ఫస్ట్ నైట్ కోసం ఆత్రుతగా ఎదురుచూసిన భర్త.. భార్య ఎంట్రీతో లైట్ ఆఫ్.. కట్ చేస్తే, వామ్మో అంటూ..

సోషల్‌ మీడియాలో ఓ యువతి ఫొటోతో ఫ్రెండ్‌ రెక్వెస్ట్‌ వచ్చింది.. ఆహా అనుకుంటూ.. యాక్సెప్ట్ చేశాడు.. ఇంకేముంది.. ఇద్దరూ మెస్సెజ్‌లు చేసుకుంటూ ఇద్దరూ ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత పెద్దలకు చెప్పకుండానే ఓ గుడిలో పెళ్లి కూడా చేసుకున్నారు.. ఆ తర్వాతే అసలు విషయం వెలుగులోకి వచ్చింది..

ఫస్ట్ నైట్ కోసం ఆత్రుతగా ఎదురుచూసిన భర్త.. భార్య ఎంట్రీతో లైట్ ఆఫ్.. కట్ చేస్తే, వామ్మో అంటూ..
Wedding
Follow us

|

Updated on: Nov 01, 2022 | 5:28 PM

సోషల్‌ మీడియాలో ఓ యువతి ఫొటోతో ఫ్రెండ్‌ రెక్వెస్ట్‌ వచ్చింది.. ఆహా అనుకుంటూ.. యాక్సెప్ట్ చేశాడు.. ఇంకేముంది.. ఇద్దరూ మెస్సెజ్‌లు చేసుకుంటూ ఇద్దరూ ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత పెద్దలకు చెప్పకుండానే ఓ గుడిలో పెళ్లి కూడా చేసుకున్నారు.. ఆ తర్వాతే అసలు విషయం వెలుగులోకి వచ్చింది.. ఫస్ట్‌ నైట్‌ రోజు.. పెళ్లి కొడుక్కి ఊహించని షాక్‌ తగిలింది. తాను పెళ్లి చేసుకుంది.. యువతిని కాదని.. యువకుడి (నపుంసకుడు) ని అని తెలిసింది. ఆ తర్వాత ట్విస్టుల మీద ట్విస్టులతో ఈ వ్యవహారం.. పోలీస్‌ స్టేషన్‌కు చేరింది. ఈ షాకింగ్‌ ఘటన ఉత్తరాఖండ్‌ లోని హరిద్వార్‌లో చోటుచేసుకుంది. సోషల్ మీడియాలో ఎలా కనిపిస్తుందో నిజ జీవితంలో.. కూడా అలా అస్సలు ఊహించుకోకూడదు. చాలామంది సోషల్ మీడియాలో తమ గుర్తింపు దాచిపెట్టి.. వేరే వారితో చెలగాటమాడుతారు. ఇలా తప్పుల మీద తప్పులు చేస్తుంటారు. అచ్చం ఇలాంటి ఘటనే ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో నివసిస్తున్న ఓ యువకుడు చేశాడు. సోషల్ మీడియాలో స్నేహం తర్వాత యువకుడు.. యువతిని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లయ్యాక హనీమూన్ రోజు.. వరుడికి దిమ్మతిరిగే విషయం తెలిసింది. తాను పెళ్లి చేసుకుంది అమ్మాయిని కాదని.. అతను నపుంసకుడు అని తెలిసిపోయింది.

హరిద్వార్‌లోని లక్సర్‌లోని రైసీ చౌకీ గ్రామంలో నివసిస్తున్న యువకుడికి సోషల్ మీడియాలో ఒక అమ్మాయితో పరిచయం అయిందని పోలీసులు తెలిపారు. వాస్తవానికి యువతి పేరు మీద ఉన్న అకౌంట్ నుంచి యువకుడికి ఫ్రెండ్ రిక్వెస్ట్ రాగా.. దానిని యువకుడు యాక్సెప్ట్ చేశాడని.. ఆ తర్వాత ఇద్దరి మధ్య సంభాషణ మొదలైందన్నారు. ఇద్దరూ నంబర్లను ఇచ్చిపుచ్చుకుని.. ఫోన్‌లో మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. వారి బంధం ప్రేమగా మారి పెళ్లి చేసుకునే వరకు వెళ్లింది. తమది హర్యానాలోని హిసార్ నగరమని.. కలకాలం కలిసి జీవించాలని చెప్పడంతో యువకుడు కూడా అంగీకరించాడు. ఆ తరువాత ఇద్దరూ కలిసి లక్సోర్కు వచ్చి నగరంలోని ఆలయంలో వివాహం చేసుకున్నారు. పెళ్లి సమయంలో అమ్మాయి కుటుంబ సభ్యులు ఎవరూ లేరని తెలిపారు.

పెళ్లి తర్వాత యువకుడు భార్యను గ్రామంలోని తన ఇంటికి తీసుకెళ్లాడు. ఆ తర్వాత ఫస్ట్‌ నైట్ రోజు.. తాను పెళ్లి చేసుకుంది అమ్మాయిని కాదు.. అబ్బాయినని తెలియడంతో షాకయ్యాడు. దీంతో వెళ్లాలంటూ ఆగ్రహం వ్యక్తంచేశాడు. ఈ క్రమంలో వివాహాన్ని విచ్ఛిన్నం చేయడానికి బదులుగా.. తనకు ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలంటూ నిందితుడు డిమాండ్ చేయడంతో యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఇవి కూడా చదవండి

అయితే.. యువకుడి ఫిర్యాదు విని పోలీసులు కూడా ఆశ్చర్యానికి గురయ్యారు.. యువకుడు మౌఖిక సమాచారం ఇచ్చాడని కొత్వాల్ యశ్పాల్ సింగ్ బిష్త్ చెప్పారు. బాధితుడి నుంచి ఫిర్యాదు అందితే విచారణ అనంతరం చర్యలు తీసుకుంటామని వివరించారు. కాగా.. ఈ ఘటన హరిద్వార్‌లో కలకలం రేపింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం..