Winter Foot Care Tips: చలి కాలంలో మీ పాదాలను ఇలా మృదువుగా ఉంచుకోండి..
చలి కాలంలో దాదాపు వచ్చేసినట్టే. ఈ కాలంలో చర్మం త్వరగా పొడిబారిపోతుంది. ముఖ్యంగా పాదాలలో పగుళ్లు ఏర్పడి అసౌకర్యంగా అనిపిస్తుంది. అందుకే ఈ సీజన్‌లో పాదాల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. శీతాకాలంలో మీ పాదాలు..

చలి కాలంలో దాదాపు వచ్చేసినట్టే. ఈ కాలంలో చర్మం త్వరగా పొడిబారిపోతుంది. ముఖ్యంగా పాదాలలో పగుళ్లు ఏర్పడి అసౌకర్యంగా అనిపిస్తుంది. అందుకే ఈ సీజన్‌లో పాదాల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. శీతాకాలంలో మీ పాదాలు మృదువుగా, అందంగా ఉంచుకోవాలంటే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి..
స్నానం చేశాక మాయిశ్చరైజర్ వినియోగించాలి..
శీతాకాలంలో స్నానం చేసిన తర్వాత వెంటనే మాయిశ్చరైజర్ రాసుకోవాలి. ఇలా చేయడం వల్ల పాదాలు ఎల్లప్పుడూ తేమగా ఉంటాయి. ఎందుకంటే పాదాలను కడిగిన ప్రతిసారీ చర్మం దాని సహజ నూనెలను కోల్పోతుంది. అందువల్ల పాదాలను తేమగా ఉంచడానికి తప్పనిసరిగా మాయిశ్చరైజర్‌ని ఉపయోగించాలి. ఇది మీ పాదాలను పొడిబారకుండా కాపాడుతుంది.
ఎక్కువసేపు స్నానం చేయకూడదు..
చర్మం తేమగా ఉండాలంటే ఎక్కువసేపు స్నానం చేయకూడదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఎక్కువ సేపు స్నానం చేయడం వల్ల చర్మం సహజసిద్ధమైన నూనెలను కోల్పోతుంది. ఫలితంగా చర్మం పొడిబారుతుంది. కాబట్టి ఎక్కువ సేపు స్నానం చేసే అలవాటున్నవారు వెంటనే మానుకోవడం మంచిది.




అధిక వేడి కలిగిన నీటిని ఉపయోగించకూడదు..
చాలా వేడిగా ఉండే నీళ్లతో స్నానం చేయకూడదు. ఇలా చేయడం మూలంగా చర్మం సహజ నూనెలను కోల్పోతుంది. కాబట్టి వేడినీళ్లకు బదులు గోరువెచ్చని నీళ్లతో స్నానం చేయడం అలవాటు చేసుకోవాలి.
చలికాలంలోనూ సన్‌స్క్రీన్..
వేసవిలో మాత్రమే కాకుండా, శీతాకాలంలో కూడా సన్‌స్క్రీన్ లోషన్ వాడాలి. సన్‌స్క్రీన్‌ని ఉపయోగించడం వేసవిలో ఎంత ముఖ్యమో శీతాకాలంలో చర్మ సంరక్షణకు అంతే ముఖ్యం. ఇది యూవీ కిరణాల నుంచి చర్మాన్ని రక్షించడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా చర్మాన్ని ఆరోగ్యంగా, హైడ్రేట్‌గా ఉంచడంలో సహాయపడుతుంది.
నీళ్లు తగినంత తాగాలి..
చర్మాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడానికి పుష్కలంగా నీళ్లు తాగాలి. అధికంగా నీళ్లు తాగడం మూలంగా చర్మాన్ని పొడిబారకుండా నివారించవచ్చు. చర్మం హైడ్రేటెడ్‌గా ఉంటే కాంతివంతంగా కనిపిస్తుంది.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి.




