Cinnamon: రుచికి వాసనకే కాదండోయ్.. దాల్చిన చెక్కతో ఈ ప్రయోజనాలు తెలిస్తే వావ్ అనాల్సిందే..

భారతీయ వంటకాలు అనేక సుగంధ ద్రవ్యాలు, మసాలా దినుసులతో తయారవుతాయి. సంప్రదాయంగా వస్తున్న వంటకాల్లో రుచి, వాసన, ఆరోగ్య ప్రయోజనాల కోసం వీటిని ఉపయోగిస్తుంటారు. అయితే వంటింటి మసాలా...

Cinnamon: రుచికి వాసనకే కాదండోయ్.. దాల్చిన చెక్కతో ఈ ప్రయోజనాలు తెలిస్తే వావ్ అనాల్సిందే..
Cinnamon Health Benefits
Follow us

|

Updated on: Oct 31, 2022 | 9:55 PM

భారతీయ వంటకాలు అనేక సుగంధ ద్రవ్యాలు, మసాలా దినుసులతో తయారవుతాయి. సంప్రదాయంగా వస్తున్న వంటకాల్లో రుచి, వాసన, ఆరోగ్య ప్రయోజనాల కోసం వీటిని ఉపయోగిస్తుంటారు. అయితే వంటింటి మసాలా దినుసుల్లో ఉండే ముఖ్యమైన పదార్థాల్లో దాల్చిన చెక్క ఒకటి. ఇది సువాసన, రుచే కాకుండా శరీరానికి మంచి లాభాలను కూడా అందిస్తుంది. దాల్చినచెక్కను సిన్నమోమమ్ చెట్ల బెరడు నుంచి సేకరిస్తారు. ఇది రుచిని పెంచే సహజ యాంటీఆక్సిడెంట్‌గా ప్రపంచ వ్యాప్తంగా వంటల్లో ఉపయోగిస్తున్నారు. వీటి నుంచి తీసిన నూనెతో పెర్ఫ్యూమ్‌లు, క్రీమ్‌లు, లిప్ బామ్‌లు, స్క్రబ్‌లు వంటివి తయారు చేస్తున్నారు. చర్మాన్ని కాంతివంతం చేయడానికి, మొటిమలను తగ్గించడానికి, వృద్ధాప్య ఛాయలను నివారించడానికి దాల్చినచెక్క చక్కగా ఉపయోగపడుతుంది. మొటిమలను తగ్గిస్తుంది.. యాంటీమైక్రోబయల్ గుణాల వల్ల ఇది మొటిమలను తొలగించడంలో అద్భుతంగా పని చేస్తుంది. ఒక టీస్పూన్ తేనెలో అర టీ స్పూన్ దాల్చిన చెక్క పొడి, కొన్ని చుక్కల దాల్చిన చెక్క నూనె కలపాలి. ఈ మిశ్రమాన్ని చర్మంపై 15 నుంచి 20 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. తర్వాత గోరు వెచ్చని నీటితో ముఖాన్ని కడుక్కోవాలి.

చర్మంపై వచ్చే ముడతలను నివారిస్తుంది.. కొన్ని సార్లు మన వయసు కంటే ఎక్కువ వయసు ఉన్నట్లు కనిపిస్తుంటాం. మధ్యవయస్సు రాకముందే మన ముఖాల్లో ముడతలు పడుతుంటాయి. ఈ ముడతలను నివారించడంలో దాల్చిన చెక్క చక్కగా ఉపయోగపడుతుంది. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ముడతలను తగ్గిస్తాయి. రెండు చెంచాల ఆలివ్ నూనెలో ఒక చెంచా దాల్చిన చెక్క పొడిని కలిపాలి. ఆ మిశ్రమాన్ని ముఖంపై అప్లై చేసుకుని పది నుంచి పదిహేను నిమిషాలు మసాజ్ చేయాలి. ఆ తర్వాత గోరు వెచ్చని నీటితో ముఖాన్ని కడుక్కోవాలి.

చర్మశుద్ధికి.. ఒక టీస్పూన్ పెరుగు, ఒక టీ స్పూన్ తేనెకు ఒక టీస్పూన్ దాల్చిన చెక్క పొడిని కలపాలి. ఈ ఫేస్ ప్యాక్ ఆరిపోయే వరకు ముఖంపై ఉంచుకోవాలి. అప్పుడు మీ ముఖం కడగడానికి గోరువెచ్చని నీటిని ఉపయోగించండి. ఇది చర్మంపై పేరుకున్న మృతకణాలను తొలగిస్తుంది.

ఇవి కూడా చదవండి

మచ్చలను పోగొడుతుంది.. మొటిమలకు సంబంధించిన మచ్చలు చర్మంపై అప్పుడప్పుడు ఏర్పడుతుంటాయి. ఇవి కాస్త ఇబ్బందిగా కనిపిస్తాయి. వీటిని పోగొట్టు్కునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. రెండు చెంచాల కొబ్బరి నూనె, ఒక చెంచా దాల్చిన చెక్క నూనెను కలిపి ముఖంపై రాసుకోవాలి. 15-20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని కడుక్కోవాలి. ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల మచ్చలను తగ్గించుకోవచ్చు.

చర్మాన్ని మృదువుగా చేస్తుంది.. చర్మం మృదువుగా మారేందుకు దాల్చిన చెక్క ఉపయోగపడుతుంది. ఒక టీస్పూన్ తేనె, ఒక టీస్పూన్ సీ సాల్ట్, ఒక టీస్పూన్ దాల్చిన చెక్క పొడిని కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖంపై మసాజ్ చేయాలి. కాసేపటి తర్వాత నీళ్లతో ముఖం కడుక్కోవాలి.

నోట్.. ఈ కథనంలో పేర్కొన్న విషయాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటిని పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోవడం ఉత్తమం.

మరిన్ని లైఫ్‌స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.