AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ ఆహారంతో డెంగ్యూ నుంచి త్వరగా కోలుకుంటారు.. అవేంటో తప్పక తెలుసుకోండి..

డెంగ్యూ బారినపడినవారు రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారం తీసుకోవాలి. మీరు ఎంత త్వరగా డెంగ్యూ నుంచి కోలుకుంటారనేది మీరు తీసుకునే ఆహారంపై కూడా ఆధారపడి ఉంటుంది.

ఈ ఆహారంతో డెంగ్యూ నుంచి త్వరగా కోలుకుంటారు.. అవేంటో తప్పక తెలుసుకోండి..
Dengue, Viral Fever
Jyothi Gadda
|

Updated on: Nov 03, 2022 | 8:50 AM

Share

వాతావరణంలో మార్పుల కారణంగా సీజనల్‌ వ్యాధులు వ్యాపిస్తుంటాయి. ముఖ్యంగా చికెన్‌గున్యా, మలేరియా, డెంగీ, వైరల్‌ జ్వరాలు ప్రబలుతాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో డెంగీ జర్వం విజృంభిస్తుంది. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) ప్రకారం, డెంగీ ప్రమాదకరం. డెంగీ వైరస్‌ సోకిన ఏడిస్‌ జాతి దోమలు కుట్టడం వల్ల ఈ జ్వరం వస్తుంది. ఒకవేళ మీరు డెంగ్యూ బారినపడితే తిరిగి కోలుకునే వరకు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే ప్రాణాలకే ప్రమాదం. డెంగ్యూ బారినపడినవారు రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారం తీసుకోవాలి. మీరు ఎంత త్వరగా డెంగ్యూ నుంచి కోలుకుంటారనేది మీరు తీసుకునే ఆహారంపై కూడా ఆధారపడి ఉంటుంది. కాబట్టి డెంగ్యూ బారీ నుంచి సత్వరమే బయటపడేసే కొన్ని ఆహార పదార్థాల గురించి ఇక్కడ తెలుసుకుందాం..

బొప్పాయి పండు, బొప్పాయి ఆకుల జ్యూస్, గంజి, రాగి జావ, క్యారెట్ జ్యూస్, దానిమ్మ, లెమన్ జ్యూస్, కొబ్బరి నీళ్లు, హెర్బల్ టీ లాంటివి తీసుకోవడం చాలా మంచిది. వీటి సాయంతో ప్లేట్ లెట్స్ తగ్గకుండా చూసుకోవచ్చు. ఒక వేళ తగ్గితే వాటి సంఖ్య పెంచుకోవచ్చు. డెంగ్యూ పేషెంట్‌ కివీ పండును ఆహారంలో తీసుకోవడం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే ఇది శరీరంలో రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుంది. అంతేగాక ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి తోడ్పడుతుంది.

డెంగ్యూ బాధితులకు మేక పాలు కూడా ఎంతో మేలు చేస్తాయి. మేక పాలలో సెలెనియం పుష్కలంగా ఉంటుంది. రోగనిరోధక వ్యవస్థ సక్రమంగా పనిచేయడంలో సెలెనియం కీలకపాత్ర పోషిస్తుంది. శరీరంలో వైరస్‌లు వృద్ధి చెందకుండా కూడా సెలెనియం తోడ్పడుతుంది. కాబట్టి డెంగ్యూ పేషెంట్‌లు త్వరగా కోలుకోవడానికి మేక పాలు తీసుకోవడం చాలా ముఖ్యం. పొప్పడి ఆకుల రసం కూడా డెంగ్యూ చికిత్సలో బాగా పనిచేస్తుంది. డెంగ్యూ రోగి పొప్పడి ఆకుల రసం తీసుకోవడం వల్ల ప్లేట్‌లెట్‌ కౌంట్‌ మెరుగుపడుతుంది. అదేవిధంగా రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. మంచి ఫలితం రావాలంటే డెంగ్యూ పేషెంట్‌ పొప్పడి ఆకుల రసాన్ని నీటితో కలిపి రోజుకు రెండుమూడు సార్లు తీసుకోవాలి.

ఇవి కూడా చదవండి

వేప ఆకులలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. ఇవి వైరస్‌ల వృద్ధిని, వ్యాప్తిని అరికట్టడంలో ముఖ్యపాత్ర పోషిస్తాయి. డెంగ్యూ చికిత్సలో ప్రకృతి సిద్ధమైన ఔషధంగా వేప ఆకులు పనిచేస్తాయి. డెంగ్యూ బారిన పడితే శరీరం బాగా డీ హైడ్రేషన్‌కు గురవుతుంది. ఈ సమస్య నుంచి గట్టెక్కడానికి కొబ్బరి నీళ్లు బాగా తోడ్పడుతాయి. కాబట్టి డెంగ్యూ రోగులకు వైద్యులు కొబ్బరి నీళ్లు తాగాలని సూచిస్తుంటారు.

మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
ఏషియన్ గేమ్స్ గోల్డ్ మెడల్స్.. టీమిండియా ప్లేయర్లతో మోదీ భేటీ
ఏషియన్ గేమ్స్ గోల్డ్ మెడల్స్.. టీమిండియా ప్లేయర్లతో మోదీ భేటీ
బట్టతల ఉందని రిజెక్ట్.. రూ.లక్ష ఖర్చు చేసిన డేట్‌లో ట్విస్ట్‌!
బట్టతల ఉందని రిజెక్ట్.. రూ.లక్ష ఖర్చు చేసిన డేట్‌లో ట్విస్ట్‌!
ఖాతాదారుడు, నామినీ ఇద్దరూ మరణిస్తే బ్యాంకులోని డబ్బు ఎవరికి..?
ఖాతాదారుడు, నామినీ ఇద్దరూ మరణిస్తే బ్యాంకులోని డబ్బు ఎవరికి..?
అమ్మాయి, అబ్బాయి ఎవరైనా సరే నచ్చితే పెళ్లి చేసుకుంటా..
అమ్మాయి, అబ్బాయి ఎవరైనా సరే నచ్చితే పెళ్లి చేసుకుంటా..
అభిషేక్ ఊరమాస్ విధ్వంసం.. కోహ్లీ, రోహిత్ రికార్డులు బద్దలు..!
అభిషేక్ ఊరమాస్ విధ్వంసం.. కోహ్లీ, రోహిత్ రికార్డులు బద్దలు..!
వాస్తు శాస్త్రం: ఇంట్లో రావి చెట్టు పెరగడం శుభమా? అశుభమా?
వాస్తు శాస్త్రం: ఇంట్లో రావి చెట్టు పెరగడం శుభమా? అశుభమా?
గ్యాస్ స్టవ్ మంట చిన్నగా వస్తుందా.. జస్ట్ ఇలా చేస్తే చాలు..
గ్యాస్ స్టవ్ మంట చిన్నగా వస్తుందా.. జస్ట్ ఇలా చేస్తే చాలు..
Video: నేపాల్‌లో మరో వరద బీభత్సం.. బుధి గండకి నది ఉగ్రరూపం!
Video: నేపాల్‌లో మరో వరద బీభత్సం.. బుధి గండకి నది ఉగ్రరూపం!
మహిళలు, ట్రాన్స్‌జెండర్లకు సర్కార్ బంపర్ ఆఫర్..!
మహిళలు, ట్రాన్స్‌జెండర్లకు సర్కార్ బంపర్ ఆఫర్..!
అభిషేక్ శర్మ విధ్వంసం.. 18 బంతుల్లో హాఫ్ సెంచరీ..
అభిషేక్ శర్మ విధ్వంసం.. 18 బంతుల్లో హాఫ్ సెంచరీ..