AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తిరుమలలో భారీగా పెరిగిన భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 15 గంటల సమయం

మంగళవారం తిరుమల ఆలయంలోని కల్యాణోత్సవ మండపంలో శ్రీ మలయప్ప స్వామి, శ్రీదేవి, భూదేవి సమేతంగా ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం నిర్వహించారు..టన్నుల కొద్దీ వివిధ రకాల పూలు, ఆకులతో ఊరేగింపును వైభవంగా నిర్వహించారు.

తిరుమలలో భారీగా పెరిగిన భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 15 గంటల సమయం
Ttd Brahmotsavam 2022
Jyothi Gadda
|

Updated on: Nov 02, 2022 | 1:37 PM

Share

తిరుమలలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. శ్రీవారి దర్శనం కోసం 31 కంపార్టుమెంట్లలో భక్తులు వేచియున్నారు. వీరికి సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు. మంగళవారం స్వామివారిని 72,176 మంది భక్తులు దర్శించుకోగా 25,549 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 4.12 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు.

మరో వైపు తిరుమల,తిరుపతి దేవస్థానం శ్రీవారి భక్తులకు టైంస్లాట్‌ విధానాన్ని తిరిగి ప్రారంభించింది. తిరుప‌తిలోని భూదేవి కాంప్లెక్స్‌, శ్రీ‌నివాసం కాంప్లెక్స్‌, గోవింద‌రాజ‌స్వామి స‌త్రాల వ‌ద్ద మంగ‌ళ‌వారం అర్ధరాత్రి నుంచి స‌ర్వద‌ర్శనం టైంస్లాట్ టోకెన్ల జారీ ప్రక్రియను పునఃప్రారంభించారు. శని, ఆది, సోమవారాల్లో 25 వేల టోకెన్లు, మిగ‌తా రోజుల్లో రోజుకు 15 వేల టోకెన్లు జారీ చేయనున్నామని టీటీడీ అధికారులు వెల్లడించారు. టోకెన్ ల‌భించిన భ‌క్తుడు అదేరోజు ద‌ర్శనం చేసుకునేలా ఏర్పాటు చేశారు. మూడు ప్రాంతాల్లో 30 కౌంటర్ల ద్వారా టోకెన్లు జారీ చేస్తామ‌ని, నిర్దేశిత కోటా పూర్తవగానే కౌంటర్లు మూసివేస్తామని వివరించారు.

ప్రస్తుతం తిరుమల శ్రీవారికి వార్షిక పుష్పయాగం నిర్వహిస్తున్నారు. మంగళవారం తిరుమల ఆలయంలోని కల్యాణోత్సవ మండపంలో శ్రీ మలయప్ప స్వామి, శ్రీదేవి, భూదేవి సమేతంగా ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఈ సందర్భంగా గార్డెన్ కార్యాలయం నుంచి తిరుమల ఆలయం వరకు టన్నుల కొద్దీ వివిధ రకాల పూలు, ఆకులతో ఊరేగింపును వైభవంగా నిర్వహించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్