AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? మీరు వ్యాపారంలో పెట్టుబడి పెట్టకూడదు, వారి ఆర్థిక పరిస్థితులు మెరుగ్గా ఉంటాయి

ఈరాశి వారు ఆత్మవిశ్వాసంతో అనుకున్న పనులు పూర్తి చేస్తారు. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. కుటుంబీకులు, బంధువులతో ఆనందంగా గడుపుతారు. విష్ణు సహస్రనామ పారాయణ చేయటం మంచిది.

Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? మీరు వ్యాపారంలో పెట్టుబడి పెట్టకూడదు, వారి ఆర్థిక పరిస్థితులు మెరుగ్గా ఉంటాయి
Zodiac Sign
Jyothi Gadda
|

Updated on: Nov 03, 2022 | 7:11 AM

Share

మేషం.. మీ రాశివారికి మీరు తలపెట్టిన పనులను విజయవంతంగా పూర్తిచేస్తారు. చంచలబుద్ధి వల్ల ఇబ్బందులు రాకుండా చూసుకోవాలి. ఇష్టమైన వారితో గడుపుతారు. కీలకమైన వ్యవహారాలు దైవబలంతో పూర్తవుతాయి.దుర్గారాధన చేయటం మేషరాశి వారికి శుభప్రదం.

వృషభం.. ఈ రాశివారికి వృత్తి,ఉద్యోగ,వ్యాపారాది రంగాలలో శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది. ప్రణాళికాబద్ధంగా వెళ్లకపోవడం వలన కొన్ని సమస్యలు ఎదురవుతాయి. కొన్ని సమయాల్లో అస్థిరబుద్ధితో వ్యవహరిస్తారు. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. నవగ్రహ ధ్యానం చేయటం మీకు శుభప్రదంగా ఉంటుంది.

మిథునం.. ఈ రాశివారు రోజు మనోబలం తగ్గకుండా చూసుకోవాలి.దుర్గాదేవిని ఆరాధించాలి. మిశ్రమకాలం. ఇబ్బందిపెడుతున్న సమస్యలను నిర్లక్ష్యం చేయకండి. శత్రువుల విషయంలో ఆచితూచి అడుగు వేయాలి.

ఇవి కూడా చదవండి

కర్కాటకం.. ఈ రాశివారికి రంగాల్లో కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. మీ అధికార పరిధి పెరుగుతుంది. సమయానుకూలంగా ముందుకు సాగి అందరి మన్ననలను అందుకుంటారు. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. ఈశ్వరాభిషేకం శుభకరంగా ఉంటుంది.

సింహం.. ఈ రాశివారికి చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయి. మానసికంగా దృఢంగా ఉంటారు. బుద్ధిబలం బాగుండటం వల్ల కొన్ని కీలక వ్యవహారాలలో నుంచి బయటపడగలుగుతారు. శివ నామస్మరణ శుభప్రదం.

కన్య.. ఈ రాశివారికి ఒక ముఖ్యమైన సమస్య పరిష్కారం అవుతుంది. ఇష్టమైన వారితో కాలాన్ని గడుపుతారు. వ్యాపారంలో అనుకూలఫలితాలు ఉన్నాయి. చిత్తసౌఖ్యం ఉంది. ఇష్టదైవం స్తుతి శుభప్రదం.

తుల.. ఈ రాశివారికి ఈ రోజు మిశ్రమ వాతావరణం ఉంటుంది. మీ మీ రంగాల్లో జాగ్రత్తగా మెలగాలి. అధికారులతో ఆచితూచి వ్యవహరించాలి. శాంతంగా వ్యవహరిస్తే మేలు జరుగుతుంది. విరోధులను తక్కువగా అంచనా వేయవద్దు. సూర్య ఆరాధన చేస్తే మంచిది.

వృశ్చికం.. ఈ రాశివారు ఈ రోజు గొప్ప ఫలితాలను సాధిస్తారు. సుఖ సౌఖ్యాలు కలవు. ఒక వార్త మనోధైర్యాన్నిపెంచుతుంది. సుఖసంతోషాలతో గడుపుతారు. చక్కటి ప్రణాళికలతో వ్యాపారంలో లాభాలను పొందుతారు . శ్రీవేంకటేశ్వరస్వామి ఆరాధన శ్రేయోదాయకం.

ధనుస్సు.. ఈ రాశివారు ఈ రోజు మంచి ఫలితాలను పొందగలరు. మానసిక ప్రశాంతత ఉంటుంది. ప్రారంభించిన పనిలో ఆత్మీయుల సహకారం అందుతుంది. బంధువులతో మేలు జరుగుతుంది. ఆధ్యాత్మిక విషయాల్లో చురుగ్గా పాల్గొంటారు. చంద్రశేఖరాష్టకం చదవడం శుభప్రదం.

మకరం.. ఈ రాశివారికి వృత్తి,ఉద్యోగ,వ్యాపారాది రంగాలలో మీకు ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయి. పట్టుదల వదలకండి. కలహ సూచన. అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది.  దక్షిణామూర్తి స్తోత్రం చదివితే మంచిది.

కుంభం.. ఈ రాశివారికి ఈ రోజు అనుకూల వాతావరణం ఉంటుంది. ఆర్ధికంగా జాగ్రత్తగా ఉండటం అవసరం. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. మీ అధికార పరిధి పెరుగుతుంది. లక్ష్మీగణపతి ఆరాధన చేయటం శుభప్రదం.

మీనం..

ఈ రాశివారికి ముఖ్యమైన కార్యక్రమాల్లో కాస్త ఆలస్యం జరిగే సూచనలు ఉన్నాయి. ఆపదలు కలుగకుండా జాగ్రత వహించాలి. శ్రమకు తగిన గుర్తింపు దక్కడానికి బాగా కష్టపడాల్సి వస్తుంది. విష్ణు సహస్రనామ పారాయణ చేయటం మంచిది.

Follow Us
కస్తూర్బా స్కూల్ వైరల్ వీడియో: దేవతలు, దయ్యాలు అంటూ విద్యార్థిని
కస్తూర్బా స్కూల్ వైరల్ వీడియో: దేవతలు, దయ్యాలు అంటూ విద్యార్థిని
రైస్ + చపాతీ కాంబినేషన్ మంచిదా?ఆరోగ్య నిపుణులు చెప్పిన అసలు విషయం
రైస్ + చపాతీ కాంబినేషన్ మంచిదా?ఆరోగ్య నిపుణులు చెప్పిన అసలు విషయం
ఈ వింత ఘటన వెనుక అసలు కథేంటి..?
ఈ వింత ఘటన వెనుక అసలు కథేంటి..?
మీ హైబీపీని చిటికెలో తగ్గించే పవర్.. దానిమ్మ vs బీట్‌రూట్‌..
మీ హైబీపీని చిటికెలో తగ్గించే పవర్.. దానిమ్మ vs బీట్‌రూట్‌..
నీచ రవితో ఈ రాశులకు దశ తిరిగే ఛాన్స్..! లిస్ట్‌లో మీ రాశి ఉందా..?
నీచ రవితో ఈ రాశులకు దశ తిరిగే ఛాన్స్..! లిస్ట్‌లో మీ రాశి ఉందా..?
ప్లాన్ ఏ తస్సుమందని, ప్లాన్ బీతో వచ్చాం.. అయినా దంచేశాడయ్యా..!
ప్లాన్ ఏ తస్సుమందని, ప్లాన్ బీతో వచ్చాం.. అయినా దంచేశాడయ్యా..!
ఫ్లిప్‌కార్ట్‌లో బ్రాండెడ్ ఏసీలు సగం ధరకే.. అద్భుతమైన ఆఫర్లు!
ఫ్లిప్‌కార్ట్‌లో బ్రాండెడ్ ఏసీలు సగం ధరకే.. అద్భుతమైన ఆఫర్లు!
అమరావతికి రైలు కనెక్టివిటీకి సంబంధించి లేటెస్ట్ అప్‌డేట్స్..
అమరావతికి రైలు కనెక్టివిటీకి సంబంధించి లేటెస్ట్ అప్‌డేట్స్..
నవరాత్రి వ్రతంలో సైంధవ లవణం వాడొచ్చా? ఉపవాసంలో ఉప్పు వాడే ముందు..
నవరాత్రి వ్రతంలో సైంధవ లవణం వాడొచ్చా? ఉపవాసంలో ఉప్పు వాడే ముందు..
నవరాత్రులు స్పెషల్.. అమ్మ వారికీ కచ్చితంగా పెట్టాల్సిన నైవేద్యం
నవరాత్రులు స్పెషల్.. అమ్మ వారికీ కచ్చితంగా పెట్టాల్సిన నైవేద్యం