Blood Pressure: అసలు మనిషికి బీపీ ఎంత ఉండాలి..? తగ్గితే ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి.. నిర్లక్ష్యం చేస్తే మాత్రం..

Shaik Madarsaheb

Shaik Madarsaheb |

Updated on: Oct 31, 2022 | 9:54 PM

ఈ రోజుల్లో తక్కువ లేదా అధిక రక్తపోటు సమస్య తరచూ వింటున్నాం.. రక్తపోటు తక్కువగా ఉండటం.. బ్లడ్ ప్రజెర్ ఎక్కువగా ఉండటం రెండూ ప్రమాదకరమైనవే.. వీటిని విస్మరించడం ప్రాణానికే ప్రమాదం అని నిపుణులు పేర్కొంటున్నారు.

Blood Pressure: అసలు మనిషికి బీపీ ఎంత ఉండాలి..? తగ్గితే ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి.. నిర్లక్ష్యం చేస్తే మాత్రం..
Blood Pressure

ఈ రోజుల్లో తక్కువ లేదా అధిక రక్తపోటు సమస్య తరచూ వింటున్నాం.. రక్తపోటు తక్కువగా ఉండటం.. బ్లడ్ ప్రజెర్ ఎక్కువగా ఉండటం రెండూ ప్రమాదకరమైనవే.. వీటిని విస్మరించడం ప్రాణానికే ప్రమాదం అని నిపుణులు పేర్కొంటున్నారు. తక్కువ రక్తపోటును వైద్య భాషలో హైపోటెన్షన్ అంటారు. రక్తపోటు సాధారణ స్థాయి కంటే పడిపోయినప్పుడు దానిని లోబీపీ (లో బ్లడ్ ప్రెజర్) లేదా రక్తపోటు తక్కువగా ఉండటం అంటారు. రక్తపోటు తక్కువగా ఉన్న వ్యక్తుల్లో చాలా సార్లు తమకు తక్కువ రక్తపోటు సమస్య ఉందని కూడా గ్రహించలేరు. శరీరంలో కొన్ని లక్షణాలు కనిపించడం ప్రారంభించినా.. దానిపై శ్రద్ధ చూపరు. రక్తపోటు తక్కువగా ఉన్నప్పుడు చాలా అలసట, వికారంగా అనిపిస్తుంది. మీరు కూడా అలాంటి సమస్యను ఎదుర్కొంటే వెంటనే మీ వైద్యుడిని సంప్రదించడం మంచిది. తక్కువ రక్తపోటు కొన్నిసార్లు అత్యవసర పరిస్థితులకు దారితీస్తుందని.. అలాంటి కారణాల్లో ఇది కూడా ఒకటని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

లోబీపీ ఎప్పుడు ప్రమాదకరం?

రక్తపోటు తక్కువగా ఉన్న వ్యక్తుల్లో చాలా సార్లు వారి బీపీ తగ్గినట్లు తెలియదు. బీపీ కొద్దిగా తగ్గినప్పుడు ఎలాంటి లక్షణాలు కనిపించవు. అందుకే ప్రజల దృష్టి ఇలాంటి విషయం వైపు చాలా తక్కువగా ఉంటుంది. అయితే, చాలాసార్లు లక్షణాలు కనిపించిన తర్వాత కూడా, లోబీపీ సమస్యను నిర్లక్ష్యం చేస్తే అది ప్రమాదకరం అవుతుంది.

తక్కువ రక్తపోటు లక్షణాలు

  • మైకము – తల తిరగడం
  • ఏకాగ్రత లోపించడం
  • మూర్ఛ – అలసట
  • వాంతులు – వికారం
  • డీహైడ్రేషన్
  • దృష్టి కోల్పోవడం – అకస్మాత్తుగా కంటి చూపు తగ్గిపోవడం
  • చర్మం లేత లేదా నీలం రంగులోకి మారడం
  • త్వరగా శ్వాస తీసుకోవడం
  • డిప్రెషన్ ఫీలింగ్
  • స్పృహ కోల్పోవడం

ఈ లక్షణాలలో ఏవైనా మీకు అనిపిస్తే, మీరు వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. ఈ లక్షణాలు కనిపించిన తర్వాత పరిస్థితి ప్రమాదకరంగా మారే అవకాశం ఉంటుంది. ఒక్కోసారి అకస్మాత్తుగా స్పృహ కూడా కోల్పోతారు.

ఇవి కూడా చదవండి

ఎందుకు తక్కువ రక్తపోటు వస్తుంది..

  • శరీరంలో రక్తం లేకపోవడం
  • గర్భధారణ సమయంలో శరీరంలో మార్పులు
  • శరీరంలో డీహైడ్రేషన్ సమస్య ఉన్నప్పుడు
  • విటమిన్లు – పోషకాలు లేకపోవడం
  • భారీగా రక్తస్రావం
  • కొన్ని మందుల దుష్ప్రభావాల కారణంగా
  • గుండె సమస్యలు
  • మధుమేహం సమయంలో
  • ఏదైనా తీవ్రమైన వ్యాధి లేదా వైరస్ సంక్రమణ

రక్తపోటు పరిధి

ఆరోగ్యకరమైన రక్తపోటు పరిధి 120/80 (mm Hg) ఉండాలి. దీన్ని సాధారణ రక్తపోటుగా పేర్కొంటారు. తక్కువ రక్తపోటుకు స్థిరమైన కటాఫ్ పాయింట్ లేదని వైద్యులు చెబుతున్నారు. ఇది అందరిలో భిన్నంగా ఉంటుంది. రక్తపోటు 90/60 mm Hg కంటే తక్కువగా ఉంటే ప్రమాదకరమైనదిగా పరిగణిస్తారు. 130/90 అంతకంటే ఎక్కువగా ఉంటే.. హైబీపీగా పేర్కొంటారు.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu