మొదటి పెళ్లి పేటాకులైందనే కోపంతో 87 పెళ్లిళ్లు చేసుకున్న ప్లేబాయ్‌ కింగ్‌..మరొసారి మాజీ భార్యతో …

ఖాన్ మొదటిసారి వివాహం చేసుకున్న ఆ మహిళనే ఖాన్‌ ఇప్పుడు 88వ పెళ్లిగా తాళికట్టబోతున్నాడు. గతంలో వీరి వివాహం కేవలం ఒక నెల రోజులు మాత్రమే కొనసాగింది. ప్రస్తుతం వీరిద్దరూ చాలా కాలంగా విడివిడిగా ఉంటున్నారు. ఆ తర్వాత వీరిద్దరి మధ్య గాఢమైన ప్రేమ చిగురించిందని అంటున్నారు.

మొదటి పెళ్లి పేటాకులైందనే కోపంతో 87 పెళ్లిళ్లు చేసుకున్న ప్లేబాయ్‌ కింగ్‌..మరొసారి మాజీ భార్యతో ...
Marriage
Follow us
Jyothi Gadda

|

Updated on: Nov 03, 2022 | 1:39 PM

ఒక వ్యక్తి 14 సంవత్సరాల వయస్సులో తనకు మొదటి వివాహం జరిగింది. అయితే, అతని చెడు ప్రవర్తన, విచిత్ర వైఖరి కారణంగా వివాహ బందం ఎక్కువ కాలం నిలువలేదు. రెండేళ్ల తర్వాత అతను విడాకులు తీసుకున్నాడు. ఈ సంఘటనతో ఆ వ్యక్తి చాలా కోపోద్రిక్తుడయ్యాడు. ఆ తర్వాత ఆ వ్యక్తి ఒకరి తర్వాత మరొకరని వివాహం చేసుకోవడం ప్రారంభించాడు. అలా ఏకంగా అతడు 88వ సారి వరుడు కాబోతున్నాడు.. వామ్మో 88వ సారి పెళ్లి పీటలెక్కబోతున్నాడని తెలిసి అందరూ షాక్‌ అవుతున్నారు. ఇక్కడ విశేషం ఏంటంటే.. అతడికి అమ్మాయిలంటే పిచ్చి. దీంతో ఆ వ్యక్తికి ప్లేబాయ్ అనే బిరుదు కూడా వచ్చింది. అయితే, అతడు ఒక సామాన్య రైతు. పూర్తి వివరాల్లోకి వెళితే..

ఇండోనేషియాలోని పశ్చిమ జావాలోని మజలెంగ్కా నివాసి అయిన ‘ఖాన్‌’ అనే 61 ఏళ్ల వ్యక్తి గతంలో 87 సార్లు వివాహం చేసుకున్నాడు. ఇప్పుడు 88వ పెళ్లి చేసుకోబోతున్నాడు. ఈ వివాహానికి సంబంధించిన అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఖాన్ తన మాజీ భార్యలలో ఒకరిని తిరిగి వివాహం చేసుకుంటున్నాడు.. చాలా సార్లు పెళ్లి చేసుకున్నందుకు ఆ వ్యక్తికి ‘ప్లేబాయ్ కింగ్’ అనే బిరుదు లభించింది. కాన్ వృత్తిరీత్యా రైతు. తన మాజీ భార్య తనను పెళ్లి చేసుకోవాలని కోరినప్పుడు, ఆమె తనను తిరస్కరించలేదని ఖాన్ చెప్పాడు.

ఖాన్ మొదటిసారి వివాహం చేసుకున్న ఆ మహిళనే ఖాన్‌ ఇప్పుడు 88వ పెళ్లిగా తాళికట్టబోతున్నాడు. గతంలో వీరి వివాహం కేవలం ఒక నెల రోజులు మాత్రమే కొనసాగింది. ప్రస్తుతం వీరిద్దరూ చాలా కాలంగా విడివిడిగా ఉంటున్నారు. ఆ తర్వాత కూడా వీరిద్దరి మధ్య గాఢమైన ప్రేమ చిగురించిందని అంటున్నారు. అందుకే ఇప్పుడు వీరిద్దరూ మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నారు. మహిళలు ఇష్టపడని పని నేను చేయకూడదని ఖాన్ అంటున్నాడు. అంతేకాదు ఆడవాళ్ల ఫీలింగ్స్ తో నేను ఆడుకోనని అంటున్నాడు. అనైతిక సంబంధం కంటే వారిని పెళ్లి చేసుకోవడం మేలని అంటున్నాడు. ఖాన్‌కు ఇన్ని పెళ్లిళ్లు జరిగినప్పటికీ… అతనికి ఎంత మంది పిల్లలు ఉన్నారనే సమాచారం మాత్రం ఎక్కడా లేదు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!