చలికాలంలో చర్మ సంరక్షణ కోసం ఇలాంటి చిట్కాలు పాటించండి.. మీ స్కిన్‌ మృదువుగా, కాంతివంతంగా మారుతుంది..

ఈ చలికాలంలో చర్మ రక్షణ చాలా అవసరం. లేదంటే చర్మం పగిలిపోయే అవకాశం ఉంది. అదేవిధంగా వేసవిలో అధిక ఎండ నుంచి చర్మాన్ని కాపాడుకోవడం చాలా అవసరం. కాబట్టి

చలికాలంలో చర్మ సంరక్షణ కోసం ఇలాంటి చిట్కాలు పాటించండి.. మీ స్కిన్‌ మృదువుగా, కాంతివంతంగా మారుతుంది..
Beautiful Skin
Follow us
Jyothi Gadda

|

Updated on: Nov 03, 2022 | 10:12 AM

మీ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఇలాంటి ఆహారం కంటే మెరుగైన మార్గం లేదు. కాబట్టి, మీ చర్మానికి అందం పెంచే వాటిని ఉపయోగించే బదులు, ఈ డైట్ చిట్కాలతో చికిత్స చేయండి. ఈ చలికాలంలో చర్మ రక్షణ చాలా అవసరం. లేదంటే చర్మం పగిలిపోయే అవకాశం ఉంది. అదేవిధంగా వేసవిలో అధిక ఎండ నుంచి చర్మాన్ని కాపాడుకోవడం చాలా అవసరం. కాబట్టి ఆరోగ్యకరమైన చర్మాన్ని పొందడంలో మీ ఆహారం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.

నీళ్లు ఎక్కువగా తాగాలి: ఈ చలికాలంలో దాహం తక్కువగా ఉండడంతో నీళ్లు తాగడం మరిచిపోతారు. దీని వల్ల శరీరంలో తేమ తగ్గుతుంది. మీ చర్మాన్ని రీహైడ్రేట్ చేయడానికి ఉత్తమ మార్గం పుష్కలంగా నీరు తాగడం. రోజుకు కనీసం 2 లీటర్ల నీరు త్రాగాలి. నీటికి బదులు నిమ్మరసం లేదా పండ్లరసం తీసుకుంటే శరీరానికి తేమ అందుతుంది.

విటమిన్ సి: విటమిన్ సి అధికంగా ఉండే ఆహారాలలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఇది మీ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. కాబట్టి వీలైనంత ఎక్కువగా ఆరెంజ్ ఫ్రూట్ లేదా ఆరెంజ్ జ్యూస్ తీసుకోవడం మంచిది.

ఇవి కూడా చదవండి

బీట్‌రూట్: బీట్‌రూట్‌లో తగిన స్థాయిలో ప్రొటీన్‌లు ఉంటాయి. ఇది శరీరంలో రక్త పరిమాణాన్ని పెంచడంలో సహాయపడుతుంది. బీట్‌రూట్ మీ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడే వివిధ విటమిన్లు, ఖనిజాలను కలిగి ఉంటుంది. చర్మంలోని మృతకణాలను తొలగించి చర్మాన్ని మృదువుగా, కాంతివంతంగా మార్చుతుంది.

కేల్ వెజిటబుల్స్: ఈ శీతాకాలం ప్రారంభం కావడంతో, కేల్ కూరగాయలు మార్కెట్లలో ఎక్కువగా దొరుకుతాయి. బచ్చలికూర, క్యాబేజీ, ఆవాలు, మెంతి ఆకులలో విటమిన్ కె ఉంటుంది. ఇది మీ చర్మానికి పోషణనిస్తుంది చలికాలం మాత్రమే కాకుండా చర్మాన్ని ఎల్లవేళలా ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.

డ్రై ఫ్రూట్స్: డ్రై ఫ్రూట్స్‌లో చాలా పోషకాలు ఉంటాయి. ఇవి చర్మాన్ని కాంతివంతంగా మార్చడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కాబట్టి, ఈ చలికాలంలో మీ చర్మాన్ని సంరక్షించుకోవడానికి ప్రతిరోజూ ఒక్కో డ్రై ఫ్రూట్ తినడం అలవాటు చేసుకోండి.

మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి:

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!