విటమిన్లు , మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు సమృద్ధిగా ఉన్న ఈ కూరగాయలను తీసుకోవడం వల్ల యూరిక్ యాసిడ్ తగ్గుతుంది. ఎముకలలో మంట, నొప్పి నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. దీని కోసం మీరు క్యారెట్, బీట్‌రూట్, పుదీనా, టొమాటో, దోసకాయ, ఉల్లిపాయ వంటివి తీసుకోవచ్చు.
నిమ్మ – టమోటా తీసుకోండి..
యూరిక్ యాసిడ్ విచ్ఛిన్నం చేయడానికి మీరు నిమ్మకాయ, టమోటాలను కూరగాయలలో తీసుకోవచ్చు. ఆమ్ల స్వభావం కారణంగా యూరిక్ యాసిడ్ నియంత్రణలో ఉంటుంది. ఈ ఆహారాలు యూరిక్ యాసిడ్‌ను విచ్ఛిన్నం చేస్తాయి. ఇంకా దానిని శరీరం నుంచి తొలగిస్తాయి. తరచుగా నిమ్మకాయలు, టమోటాలు తీసుకోవడం యూరిక్ యాసిడ్ రోగులకు ఉపయోగకరంగా ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు.
ఈ కూరగాయలు తినవద్దు..
యూరిక్ యాసిడ్ సమస్యతో బాధపడుతున్న వారు ప్యూరిన్ అధికంగా ఉండే కూరగాయలు, ఆహారాన్ని తినడం మానుకోవాలి. ఎందుకంటే అలాంటి ఆహారం ఇబ్బందిని మరింత పెంచుతుంది. అటువంటి పరిస్థితిలో యూరిక్ యాసిడ్ ఉన్న రోగులు కాలీఫ్లవర్, క్యాబేజీ, పచ్చి బఠానీలు, బీన్స్, పుట్టగొడుగులను లాంటి వాటిని నివారించాలి. వాటిలో ప్యూరిన్ పరిమాణం ఎక్కువగా ఉన్నందున వాటిని నివారించాలని నిపుణులు పేర్కొంటున్నారు.
మరిన్ని హెల్త్ వార్తల కోసం..