AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Soybean Dosa : ఇలాంటి దోశలు ఎప్పుడైనా ట్రై చేశారా..? దీంతో రుచి, ఆరోగ్యం రెండు మీ సొంతం..!

ఇలాంటి దోసను తయారు చేసుకుని తినడం వల్ల మనకు విటమిన్ ఇ మరింత ఎక్కువ మోతాదులో లభిస్తుంది. వీటిని తిన‌డం వ‌ల్ల మ‌న‌కు మరెన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి.

Soybean Dosa : ఇలాంటి దోశలు ఎప్పుడైనా ట్రై చేశారా..? దీంతో రుచి, ఆరోగ్యం రెండు మీ సొంతం..!
Instant Dosa
Jyothi Gadda
|

Updated on: Nov 03, 2022 | 12:49 PM

Share

సాధార‌ణంగా రోజూ చాలా మంది ప్రతి ఉదయం ర‌కాల బ్రేక్‌ఫాస్ట్‌ల‌ను త‌యారు చేసుకుని తింటుంటారు. మన దైనందిన జీవితంలో మనం ప్రతిరోజూ అల్పాహారంగా దోసెలు తింటుండటం సాధారణమే..ఉల్లిపాయ దోసె, ప్లేన్‌ దోస, గుడ్డు దోస వంటి అనేక రకాల దోసెలు ఉన్నాయి. కాబట్టి ఈ రోజు మనం పోషకమైన, ఆరోగ్యకరమైన దోసెను గురించి తెలుసుకోబోతున్నామం.. అదేంటి.? ఎలా తయారు చేసుకోవాలి..? ఏం తినాలి అని ఆలోచిస్తున్నారా? సోయా బీన్ దోస మనకు ఆరోగ్య బహుమతిగా చెప్పుకొవచ్చు. సోయా బీన్స్‌లో ప్రోటీన్లు, ఫాస్పరస్, కాల్షియం, పొటాషియం పుష్కలంగా ఉండటం వల్ల మన ఆరోగ్యానికి చాలా మంచిది. మొలకెత్తిన సోయా గింజలను గ్రైండ్ చేయడం ద్వారా ఇలాంటి దోసను తయారు చేసుకుని తినడం వల్ల మనకు విటమిన్ ఇ మరింత ఎక్కువ మోతాదులో లభిస్తుంది. వీటిని తిన‌డం వ‌ల్ల మ‌న‌కు మరెన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. ఇలాంటి ఆరోగ్యవంతమైన సోయా దోసెలు ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం…

అవసరమైన పదార్థాలు.. సోయా బీన్స్ – 2 కప్పులు క్యారెట్ – 2 స్పూన్లు (తురిమినవి) ముల్లంగి – 2 స్పూన్లు (తురిమినవి) ఉల్లిపాయ – 1 టమోటో – 2 బియ్యప్పిండి – 4 చెంచాలు అల్లం – 1 అంగుళం పచ్చిమిర్చి – 4 జీలకర్ర – చెంచా నూనె – అవసరమైనంత ఉప్పు – అవసరమైనంత.

రెసిపీ: ముందుగా సోయా గింజలను గోరువెచ్చని నీటిలో సుమారు 2 గంటల పాటు నానబెట్టాలి. తర్వాత క్యారెట్, ముల్లంగి తురుము వేసి విడిగా ప్లేట్‌లోకి తీసుకోవాలి. తర్వాత టొమాటోలు, ఉల్లిపాయలను మెత్తగా రుబ్బుకోవాలి. నానబెట్టిన సోయాబీన్స్, అల్లం, పచ్చిమిర్చి వేసి మిక్సీ జార్ లో వేసి మెత్తగా రుబ్బుకోవాలి. సోయా మిశ్రమంలో బియ్యప్పిండి, క్యారెట్ తురుము, ముల్లంగి తురుము, జీలకర్ర, ఉల్లిపాయ, టమోటో, ఉప్పు వేసి బాగా కలపాలి. స్టావ్‌పై దోసె పెక్క వేడి అయ్యాక..నూనె రాసి సోయా పిండితో దోసెలా వేసుకోవాలి..దోసె చుట్టూ నూనె పోసి బంగారు రంగు వచ్చే వరకు కాల్చుకుని నచ్చిన ఆకారంలో మడతపెట్టుకుని తిసేసుకోవాలి.. ఆరోగ్యకరమైన దోసె రెడీ!

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి